Begin typing your search above and press return to search.

దీంతో... ఆ నోట్ వల్లోకొంత ఆయన చేసిన ట్వీట్లు మరింత చర్చనీయాంశం అవుతుంటాయి!

దీంతో... ఆ నోట్ వల్లోకొంత ఆయన చేసిన ట్వీట్లు మరింత చర్చనీయాంశం అవుతుంటాయి!

By:  Tupaki Desk   |   21 March 2024 2:39 PM GMT
దీంతో... ఆ నోట్ వల్లోకొంత ఆయన చేసిన ట్వీట్లు మరింత చర్చనీయాంశం అవుతుంటాయి!
X

అప్పుడప్పుడూ ఆన్ లైన్ వేదికగా నాగబాబు చేసే ట్వీట్లు, పోస్టులు తీవ్ర చర్చనీయాంశం అవుతుంటాయి. వాటిలో కొన్ని డైరెక్టుగానే ఉండగా.. మరొకొన్నిమాత్రం అటు తిప్పి ఇటు తిప్పి సమాధానాన్ని జనాలకు వదిలేస్తుంటారు! పైగా ఎవరూ భుజాలు తడుముకోవద్దన్నట్లుగా ఒక నోట్ పెడుతుంటారు. దీంతో... ఆ నోట్ వల్లోకొంత ఆయన చేసిన ట్వీట్లు మరింత చర్చనీయాంశం అవుతుంటాయి! తాజాగా అలాంటి నోట్ తో కూడిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది!

అవును... నిన్నమొన్నటివరకూ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి అని.. కాదు కాదు.. నరసాపురం ఎంపీ అభ్యర్థి అనీ నాగబాబు పొలిటికల్ ఫ్యూచర్ పై రకరకాల కథనాలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే... కూటమిలో భాగంగానో, పవన్ కల్యాణ్ గట్టిగా నిలబడకపోవడం వల్లో, కారణం ఏదైనా నాగబాబుకి మాత్రం అటు అనకాపల్లి, ఇటు నరసాపురంలలో ఎక్కడా టిక్కెట్ దక్కలేదు! దీంతో ఆయన అభిమానులు కూడా హర్ట్ అయ్యారని అంటున్నారు!

ఈ సమయంలో తాజాగా ఆన్ లైన్ వేదికగా స్పందించిన నాగబాబు... "వయసు ఎక్కువ, పెద్దవాడు అని ప్రతీ వెధవనూ గౌరవించక్కర్లేదు. ఎందుకంటే వెధవలు కూడా పెద్దవాళ్లవుతారు" అని ఒక పోస్ట్ పెట్టారు. దీనికి ముందుగానే.. "గమనిక: ఏమి మాట్లాడిన మా గురించేనేమో అని ఆపాదించుకుంటున్నారు.. ఇది ఎన్నికల సమర సమయంలో నా‌ ఉద్దేశాలు చెప్తున్న తప్ప ఎవరిని ఉద్దేశించి కాదు.. పైన చెప్పింది జీవిత సత్యం" అని రాసుకొచ్చారు.

దీంతో ఈ ట్వీట్ పై నెట్టింట ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఇందులో భాగంగా... నాగబాబు చేసిన ట్వీట్ టీడీపీ అధినేత చంద్రబాబునే ఉద్దేశించి అయ్యి ఉంటుందని ఒక చర్చ స్టార్ట్ అయ్యింది. ఈ సమయంలో చర్చకు దారి తీసిన ఈ పాయింట్ కి అనేక రకాల కారణాలను కూడా చెబుతున్నారు నెటిజన్లు. ఇందులో భాగంగా... అందరి నేతల్లా ఎన్నికల ప్రచారం చేసుకోకుండా ఈ రోజు నాగబాబు ఇంట్లో కుర్చున్నారంటే అందుకు చంద్రబాబే కారణం అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

పొత్తులో భాగంగా ఎమ్మెల్యే టిక్కెట్లు 24 అని, ఎంపీ టిక్కెట్లు 3 అని చెప్పిన సమయంలో... కాకినాడ, మచిలీపట్నం, అనకాపల్లి / నరసాపురం నియోజకవర్గాల నుంచి జనసేన అభ్యర్థులు బరిలోకి దిగుతారని.. అందులో భాగంగా అనకాపల్లి / నరసాపురం నుంచి మెగా బ్రదర్ నాగబాబు పోటీ చేస్తారని కథనాలొచ్చాయి! అయితే... ఆ 24 కాస్తా 21 అయిన సంగతి కాసేపు పక్కనపెడితే... ఆ 3 కాస్తా 2 అవ్వడంతో నాగబాబు త్యాగం చేయక తప్పలేదని చెబుతున్నారు.

అందుకు కారణం తన తమ్ముడు కూడా అనే విషయాన్ని కాసేపు పక్కనపెట్టిన నాగబాబు... తనకు టిక్కెట్ దక్కకపోవడానికి ప్రధాన కారణం మాత్రం చంద్రబాబు, ఆయన రాజకీయమే అని బలంగా నమ్ముతుండి ఉండవచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే నాగబాబు తన ఆగ్రహాన్ని, అసహనాన్ని, ఆవేశాన్ని ఇలా బయటపెట్టి ఉంటారని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

మరోపక్క... నాగబాబు చేసిన ట్వీట్ జగన్ ని ఉద్దేశించి అని ఎందుకు అనుకోకూడదు అనే చర్చ కూడా తెరపైకి వచ్చింది. దీంతో... నాగబాబు కంటే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వయసు తక్కువే అని.. ఆ లెక్కన చూసుకుంటే జగన్ కంటే పెద్దవాడైన నాగబాబు ఆ ట్వీట్ చేయరని, తనకంటే పెద్దవారైన వారి గురించే చేసి ఉంటారని లాజిక్కులు లాగుతున్నారు! దీంతో... ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారింది.

మరి ఈ విషయంపై నాగబాబు క్లారిటీ ఇస్తారా.. లేక, నెటిజన్ల క్రియేటివిటీకే వదిలేస్తారా అనేది వేచి చూడాలి!! అఫ్ కోర్స్... ఈ పోస్ట్ తో పాటు గమనిక కూడా పెట్టారనుకోండి!!