Begin typing your search above and press return to search.

బ్రేకింగ్... "ఎన్" కన్వెషన్ కూల్చివేతపై నాగార్జున ఫస్ట్ రియాక్షన్!

ఈ మేరకు ఈ విషయాన్ని ట్వీట్ చేసిన నాగార్జున... అనంతరం ఈ కూల్చివేతపై హైకోర్టును ఆశ్రయించారని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   24 Aug 2024 8:08 AM GMT
బ్రేకింగ్... ఎన్  కన్వెషన్ కూల్చివేతపై నాగార్జున ఫస్ట్  రియాక్షన్!
X

సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన "ఎన్" కన్వెషన్ ను హైడ్రా బృందం ఈ రోజు ఉదయం కూల్చివే కూల్చి వేసిన సంగతి తెలిసిందే. మాదాపూర్ లో భారీ బందోబస్తు మధ్య ఈ కన్వెషన్ కూల్చివేతను అధికారులు చేపట్టారు. ఈ నేపథ్యంలో నాగార్జున స్పందించారు.

అవును.. హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. "హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెషన్స్ ఏజెన్సీ" (హైడ్రా) ను ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. విపత్కర పరిస్థితుల్లో నగరానికి అండగా ఉండటంతో పాటు ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలగించడం, చెరువులను రక్షించడం దీని ప్రధాన లక్ష్యాలు. ఈ నేపథ్యంలో... ఎన్ కన్వెషన్ కూల్చివేత పనులు చేపట్టారని అంటున్నారు.

ఇలా మాదాపుర్ లోని "ఎన్" కన్వెన్షన్ ను కూల్చేసే ప్రక్రియ చేపట్టడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. శనివారం ఉదయం నుంచి అన్ని మీడియాల్లోనూ ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఒకసారి ఈ నిర్మాణంపై ఆరోపణలు వచ్చిన విషయంపై చర్చ మొదలైంది. ఇదే సమయంలో దీనిపై నాగార్జున రియాక్షన్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. ఈ సమయంలో నాగార్జున రియాక్ట్ అయ్యారు.

ఇందులో భాగంగా... స్టే ఆర్డర్లు, కోర్టు కేసులకు విరుద్ధంగా "ఎన్" కన్వెషన్ కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరమని నాగార్జున అన్నారు. తమ ప్రతిష్టను కాపాడటం కోసం, కొన్ని వాస్తవాలని తెలియజేయడం కోసం, చట్టాన్ని ఉల్లంఘించేలా తాము ఎటువంటి చర్యలూ చేపట్టలేదని తెలపడం కోసం ఓ ప్రకటన జారీ చేయడం సరైందని భావిస్తున్నట్లు చెబుతూ విషయాలు వెల్లడించారు!

వాస్తవానికి ఆ భూమి పట్టా భూమి అని.. అందులో ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదని.. పూర్తిగా ప్రైవేటు స్థలంలో నిర్మించిన భవనం అది అని.. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చ్యబడిందని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే.. స్పష్టంగా చెప్పాలంటే... ఇప్పుడు జరిగిన కూల్చివేతల చట్ట విరుద్ధంగా.. లేదా, తప్పుడు సమాచారంతో జరిగిందని అన్నారు.

ఇదే సమయంలో... ఈ రోజు ఉదయం కూల్చివేతకు ముందు తమకు ఎలాంటి నోటీసులూ జారీ చేయలేదని.. కేసులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదని.. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా.. కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే తానే కూల్చివేత నిర్వహించి ఉండేవాడినని నాగార్జున వెల్లడించారు. ఇదే సమయంలో... అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు.

అక్కడ తమకు న్యాయం జరుగుతుందని నాగార్జున ఆశాభావం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా... తాజా పరిణామాల వల్ల తాము ఆక్రమణలు చేశామని.. తప్పుడు నిర్మాణాలు చేపట్టామని.. ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని.. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే తమ ప్రధాన ఉద్దేశమని నాగార్జున స్పష్టం చేశారు.

ఈ మేరకు ఈ విషయాన్ని ట్వీట్ చేసిన నాగార్జున... అనంతరం ఈ కూల్చివేతపై హైకోర్టును ఆశ్రయించారని తెలుస్తోంది.