Begin typing your search above and press return to search.

నాగబాబు ప్రమాణం ఖాయం...డేట్ ఫిక్స్ చేసేది ఆయనే !

అయితే నాగబాబుని ఎపుడు మంత్రిగా ప్రమాణం చేయించాలి ఆ ముహూర్తం ఏమిటి అన్నది మాత్రం చంద్రబాబు పవన్ కే వదిలిపెట్టినట్లుగా తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   16 Dec 2024 2:41 PM GMT
నాగబాబు ప్రమాణం ఖాయం...డేట్ ఫిక్స్ చేసేది ఆయనే !
X

మెగా బ్రదర్ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ప్రమాణానికి ముహూర్తం ముంచుకొస్తోంది. నిజానికి ఇప్పటికి వారం క్రితం ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాగబాబుని మంత్రివర్గంలోనికి తీసుకుంటున్నామని ప్రకటించడం ఒక అరుదైన విషయం గానే చూస్తున్నారు.

ఏ విషయం అయినా ఒకటికి పదిమార్లు ఆలోచించి కానీ ప్రకటించని చంద్రబాబు నాగబాబుని మంత్రిగా తీసుకుంటామని చెప్పి సంచలనం రేపారు. అయితే ఆ ప్రకటన తరువాత ఒకటి రెండు రోజులలోనే నాగబాబు ప్రమాణం ఉంటుందని అనుకున్నారు.

అయితే ఆ వెంటనే 11, 12 తేదీలలో కలెక్టర్ల సదస్సు, 13న స్వర్ణాంధ్ర 2047 డిక్లరేషన్ విడుదల 14న ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాలు, 15న పొట్టి శ్రీరాములు వర్ధంతి ఇలా వరసబెట్టి చంద్రబాబు పవన్ ఫుల్ బిజీ అయిపోయారు. ఇపుడు ఈ ఇద్దరు నేతలూ కలసి నాగబాబు ప్రమాణం ఎపుడు ఏమిటి అన్నది చర్చించారని తెలుస్తోంది.

ఈ ఇద్దరు నేతల భేటీలో నాగబాబుని మంత్రిగా తీసుకోవడంతో పాటు ఆయనకు ఏ ఏ శాఖలు ఇవ్వాలన్నది కూడా ప్రస్తావనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. నాగబాబుని మంత్రిగా ముందు చేసి మరో నాలుగు నెలలలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీలలో ఒకదానికి ఎంపిక చేసి పెద్దల సభలోకి తీసుకుంటారు అని అంటున్నారు.

రాజ్యాంగం ప్రకారం ఆరు నెలల వ్యవధి లోపల రెండు సభలలో ఏదో ఒక దానికి నాగబాబు సభ్యుడు కావాలి. అయితే ఆయన మంత్రిగా ఇపుడు ప్రమాణం చేసి ఆ నిర్దిష్ట కాలం లోపల చట్టసభలకు ఎన్నిక కావచ్చు. దాని వల్ల నాగబాబు మంత్రి అయ్యేందుకు ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు అని అంటున్నారు.

అయితే నాగబాబుని ఎపుడు మంత్రిగా ప్రమాణం చేయించాలి ఆ ముహూర్తం ఏమిటి అన్నది మాత్రం చంద్రబాబు పవన్ కే వదిలిపెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మార్గశిరమాసం సాగుతోంది. మంచి రోజులు అన్నీ ఉన్నాయి. మరో పదిహేను రోజులలో పుష్య మాసం ప్రవేసిస్తుంది.

అది పూర్తిగా శూన్య మాసం. మళ్లీ ఫిబ్రవరి దాకా మంచి ముహూర్తాలు అయితే లేవని అంటున్నారు. అందువల్ల నాగబాబు మంత్రిగా ప్రమాణం చేసేది డిసెంబర్ లోనే అని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఈ వారంలో అయినా ఆశ్చర్యపోనవసరం లేదు అని అంటున్నారు.

ఆ మేరకు మంచి ముహూర్తం డేట్ అన్నీ ఫిక్స్ చేసుకోమని చంద్రబాబు పవన్ కే వదిలేశారు అని అంటున్నారు. ఇపుడు మెగా ఫ్యామిలీతో చర్చింది నాగబాబుని మంత్రిగా చేసే మంచి రోజు ఏది అన్నది డిసైడ్ చేయాల్సిన బాధ్యత పవన్ మీదనే ఉంది అని అంటున్నారు.

మరో వైపు చూస్తే ఒక్క నాగబాబుకే చాన్స్ ఇస్తారా లేక చిన్న సైజు పునర్ వ్యవస్థీకరణ చేసి కొందరికి తీసి మరికొందరికి అవకాశం ఇస్తారా అన్నది కూడా చర్చగా ఉన్నది. అయితే ఏపీ కేబినెట్ లో మొత్తం పాతిక మంది దాకా మంత్రులను తీసుకోవచ్చు. జూన్ 12న 24 మందికి మాత్రమే తీసుకున్నారు. 25వ బెర్త్ అలాగే ఉంది.

పైగా జనసేనకు నాలుగు మంత్రి పదవులు ఇస్తారని ప్రామిస్ ఉందని అంటున్నారు. దాంతో ఇపుడు ఆ ఒక్క ఖాళీని భర్తీ చేస్తున్నారు తప్పించి అందులో వేరే ఏ విశేషం లేదని అంటున్నారు. అందువల్ల మంత్రివర్గంలో చిన్నపాటి మార్పు చేర్పులు కూడా వుండవని అంటున్నారు.

ఇక నాగబాబు ఒక్కరే సింగిల్ గా ప్రమాణం చేస్తారు అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే మంత్రి పదవుల విషయంలో కోటి ఆశలు పెట్టుకున్న టీడీపీ జనసేనలలో అసంతృప్తి కొంత ఉంది అన్న వార్తలు కూడా నిరాధారం అని అంటున్నారు. అంతా ఒక పద్ధతి ప్రకారమే జరుగుతోందని ఇందులో కొత్త వింత లేదని అంటున్నారు.

నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడం పట్ల ఎవరికీ ప్రత్యేకంగా అసంతృప్తి ఉండే చాన్స్ లేదని అంటున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు ఒకసారి నిర్ణయించాక కూటమిలో మరే ఆలోచన రానే రాదు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే చంద్రబాబు పవన్ కి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. నాగబాబుని ఎపుడు మంత్రిగా చేసేది కూడా పవన్ కే వదిలేశారు అన్నది ప్రచారంలో ఉన్న మాట. సో ఆ ముహూర్తం తొందరలోనే అనౌన్స్ చేయవచ్చు అని అంటున్నారు.