నాగబాబు ఎంట్రీ.. ఆ శాఖ ఆయనకేనా?
నాగబాబుకు ఎలాంటి శాఖ ఇస్తారన్న విషయం చర్చకు వస్తోంది. అయితే.. దీనిపై పలు రకాల వాదనలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
By: Tupaki Desk | 11 Dec 2024 5:38 AM GMTజనసేన నాయకుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబు కూటమి ప్రభుత్వంలో మంత్రి కానున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన వచ్చిన తర్వాత.. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో విస్తృత స్థాయిలో చర్చ సాగుతోంది. మంత్రి వర్గంలోకి తీసుకుంటానని సీఎం చంద్రబాబు ప్రకటించిన దరిమిలా.. నాగబాబుకు ఎలాంటి శాఖ ఇస్తారన్న విషయం చర్చకు వస్తోంది. అయితే.. దీనిపై పలు రకాల వాదనలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
కొందరు సినీమాటో గ్రఫీ శాఖను ఇస్తారని.. కొందరు పర్యాటక శాఖ ఇస్తారని చెబుతున్నారు. అయితే.. నాగబాబు శైలి మాత్రం దీనికి చాలా భిన్నం. ఆయన ఇలాంటి శాఖలు తీసుకునే రకంకాదనేది ఆయన గురించి తెలిసిన వారికి స్పష్టంగా తెలుస్తుంది. ఆయన దూకుడు స్వభావం.. వ్యవహార శైలి తెలిసిన వారికి ఈ శాఖలు కేటాయిస్తే.. నాగబాబు అంగీకరించబోరన్న విషయం తెలుసు. ఈ క్రమంలోనే ఇప్పుడు నాగబాబు కు ఏ శాఖ ఇస్తారన్న వాదన బలంగా సాగుతోంది.
దీనిపై జనసేన వర్గాల నుంచి సేకరించిన అభిప్రాయం ప్రకారం.. నాగబాబుకు హోం శాఖను కేటాయిం చే అవకాశం ఉందని తెలిసింది. కొన్నాళ్ల కిందట.. పవన్ కల్యాణ్.. ఇదే ప్రకటన చేసిన విషయం తెలిసిం దే. హోం శాఖ మంత్రిగా తాను ఉంటేనా? అంటూ.. ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఆయనకు ఇప్పటికే కొన్ని శాఖలు కేటాయించారు. కాబట్టి ఆయనకు అవకాశం లేకపోవచ్చు. పైగా.. ఆయన నేరుగా హోం శాఖను తీసుకునే ప్రతిపాదన కూడా లేదు.
ఈ నేపథ్యంలో తన సోదరుడు నాగబాబుకు హోం శాఖను ఇప్పించే అవకాశం ఉందని మెజారిటీ జనసేన నాయకులు చెబుతున్నారు. వైసీపీని కట్టడిచేసేందుకు.. నాగబాబు అయితే సరైన నాయకుడిగా చంద్రబాబు వద్ద.. పవన్ ఒప్పించినట్టు చెబుతున్నారు. అదేసమయంలో జనసేనకు కూడా మరింత గౌరవం ఇచ్చినట్టు అవుతుందని అంటున్నారు. ఈ క్రమంలో హోం శాఖ అయితే.. సీఎం, డిప్యూటీ సీఎం తర్వాత.. స్థాయిలో ఉంటుందని వారు చెబుతున్నారు. సో.. దీనిని బట్టి.. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. నాగబాబుకు హోం శాఖ ఖాయమని అంటున్నారు. మరి ఇప్పటికే ఉన్న మంత్రి వంగల పూడి అనితకు ఏ శాఖ కేటాయిస్తారో చూడాలి.