హాట్ టాపిక్... నామా నాగేశ్వరరావు కారు దిగిపోబోతోన్నారా?
ఇదే అదనుగా తెలంగాణ రాజకీయాల్లో బీఆరెస్స్ ఉనికి పోగొట్టడానికి కాంగ్రెస్, బీజేపీలు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటున్నారు.
By: Tupaki Desk | 24 March 2024 1:05 PM GMTతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత బీఆరెస్స్ రాజకీయంగా దెబ్బ మీద దెబ్బ తగులుతుందనే చర్చ రాజకీయవర్గాల్లో బలంగా వినిపిస్తుంది. ఇదే అదనుగా తెలంగాణ రాజకీయాల్లో బీఆరెస్స్ ఉనికి పోగొట్టడానికి కాంగ్రెస్, బీజేపీలు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటున్నారు. పైగా లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటి, అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన గాయానికి మందు రాయాలని బీఆరెస్స్ అధినేత భావిస్తున్నారని చెబుతున్న వేళ ప్రత్యర్థుల ప్రయత్నాలు మరింత ముమ్మరమవుతున్నట్లున్నాయి.
అవును... రానున్న లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటలని, తద్వారా తెలంగాణ బీఆరెస్స్ హవా ప్రజల్లో అలానే ఉందనే సంకేతాలు పంపాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ బలంగా ఫిక్సయ్యారని అంటున్నారు. ఇదే క్రమంలో... లోక్ సభ ఎన్నికల్లోపు బీఆరెస్స్ ను వీలైనంత బలంగా దెబ్బకొట్టాలని, తెలంగాణ ఆ పార్టీ మనుగడను ప్రశ్నార్థకం చేయాలని అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలు అంతే బలంగా ఫిక్సయ్యాయని చెబుతున్నారు.
ఈ సమయంలో ఈ పథకాల్లో భాగంగా లోక్ సభ ఎన్నికల కోసం బీఆరెస్స్ అభ్యర్థుల్లో ఒకరైన ఖమ్మం సీనియర్ నేత నామా నాగేశ్వరరావుని కోల్పోయే అవకాశం ఉందనే విషయం ఇప్పుడు తెరపైకి వచ్చింది. తాజాగా ఈ విషయంపై రాజకీయా వర్గాల్లో బలమైన చర్చ నడుస్తుంది. ఇందులో భాగంగా... ఖమ్మం సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వర రావు మళ్లీ బీఆరెస్స్ నుంచి బరిలోకి దిగుతారని కేసీఆర్ స్వయంగా ధృవీకరించిన సంగతి తెలిసిందే.
ఇలా స్వయంగా పార్టీ అధినేతే తన అభ్యర్థిత్వాన్ని ధృవీకరించినప్పటికీ... ఆయన పార్టీని వీడి బీజేపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇందులో భాగంగా... ఒకటి రెండు రోజుల్లో నామా నాగేశ్వరరావు బీఆరెస్స్ ను వీడి బీజేపీలో చేరే అవకాశం ఉందని.. ఆయనతో బీజేపీ పెద్దలు ఇప్పటికే చర్చలు ప్రారంభించారని.. అవి సక్సెస్ అయ్యాయని.. ఇక అధికారిక ప్రకటనే తరువాయని అంటున్నారు.
అదే నిజమైతే... పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా తన ఎంపీ అభ్యర్థిని కన్ ఫాం చేస్తూ అధికారిక ప్రకటన చేసిన తర్వాత కూడా ఆ అభ్యర్థి పార్టీని వీడటం అనేది బీఆరెస్స్ ప్రతిష్టకు అతిపెద్ద దెబ్బని అంటున్నారు పరిశీలకులు. మరి ఈ పరిణామాలను పార్టీ అధినేత కేసీఆర్ ఎలా ఎదుర్కోంటారనేది వేచి చూడాలి!