Begin typing your search above and press return to search.

రేవంత్ హైడ్రాకు నాగబాబు సెల్యూట్...మరి ఏపీలో ?

తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి తీసుకుని వచ్చిన హైడ్రా వ్యవస్థకు సెల్యూట్ అంటున్నారు మెగా బ్రదర్ నాగబాబు.

By:  Tupaki Desk   |   2 Sep 2024 3:57 AM GMT
రేవంత్ హైడ్రాకు నాగబాబు సెల్యూట్...మరి ఏపీలో ?
X

తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి తీసుకుని వచ్చిన హైడ్రా వ్యవస్థకు సెల్యూట్ అంటున్నారు మెగా బ్రదర్ నాగబాబు. ఆయన కేవలం మెగా బ్రదర్ మాత్రమే కాదిపుడు. ఏపీలో టీడీపీలో కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేనకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మరి ఇంతటి ముఖ్య పాత్రలో ఉన్న నాగబాబు తోటి తెలుగు రాష్ట్రం తెచ్చిన హైడ్రా వ్యవస్థ బాగుంది అంటే ఆయన మెచ్చుకోలు వెనక ఏముంది అన్న డౌట్లూ తప్పనిసరిగా వస్తాయి.

తెలంగాణాలో హైడ్రా చేస్తోంది అక్రమ కట్టడాలని కూల్చివేయడాలు. అక్రమ కట్టడాలు ఎక్కడ ఉన్నా కూకటి వేళ్ళతో కూల్చి పడేస్తోంది. చెరువులు కాలువలు, గుంటలు ఆక్రమించుకున్న వారి భరతం పడుతోంది. అలాంటి హైడ్రాని నాగబాబు తెగ మెచ్చుకోవడమే కాదు రేవంత్ రెడ్డి గారూ మా సపోర్టు మీకే అని కూడా సోషల్ మీడియా వేదికగా ఓపెన్ గా ప్రకటించేశారు

హైడ్రా హైదరాబాద్ లో అక్రమ కట్టడాలను ఒక్క మాటున కూల్చేస్తోంది. అలా హైడ్రా అంటేనే హడల్ పుట్టిస్తోంది. అయితే హైడ్రా అవసరం ఏమిటో నాగబాబు సోషల్ మీడియా ద్వారా పంచుకున్న తీరు ఆ టైమింగ్ ఇపుడు చర్చగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

అంతే కాదు హైదరాబాద్ కానీ విజయవాడ కానీ వాన పడితే నీట మునుగుతోంది. వీటి వెనక అక్రమ కట్టడాలే ఉన్నాయని అంతా అంటున్న నేపధ్యం ఉంది. ఈ క్రమంలో నాగబాబు ఈ తీరున స్పందించడం మాత్రం కచ్చితంగా పొలిటికల్ గా బిగ్ డిబేట్ కి ఆస్కారం ఇస్తోంది

వర్షాలకు తూములు ఏరులు చెరువులు ఉప్పొంగి పోయి ఏకంగా నగరాల మీదకు వస్తున్నాయి అంటే అది ఎంత బాధాకరం అని నాగబాబు వ్యాఖ్యానించారు. అంతే కాదు అపార్ట్మెంట్లలో కూడా నీళ్ళు వచ్చే సామాన్య ప్రజలు బలి అవుతున్నారు అని ఆయన అంటున్నారు. దీనికి ముఖ్య కారణం చెరువులు కాలువలను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టడమే అని ఆయన అన్నారు.

దాంతోనే ఆయన పెద్ద ఎత్తున స్పందించారు. తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేపట్టిన హైడ్రా కాన్సెప్ట్ ఇప్పటికైనా అర్థమైందా అని ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని, నిబద్ధతతో కూడిన చర్యలను మనమందరం అభినందిద్దాం అని అంటున్నారు. అంతే కాదు రేవంత్ రెడ్డి గారూ మా సంపూర్ణ సహకారం మీకే అని అవుట్ రేట్ గా నాగబాబు సపోర్ట్ ఇచ్చారు

సరే దీనిని ఇక్కడితో ముగించేద్దామా అంటే అసలు కుదరదు. ఎందుకంటే ఏపీలో బెజవాడ నిండా మునిగిన నేపథ్యం కళ్ళెదుట ఉంది. దానికి కారణం కూడా కృష్ణా నదీ కరకట్టను ఆక్రమించుకుని పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు చేపట్టడమే. అలాగే కొండలను కోనలను కూడా కబ్జా చేసి నివాసాలు ఏర్పాటు చేసుకోవడమే. మరి హైడ్రా ఏపీకి కూడా కావాలని జనాలు కోరుతున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది. రేవంత్ రెడ్డి చేసినది మెచ్చుకున్న నాగబాబు ఏపీలో హైడ్రా కోసం ప్రభుత్వాన్ని కోరుతారేమో అన్న కొత్త చర్చకు తెర లేస్తోంది. అదే కనుక జరిగితే మాత్రం ఏపీలోనూ రాజకీయ ప్రకంపనలు చెలరేగడం ఖాయం.