అనపర్తిలో టీడీపీ పోటీపై నల్లమిల్లి ఫైనల్ క్లారిటీ!
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలోని కూటమిలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By: Tupaki Desk | 5 April 2024 10:18 AM GMTఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలోని కూటమిలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధానంగా అభ్యర్థుల ఎంపికల విషయంలో ఏ పార్టీ వారికీ సరైన సంతృప్తి లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో... సరికొత్త సమస్యలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే 144లోనే అందరికీ సీట్ల సర్దుబాట్లు చేయలేక కొంతమందిని జనసేనలోకి పంపినా కూడా టీడీపీకి ఇబ్బందులు తప్పడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ సమయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... అభ్యర్థుల జాబితా ప్రకటలో భాగంగా అనపర్తి టిక్కెట్ ను నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి కేటాయించింది! దీంతో ఆయన ప్రచార కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు! అయితే అనూహ్యంగా ఆ టిక్కెట్ ను బీజేపీకి కేటాయిస్తూ ప్రకటన వచ్చేసింది. దీంతో.. నల్లమిల్లి & కో నిప్పులు చెరిగారు.
నల్లమిల్లి అనుచరులు ఆత్మహత్యాయత్నాలూ చేశారు! అనపర్తిలో బీజేపీ అభ్యర్థిని ఓడించి తీరుతామన్న స్థాయిలో సవాళ్లు విసిరారు! దీంతో... చంద్రబాబు పునరాలోచనలో పడ్డారని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే రామకృష్ణారెడ్డితో మాట్లాడటం, బుజ్జగించే ప్రయత్నాలు చేయడం వంటివి చేసినా.. ఆయన ఎక్కడా తగ్గలేదని అంటున్నారు. దీంతో... నల్లమిల్లి తో చంద్రబాబు మరోసారి భేటీ అయ్యారని తెలుస్తుంది!
ఈ నేపథ్యంలో తాజా పరిస్థితిపై నల్లమిల్లి మీడియాతో మాట్లాడారు. ఇందులో భాగంగా.. అనపర్తిలో టీడీపీనే పోటీ చేస్తుందని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఇదే సమయంలో... టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయినట్లు చెప్పిన ఆయన... శుక్రవారం సాయంత్రంలోపు ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. అందువల్ల... నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసారు.
దీంతో... అనపర్తి విషయంలో కూటమికి ఉన్న సమస్య సద్దుమణిగినట్లే అని అంటున్నారు తమ్ముళ్లు! మరోపక్క... అనపర్తి స్థానంలో బీజేపీకి కేటాయించబోయే సీటుపైనా ఆసక్తి నెలకొంది. పైగా... బీజేపీ నేతలు అనపర్తి కావాలంటే... రాజమండ్రి రూరల్, రాజమండ్రి అర్బన్ లలో ఏదో ఒక టిక్కెట్ అడుగుతున్నట్లు కథనాలొస్తున్నాయి!! మరి ఈ సమస్యకు ఎలా ముగింపు జరుగుతుందనేది వేచి చూడాలి!