Begin typing your search above and press return to search.

రేసులోకి దూసుకొచ్చిన నాగబాబు ?

ఇవన్నీ ఇలా ఉంటే మంత్రిగా కంటే రాజ్యసభ సభ్యుడిగానే పనిచేసేందుకు నాగబాబు ఉత్సాహం చూపిస్తున్నారు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   26 Jan 2025 3:44 AM GMT
రేసులోకి దూసుకొచ్చిన నాగబాబు ?
X

ఏపీలో ఒక రాజ్యసభ సీటు ఖాళీ అయింది. ఈ సీటు పదవీ కాలం అచ్చంగా మూడున్నరేళ్ల. దాంతో ఈ సీటుకు యమ డిమాండుగా ఉంది. టీడీపీ జనసేనల నుంచి కూడా ఆశావహులు పోటీకి సిద్ధపడుతున్నారు. నిజానికి ఈ సీటు నుంచి బీజేపీకి చెందిన అభ్యర్థిని గెలిపించుకోవాలన్న ఆలోచనలో బీజేపీ ఉంది.

బీజేపీకి రాజ్యసభలో బలం చాలా ముఖ్యం. ఆ విషయంలో పార్టీ చేయాల్సిన రాజకీయ మంత్రాంగం అంతా చేస్తోంది అన్న మాట కూడా ఉంది. బీజేపీకే ఈ సీటు అని ఏపీలోని కూటమి పెద్దలకు తేల్చి చెప్పేశారు అని అంటున్నారు. అయితే ఎవరి ఆశలు వారికి ఉంటాయి కాబట్టి పోటీలోకి వస్తున్న వారు మళ్ళీ కనిపిస్తున్నారు.

టీడీపీ నుంచి సీనియర్ నేతల పేర్లు గట్టిగా వినిపిస్తూంటే జనసేన నుంచి మెగా బ్రదర్ నాగబాబు ఒక్కసారిగా రేసుకోకి దూసుకుని వచ్చారు. నాగబాబుని నిజానికి గత ఏడాది చివరిలో జరిగిన మూడు ఖాళీల ఎన్నికలపుడే రాజ్యసభకు పంపించాలి. కానీ చివరి నిముషంలో ఒక సీటు బీజేపీకి వెళ్ళిపోయింది. అలా లాస్ట్ మినిట్ లో చేజారింది అని అంతా అనుకున్నారు.

దానికి బదులుగా ఆయనను ఏపీ కేబినెట్ లో మంత్రిగా తీసుకుంటామని చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. అయితే ఆ ప్రకటన వచ్చి నెలలు గడుస్తున్నా కార్యరూపం అయితే దాల్చడం లేదు. మార్చిలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉంటాయి. ముందు ఎమ్మెల్సీ కావాలి. ఆ తరువాత మంత్రిగా చేరాలి.

ఇవన్నీ ఇలా ఉంటే మంత్రిగా కంటే రాజ్యసభ సభ్యుడిగానే పనిచేసేందుకు నాగబాబు ఉత్సాహం చూపిస్తున్నారు అని అంటున్నారు. ఈ మేరకు ఆయన తన సోదరుడు పవన్ తో చర్చిస్తున్నారు అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ కోరితే బీజేపీ ఈ సీటుని వదిలేసుకుంటుంది అని అంటున్నారు. జనసేనకు కూడా రాజ్యసభలో తొలి ప్రాతినిధ్యం దక్కుతుంది అని లెక్క వేసుకుంటున్నారు.

మరో వైపు అన్నదమ్ములు ఇద్దరూ రాష్ట్ర మంత్రివర్గంలో ఉండే కంటే ఒకరు జాతీయ రాజకీయాలో ఉంటూ ఢిల్లీ స్థాయిలో పార్టీ వాయిస్ వినిపిస్తే ఉభయ తారకంగా ఉంటుందని లాంగ్ టెర్మ్ లో పార్టీకి అది ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు. ఏది ఏమైనా నాగబాబు రాజ్యసభ ఎంపీగా వెళ్ళడానికే మొగ్గు చూపిస్తున్నారు అన్నది లేటెస్ట్ టాక్ మరి బీజేపీ ఈ చాన్స్ జనసేనకు ఇస్తుందా అన్నది ఇక్కడ బిగ్ క్వశ్చన్.

అదే కనుక జరిగితే మాత్రం మెగా బ్రదర్ తాను కోరుకుంటున్నట్లుగా పెద్దల సభకు వెళ్తారు అని అంటున్నారు. మార్చిలో రాజ్యసభ ఖాళీలకు ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. సో అప్పటికి మరో రెండు మూడు వికెట్లు కనుక వైసీపీ నుంచి పడితే నాగబాబుకి రాజ్యసభ మెట్లు ఎక్కడం మరింత ఈజీ అవుతుందన్న టాక్ కూడా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.