వైసీపీ ఇంకా పూర్తిగా చావలేదు... నాగబాబు వార్నింగ్ ఏమిటి?
అవును... ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచీ సోషల్ మీడియా వేదికగా కొన్ని విషపు రాతలు రాస్తున్నారని ఫైరవుతున్నారు నాగబాబు.
By: Tupaki Desk | 14 Jun 2024 4:05 AM GMTఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... టీడీపీ - బీజేపీ - జనసేన కూటమి అధికారంలోకి వచ్చింది. మరోపక్క వైసీపీ ఘోర ఓటమి చవిచూసిన పరిస్థితి. ఈ సమయంలో టీడీపీ - బీజేపీ - జనసేన కూటమి స్పిరిట్ ని దెబ్బతీసేలా కొన్ని విషయపు రాతలు రాస్తున్నారని.. వైసీపీ ఇంకా పూర్తిగా చావలేదని, బ్రతికే ఉందని అంటూ... సీరియస్ వ్యాఖ్యలు, స్ట్రాంగ్ వార్నింగ్ లతో ఒక వీడియోని విడుదల చేశారు నాగబాబు.
అవును... ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచీ సోషల్ మీడియా వేదికగా కొన్ని విషపు రాతలు రాస్తున్నారని ఫైరవుతున్నారు నాగబాబు. “అవి ఏమిటో మాత్రం చెప్పడం ఇష్టం లేదని” అన్నారు. అనంతరం... ఎవరైనా సరే, అటువంటి విషపు సర్క్యులేషన్స్ ని ప్రచారంలోకి తీసుకొస్తే అది చాలా తప్పని తెలిపారు. కారణం... అది టీడీపీ - బీజేపీ - జనసేన కూటమి స్పిరిట్ కి తప్పుడు సంకేతాలు ఇస్తుందని చెప్పుకొచ్చారు.
అటువంటి పనులు ఎవరు చేసినా సోర్సేమిటో కనుక్కుని తగిన విధంగా బుద్దిచెప్పాల్సి ఉంటుందని అన్నారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు, మోడీ, పురందేశ్వరి చాలా కష్టపడి తయారుచేసిన అద్భుతమైన కూటమి ఇదని, అలాంటి కూటమి స్పిరిట్ ఎఫెక్ట్ అయ్యేలా ఎవరైనా రాతలు రాస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అన్నారు.
ఈ సందర్భంగా ఇలాంటి రాతలు రాయించేది.. వైసీపీ ప్రేరేపితమైన కొంతమంది వ్యక్తులు అని అన్నారు. ఈ వీడియోతోపాటు... "జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి స్పిరిట్ ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఖశ్చితంగా తన తగిన కఠిన చర్యలు తీసుకోబడతాయి.. వైసీపీ ఇంకా పూర్తిగా చావలేదు, బతికే వుంది. ఆ కోరల్లోంచి వచ్చే విషపు రాతలివి. వాటినెవ్వరు పట్టించుకోకండి" అని రాసుకొచ్చారు.
అయితే... ఇంతకూ ఆ విషపురాతలు ఏమిటి.. వేటిని విషపురాతలుగా పరిగణించాలి అనే క్లారిటీ లేకుండా... ఇలా ముసుగులో గుద్దులాట ఆడటంపై నెట్టింట కామెంట్లు వైరల్ అవుతున్నాయి! ఆ విషపు రాతలు ఏమిటో చెప్పేస్తే కార్యకర్తలు జాగ్రత్తపడతారుగా అనేది మరో కామెంట్. ఏది ఏమైనా... నాగబాబు మాత్రం ఏదో బలమైన విషయాన్నే చెప్పాలనే ప్రయత్నం చేశారని మాత్రం అభిమానులు అంటున్నారు.