జగన్..బాబు.. పవన్ : పార్టీ ఏదైనా పాట మాత్రం ఆయనదే !
ఈ నల్గొండ గద్దర్ స్పెషాలిటీ ఏంటి అంటే ఆయన లేటెస్ట్ గా ఒక యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ తన పాటకు టెన్ మిలియన్ వ్యూస్ అతి తక్కువ సమయంలో దక్కడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
By: Tupaki Desk | 9 May 2024 1:21 PM GMTఆయన నల్గొండ వాసి. మంచి గాయకుడు. ఆయన అసలు పేరు కాసాల నరసన్న. రాజకీయ పార్టీలకు పాటలు పాడి వాటి అద్భుతమైన విజయం వెనక నిలవడంతో ఆయన రెండు తెలుగు రాష్ట్రాలలో పాపులర్ అయ్యారు. గద్దర్ గొంతుకను పుణికి పుచ్చుకున్న ఆయన స్వరం ఈనాటి యువతరాన్ని ఊపేస్తోంది.
ఆయన వైసీపీకి తాజాగా అందించిన పాట జెండలు జత కట్టడమే మీ అజెండా. జనం గుండెలలో గుడి కట్టడమే జగన్ అజెండా అంటూ సాగింది. ఏపీని ఒక ఊపు ఊపేసింది. ఎన్నికల వేళ ఎక్కడ చూసినా అదే పాట మారు మోగుతోంది. ఇంతకీ ఈ పాట వెనక ఉన్న కధ ఏమిటి ఈ నల్గొండ గద్దర్ స్పెషాలిటీ ఏంటి అంటే ఆయన లేటెస్ట్ గా ఒక యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ తన పాటకు టెన్ మిలియన్ వ్యూస్ అతి తక్కువ సమయంలో దక్కడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
తనను వైసీపీ వారు సంప్రదించి ఎన్నికల కోసం ఒక పాట చేయమని అడిగారు అని పూర్తి స్వేచ్చ కూడా ఇచ్చారని నల్గొండ గద్దర్ చెప్పారు. ఆ మీదట బుల్లెట్ బండి పాటతో పాపులర్ అయిన పాటల రచయిత లక్ష్మణ్ తో కలసి జెండలు జత కట్టడమే అన్న సాంగ్ ని తయారు చేశామని చెప్పారు.
జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారు, ఆయన అయిదేళ్ల పాలన ఏమిటి, ఏపీలో రాజకీయాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ స్టడీ చేసి ఈ పాటను రూపొందించామని ఈ రోజున వరల్డ్ వైడ్ గా ఈ సాంగ్ సూపర్ హిట్ గా నిలిచిందని అన్నారు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్రాంతి పండుగ వేళ తన ఇంటికి పిలిపించుకుని మరీ తనను ఆదరించారని, ఆయన తన చేత పాటలు పాడించి విని ఆనందించారని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే ఏపీ రాజకీయాల్లో చూస్తే టీడీపీ కూటమికి కూడా ఎన్నికల పాటలు ఉన్నాయి. చంద్రబాబు మీద టీడీపీ మీద పాటలు కూడా పాడింది ఎవరో కాదు నల్గొండ గద్దరే. అలాగే పవన్ కళ్యాణ్ జనసేనకు కూడా ఆయన పాటలు పాడారు. ఇలా మూడు పార్టీలకూ ఎన్నికల ప్రచారంలో పాటలు పాడడం అవి హిట్ కావడం పట్ల నల్గొండ గద్దర్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
ఏపీలో రాజకీయ పార్టీ ఏదైనా ఎవరి అజెండా ఏదైనా ఎవరి ఆలోచనలు ఎవైనా గొంతు మాత్రం ఒక్కరిదే. అదే నల్గొండ గద్దర్ ది. ఆయన తన పాటలతో ఒక ఊపు ఊపేస్తున్నారు. ఇంతకు ముందు తెలంగాణా ఎన్నికల్లో మూడు జెండాల పార్టీ అంటూ కాంగ్రెస్ కి ఎన్నికల పాటలను నల్గొండ గద్దర్ పాడారు. రేవంత్ రెడ్డి లీడర్ షిప్ క్వాలిటీస్ ని హైలెట్ చేస్తూ ఆయన పాడిన పాటలు అక్కడ సూపర్ హిట్ అయ్యాయి.
ఇపుడు ఏపీ ఎన్నికల వేళ పార్టీలకు అతీతంగా ఆయన గొంతు మారు మోగుతోంది. నిజంగా ఇది ఒక విశేషంగానే చెప్పాలి. సాధారణంగా ఒక రాజకీయ పార్టీ ఎంగేజ్ చేసిన ఆర్టిస్టులను మరో పార్టీ దగ్గరకు రానీయదు. కానీ ఏపీలో పోటా పోటీగా సాగుతున్న ప్రచారంలో నువ్వా నేవా అంటూ జరుగుతున్న ఎన్నికల యుద్ధంలో అందరికీ నల్గొండ గద్దర్ గొంతు నచ్చడం విశేషం అయితే ఆయన పాటలను అన్ని పార్టీల వారూ ఆస్వాదిస్తున్నారు. ఈసారి ఎన్నికల పాటలలో జెండలు జత కట్టడమే అన్నింటా టాప్ గా నిలిచింది అని ఆయన ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జగన్ రియల్ హీరో అందుకే ఇంత హిట్ అయింది తన పాట అని అంటున్నారు.