Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్... హీరో నాగార్జున "ఎన్" కన్వెషన్ కూల్చివేత!!

తమిడికుంట చెరువును కబ్జా చేసి.. "ఎన్" కన్వేషన్ నిర్మించారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు 'జనం కోసం' సంస్థ ప్రతినిధి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   24 Aug 2024 4:34 AM GMT
బిగ్  బ్రేకింగ్... హీరో నాగార్జున ఎన్ కన్వెషన్  కూల్చివేత!!
X

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన "హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ" (హైడ్రా)... చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, నాలాలు మొదలైన వాటిని ఆక్రమించి నిర్మించిన కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో హాట్ టాపిక్ గా మారిన "ఎన్" కన్వెన్షన్ వివాదంపై దృష్టిపెట్టినట్లుంది.

అవును... గతంలో ఓ సారి "ఎన్" కన్వెషన్ నిర్మాణానికి సంబంధించిన వివాదం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ కట్టడ నిర్మాణం అక్రమంగా జరిగిందని.. చెరువు భూమిని ఆక్రమించి దీన్ని కట్టారనే కామెంట్లు వినిపించాయి.. కథనాలు హల్ చల్ చేశాయి! అయితే తాజాగా ఈ కట్టడంపై హైడ్రా ఎంట్రీ ఇచ్చింది. కూల్చివేత పనులు మొదలుపెట్టింది.

తమిడికుంట చెరువును కబ్జా చేసి.. "ఎన్" కన్వేషన్ నిర్మించారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు 'జనం కోసం' సంస్థ ప్రతినిధి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. తమిడికుంట చెరువుకు సంబంధించిన సుమారు 3.30 ఎకరాల స్థాలంలో ఈ కన్వెషన్ హాల్ నిర్మించారని.. ఇది అక్రమ కట్టడం అని.. దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారని అంటున్నారు.

ఇదే క్రమంలో... ఈ అక్రమ కట్టడాలపై హైడ్రా చర్యలు తీసుకోవాలని.. ఫలితంగా తమిడికుంట చెరువుకు పూర్వ వైభవం తీసుకురావాలని భాస్కర్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారని తెలుస్తోంది. దీంతో.. డాక్యుమెంట్లను పరిశీలించిన అధికారులు.. ఆక్రమించిన స్థలంలో ఎన్ కన్వెషన్ కట్టినట్లు నిర్ధారించుకుని, కూల్చివేత మొదలుపెట్టారని సమాచారం!