Begin typing your search above and press return to search.

టార్గెట్ బీఆర్ఎస్.. ఈసారి మాజీ ఎంపీ ఇంట్లో ఈడీ సోదాలు

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ, సీబీఐలు ఎమ్మెల్సీ కవితపై కేసు నమోదు చేశాయి.

By:  Tupaki Desk   |   4 July 2024 5:51 AM GMT
టార్గెట్ బీఆర్ఎస్.. ఈసారి మాజీ ఎంపీ ఇంట్లో ఈడీ సోదాలు
X

మొన్న అధినేత కుమార్తె అరెస్టు.. నిన్న హైదరాబాద్ శివారు ఎమ్మెల్యే కంపెనీపై కన్ను.. తాజాగా ఓ మాజీ ఎంపీకి సంబంధించిన సంస్థలు టార్గెట్.. నిన్నొదొల బీఆర్ఎస్ అన్నట్లుగా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వేటాడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయి.. లోక్ సభ ఎన్నికల్లో తొలిసారిగా ఖాతా తెరవలేకపోయిన బీఆర్ఎస్ ను నాయకులు ఒక్కొక్కరుగా వీడుతున్నారు. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి వీడ్కోలు చెప్పారు. ఇంకా మిగిల ఉణ్న నేతలకు ఈడీ నోటీసులు ఇస్తోంది.

కవిత బయటకు వచ్చేదెన్నడో?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ, సీబీఐలు ఎమ్మెల్సీ కవితపై కేసు నమోదు చేశాయి. ఆమె ప్రస్తుతం తిహాడ్ జైలులో ఉన్నారు. మాజీ సీఎం కేసీఆర్ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి రిటైర్డ్ న్యాయమూర్తి కమిషన్ విచారణ నోటీసులు జారీ చేసింది. దీనిపై కేసీఆర్ హైకోర్టుకు వెళ్లినా ఊరట దక్కలేదు. మరోవైపు కొన్ని రోజుల కిందట పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. ఎమ్మెల్యేతో పాటు అతడి సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇళ్లల్లోనూ ఈడీ సోదాలు చేసింది. భూగర్భ గనుల శాఖకు భారీగా సీనరేజీ నిధులు ఎగవేసినట్లు ఆరోపణలు రావడంమే దీనికి కారణం. మరోవైపు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్‌ రెడ్డి బ్యాంకు లాకర్లను ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు బుధవారం తెరిచారు. పటాన్‌చెరు మండలం లక్డారం గ్రామ పరిధిలో ఉన్న సంతోష్‌ శాండ్‌ అండ్‌ గ్రానైట్‌ క్వారీలో అక్రమాలు జరిగినట్లు రెవెన్యూ అధికారులు ఇప్పటికే కేసు పెట్టారు. గత నెల 20న ఎమ్మెల్యే, ఆయన సోదరుడి ఇళ్లలో ఈడీ సోదాలు చేసి కొన్ని దస్త్రాలను తీసుకెళ్లింది. ఎమ్మెల్యేను మంగళవారం హైదరాబాద్‌ కార్యాలయంలో ఈడీ అధికారులు విచారించారు. బుధవారం పటాన్‌ చెరులోని యాక్సిస్, ఎస్‌బీఐ బ్యాంక్‌ లకు ఆయన్ను తీసుకెళ్లి లాకర్లు తెరిపించి తనిఖీలు నిర్వహించారు. యాక్సిస్‌ బ్యాంక్‌ లాకర్‌ నుంచి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

తాజాగా బీఆర్ఎస్ నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ కంపెనీలో కోల్ కతా పోలీసులు సోదాలు చేశారు. సబ్ కాంట్రాక్టు ఇచ్చి పనులు చేయించుకుని డబ్బు చెల్లించకుండా మోసం చేశారన్న ఆరోపణలపై జూబ్లీహిల్స్ లోని మధుకాన్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో కోల్ కతా బౌ బజార్‌ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కాగా, 2022 లోనూ నామా ఇళ్లు , కంపెనీల్లో ఈడీ సోదాలు చేసింది. రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే ప్రాజెక్టుకు సంబంధించి పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. రూ.73 కోట్లకు పైగా ఈడీ జప్తు చేసింది. ఇలా వరుసగా బీఆర్ఎస్ నేతలు ఈడీ, సీబీఐ, పోలీసులకు టార్గెట్ గా మారడంతో పార్టీ కార్యకర్తలు ఆందోళనలో ఉన్నారు.