Begin typing your search above and press return to search.

రుషికొండ ప్యాలెస్... చంద్రబాబుకు సీబీఐ మాజీ డైరెక్టర్ సలహా!

ఈ నేపథ్యంలో తాజాగా సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వర రావు ఈ వ్యవహారంపై చంద్రబాబుకు ఎక్స్ వేదికగా ఓ సలహా ఇచ్చారు. రుషికొండ ప్యాలెస్ ను ఎలా వినియోగిస్తే బాగుంటుందనే విషయంపై స్పందించారు.

By:  Tupaki Desk   |   21 Jun 2024 12:30 AM GMT
రుషికొండ ప్యాలెస్... చంద్రబాబుకు సీబీఐ  మాజీ  డైరెక్టర్  సలహా!
X

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో రుషికొండ ప్యాలెస్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. పైగా ఇప్పుడు ఈ చర్చ రాష్ట్ర స్థాయి దాటి జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే జాతీయ మీడియాలో కథనాలు వస్తున్న పరిస్థితి. దీంతో... ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఆసక్తిగా మారింది.

అవును... ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో రుషికొండ ప్యాలెస్ ల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఇంతకాలం ఆ భవనాలు లోపల ఎలా ఉంటుందో కూడా తెలియని నేపథ్యంలో... తాజాగా ఆ రుషికొండ ప్రాంతం వచ్చే భీమిలీ నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మీడియాను తీసుకుని వెళ్లడంతో... ఆసక్తికర విషయాలు తెరపైకి వచ్చాయి.

ఈ సమయంలో ఆ భవనాల విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోందనే విషయంపై తీవ్ర ఆసక్తినెలకొన్న వేళ.. పలుసలహాలూ సూచనలు అందుతున్నాయి! ఈ నేపథ్యంలో తాజాగా సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వర రావు ఈ వ్యవహారంపై చంద్రబాబుకు ఎక్స్ వేదికగా ఓ సలహా ఇచ్చారు. రుషికొండ ప్యాలెస్ ను ఎలా వినియోగిస్తే బాగుంటుందనే విషయంపై స్పందించారు.

ఇందులో భాగంగా... తొలుత జగన్ ప్రభుత్వం హయాంలో జరిగిన రుషికొండ ప్యాలెస్ నిర్మాణంలో అక్రమాలు, ప్రజాధనం దుర్వినియోగం, అవినీతి మొదలైన ఆరోపణలపై విచారణ జరిపించాలని చంద్రబాబు కోరారు నాగేశ్వర రావు. అనంతరం దీన్ని సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రిగా మార్చాలని.. తద్వారా ప్రజలకు అంకితం చేయాలని సూచించారు.

ఢిల్లీలోని ఎయిమ్స్ లేదా జిప్ మర్ తరహాలో ఈ రుషికొండ ప్యాలెస్ భవనాలను మార్చి ప్రజలకు అంకితం చేయాలని.. తద్వారా ఏపీని తన వ్యక్తిగత ద్వేషంగా మార్చుకున్న జగన్ కు తగిన సమాధానం చెప్పాలని సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వర రావు కోరారు. ఇదే సమయంలో... గొప్ప శాస్త్రవేత్తల్లో ఒకరైన డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు పేరును ఆ ఆస్పత్రికి పెట్టాలని కూడా ఆయన బాబుకు సూచించారు.

ఇలా రోజు రోజుకీ ఏపీ రాజకీయాల్లో రుషికొండ ప్యాలెస్ విషయం మరింత హాట్ టాపిక్ గా మారుతున్న వేళ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనేది ఆసక్తిగా మారింది.