Begin typing your search above and press return to search.

"మావాడు - పరాయివాడు"... నాగబాబు ట్వీట్ ఎవరి కోసం?

"మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే...!" ఇది నాగబాబు చేసిన ట్వీట్.

By:  Tupaki Desk   |   14 May 2024 4:12 AM GMT
మావాడు - పరాయివాడు...  నాగబాబు ట్వీట్  ఎవరి కోసం?
X

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఫలితాల కోసం ఎదురుచూపుల సమయం స్టార్ట్ అయ్యింది. ఈ ఎన్నికల వేళ మెగా ఫ్యామిలీలో ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. అందుకు కారణమైంది.. మెగా బ్రదర్ నాగబాబు చేసిన తాజా ట్వీటు! ఈ నేపథ్యంలో... ఆ ట్వీటు నాగబాబు ఎవరిని ఉద్దేశించి చేసిఉంటారనే చర్చ నెట్టింట వైరల్ గా మారింది.

అవును... నాగబాబు తాజాగా చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఆ ట్వీట్ కింద కామెంట్స్ సెక్షన్ లో ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేసి ఉంటారనే విషయంపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఇందులో భాగంగా... ఈ ట్వీట్ అల్లు అర్జున్ ని ఉద్దేశించి చేసి ఉంటారని ఒకరంటే... ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ ను ఉద్దేశించి.. అని మరికొందరు ఇంటర్ ప్రిటేషన్ చేస్తూ కామెంట్లు పెడుతుండటం గమనార్హం.

"మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే...!" ఇది నాగబాబు చేసిన ట్వీట్. దీంతో... ఏపీ ఎన్నికలు మెగా ఫ్యామిలీలో మళ్లీ చిచ్చుపెట్టాయని.. అల్లు - కొణిదెల మధ్య అవి స్పష్టమైన విభజన రేఖను గీసేశాయని.. పొలిటికల్ గోడలు కట్టేశాయని.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టేలా నాగబాబు చేసిన ట్వీటే అందుకు కారణం అనే చర్చ రచ్చగా మారింది!

వాస్తవానికి పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి మెగా ఫ్యామిలీ అండగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నాగబాబు కుటుంబం సహా పిఠాపురంలో ప్రచారం చేస్తే... మెగా మేనల్లుళ్లు రంగంలోకి దిగారు. ప్రధానంగా మెగాస్టార్ చిరంజీవి వీడియో సందేశం ఇచ్చారు. తన తమ్ముడిని గెలిపించాలని పిఠాపురం ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఎన్నికల ప్రచారం చివరి రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. పిఠాపురం వచ్చారు. అయితే.. పవన్ కల్యాణ్ కి మద్దతుగా ట్వీట్ చేసిన అల్లు అర్జున్ మాత్రం.. తన స్నేహితుడైన వైసీపీ అభ్యర్థి కోసం నంద్యాల వెల్లడం సంచలనంగా మారింది. అక్కడ తన స్నేహితుడ్ని గెలిపించాలని బన్నీ ఓటర్లకు పిలుపునిచ్చారు. దీంతో బన్నీ వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారనే ప్రచారం భారీగా జరిగింది.

ఫలితంగా... జనసైనికులు నిప్పులు చెరిగారు.. ఏఏ నెక్స్ట్ మూవీపై తమ ప్రభావం ఉంటుందనే కామెంట్లూ చేశారు! ఈ నేపథ్యంలోనే నాగబాబు.. అల్లూ అర్జున్ ని ఉద్దేశించి ఈ కామెంట్లు చేసి ఉంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు. అదే నిజమైతే ఈ వ్యవహారంపై బన్నీ స్పందిస్తారా.. లేదా అనేది వేచి చూడాలి!