Begin typing your search above and press return to search.

నాగబాబు వన్ అండ్ ఓన్లీనా ?

నియమ నిబంధనల మేరకు ముఖ్యమంత్రి కాకుండా మొత్తం పాతిక మంది మంత్రులను ఏపీ కేబినెట్ లోకి తీసుకోవచ్చు.

By:  Tupaki Desk   |   5 Jan 2025 4:20 AM GMT
నాగబాబు వన్ అండ్ ఓన్లీనా ?
X

ఏపీలో మంత్రివర్గ విస్తరణ మార్పులు చేర్పులు అంటూ వార్తలు పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్నాయి. నిజానికి చూస్తే కేబినెట్ లో ఒకే ఒక బెర్ట్ ఖాళీగా ఉంది. నియమ నిబంధనల మేరకు ముఖ్యమంత్రి కాకుండా మొత్తం పాతిక మంది మంత్రులను ఏపీ కేబినెట్ లోకి తీసుకోవచ్చు.

అయితే 2024 జూన్ 12న చంద్రబాబు సారధ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరినపుడు 24 మందినే మంత్రులుగా తీసుకున్నారు. నాడు ఒక మంత్రి పదవిని అలా వదిలేశారు. ఆ ఖాళీ ఎంతో మంది ఆశావహులను ఊరిస్తూ వస్తోంది. చిట్ట చివరికి అది మెగా బ్రదర్ నాగబాబు కోసమే అని గత నెలలో తేల్చేశారు.

స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఇదే విషయం చెప్పాక ఇక నాగబాబు కాబోయే మంత్రి అన్నది కన్ఫర్మ్ అయిపోయింది. ఎపుడు ఎలా అన్నది జస్ట్ ముహూర్తం కోసమే తప్ప మంత్రిగా నాగబాబు తప్పకుండా బాధ్యతలు అందుకోవడం ఖాయమైపోయింది.

అయితే ఈ వార్త ఇలా ప్రచారంలో ఉండగానే మరో వైపు ఏపీ కేబినెట్ నుంచి పలువురిని తొలగిస్తారని వారి స్థానంలో కొత్త వారిని తీసుకుంటారు అని పుంఖానుపుంఖాలుగా వార్తలు వచ్చాయి. ఫలానా వారిని తప్పిస్తారని రాయలసీమ నుంచి ఆయన పేరు ఉందని ఉత్తరాంధ్ర నుంచి ఈయన పేరు ఉందని ప్రచారాలు హోరెత్తాయి.

అయితే ఇలాంటి ఊహాగానాలకు సహజంగా ప్రభుత్వం అధికారికంగా ఖండించి వివరణ ఇచ్చేది ఉండదు. అయితే అలా రోజు రోజుకీ వ్యవహారం శృతి మించి పోతూండడంతో పాటు ఈ ప్రచారంతో చాలా మంది మంత్రులు ఫుల్ టెన్షన్ తో ఉండడంతో ఎట్టకేలకు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ రియాక్ట్ అయ్యారు. కొత్త మంత్రులు రావడం లేదు, ఉన్న మంత్రులు పోవడం లేదు అని ఆయన క్లారిటీ ఇచ్చారు. అవినీతి అసమర్థత కారణంగానే మంత్రులను తప్పిస్తారని కూటమిలో అలాంటి వారు లేరని ఆయన ఖండితంగా చెప్పేశారు.

దాంతో ఈ విషయం మీద కొంత స్పష్టత వచ్చింది. ఆ తరువాత మరో మంత్రి కొల్లు రవీంద్ర కూడా ఇదే విషయం చెప్పారు. నాగబాబు ఒక్కరే కొత్త మంత్రిగా చేరుతారు తప్ప తీసివేతలు అయితే ఉండవని అన్నారు. దీంతో మంత్రులుగా ఉన్న వారు ప్రస్తుతం స్థిమిత పడ్డారు ఇదిలా ఉంటే మంత్రులకు వారి పనితీరు మెరుగుపరచుకోమని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు తరచూ దిశా నిర్దేశం చేస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. అలా చాలా మంది మెరుగుపడ్డారు.

మిగిలిన వారికి కూడా తగిన అవకాశం ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు చూస్తున్నారు అని అంటున్నారు. అలా కాకుండా కేవలం ఏడెనిమిది నెలల వ్యవధిలోనే మంత్రులను కొందరిని తప్పిస్తే అది కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేక సంకేతాలు వెళ్లెలా ఉంటుందని కూడా ఆలోచిస్తున్నారు

అంతే కాదు ఒక్కసారి మార్పు చేర్పులకు దిగితే ఆశావహులు అంతా యాక్టివ్ అవుతారన్ని పదవులు దక్కని వారిలో అసంతృప్తి పెరుగుతుందని అది రాజకీయ రచ్చగా మారుతుందని కూడా ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. అందువల్ల ఏమైనా మార్పులు చేయాలన్న కనీసం ఏడాది సమయం తీసుకుని ఆ మీదట చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనతోనే ఉన్నారని అంటున్నారు. దాంతో ఏప్రిల్ నెలలో ఒకే ఒక్క మంత్రిగా నాగబాబు ప్రమాణం చేస్తారు అని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో.