Begin typing your search above and press return to search.

'జట్టులో ఆడాలంటే కోడలపై చీటింగ్ కేసు పెట్టాలని ఒత్తిడి'

తాజాగా నరసరావుపేట కోర్టులో జరిగిన లోక్అదాలత్ లో ఈ కేసుపై రాజీ పడినట్లుగా పేర్కొన్నారు.

By:  Tupaki Desk   |   9 March 2025 10:05 AM IST
జట్టులో ఆడాలంటే కోడలపై చీటింగ్ కేసు పెట్టాలని ఒత్తిడి
X

దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పైనా.. ఆయన కొడుకు మీదా పెట్టిన చీటింగ్ కేసును రాజీ చేసుకున్నారు మాజీ రంజీ క్రికెటర్ నాగరాజు. తాజాగా నరసరావుపేట కోర్టులో జరిగిన లోక్అదాలత్ లో ఈ కేసుపై రాజీ పడినట్లుగా పేర్కొన్నారు. కేసు రాజీ అనంతరం మీడియాలో మాట్లాడిన నాగరాజు సంచలన విషయాల్ని వెల్లడించారు.

తనపై వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి.. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు ఒత్తిడి చేయటంతోనే తాను కోడెల శివప్రసాద రావు.. ఆయన కొడుకు శివరామక్రిష్ణ లపై చీటింగ్ కేసు పెట్టినట్లుగా స్పష్టం చేశారు. వారి పైన కేసు పెడితేనే రంజీ క్రికెట్ లో ఆడే అవకాశం ఇస్తామని బెదిరింపులకు దిగినట్లు చెప్పారు.

ఈ కారణంగానే రైల్వే లో ఉద్యోగం ఇప్పిస్తామని రూ.15 లక్షలు లంచం అడిగారని.. కోడెల శివప్రసాదరావు.. ఆయన కొడుకు శివరామక్రిష్ణలపై కేసు పెట్టినట్లు చెప్పారు. ఆంధ్రా టీంలో ఆడనివ్వరన్న భయంతోనే కేసు పెట్టానని.. తన కంప్లైంట్ లోవాస్తవం లేదని పేర్కొన్నారు.ఈ కారణంగానే లోక్ అదాలత్ కు హాజరై కేసు విషయంలో రాజీ చేసుకున్నట్లుగా పేర్కొన్నారు.