I-N-D-I-A.. ఇదే ప్రతిపక్ష మహా కూటమిపేరు.. ఎన్నికల్లో అదిరిపోయినట్
ఒకటి 'కూటమి పేరు'. ఐదారు పేర్లను అనుకుని.. చివరకు ఆ పేరు లో ఫ్రంట్ అనే పదం ఉండకూడదని కొన్ని నిర్ణయించినట్లు సమాచారం.
By: Tupaki Desk | 18 July 2023 11:13 AM GMTనమ్మనివారు నమ్మకపోవచ్చు గానీ.. కొన్ని పేర్లు ఏ ముహూర్తాన పెడతారో వెంటనే క్లిక్ అవుతుంటాయి. ఆ పేరు లోనే బలం ఉంది అనిపిస్తుంది. తెలుగువారి ఆత్మగౌరవం అంటూ ఎన్టీఆర్ పార్టీ పెట్టిన సందర్భంలో "తెలుగుదేశం" అనే పేరు అదిరిపోయింది. ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో ఉదాహరణలుంటాయి. కాగా, 2004 నుంచి 2014 వరకు దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించింది యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) కూటమి. అలాంటి కూటమిని రెండుసార్లు ఓడించింది నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ). వాస్తవానికి ఎన్డీఏ 1999లోనే ఏర్పడింది. 2004 ఎన్నికల కు ముందు యూపీఏ ను స్థాపించారు. అయితే, 2014 తర్వాత ఈ కూటమి బాగా బలహీనమైంది.
కొత్త కూటమి పురుడు పోసుకుంది..
ఇప్పుడు మళ్లీ బీజేపీ కి వ్యతిరేకంగా కొత్త కూటమి పురుడు పోసుకుంటోంది. భారత జాతీయ ప్రజాస్వామ్య సమ్మిళిత కూటమి (I-N-D-I-A') దీని పేరు గా తెలుస్తోంది. బెంగళూరు లో జరుగుతున్న 26 విపక్షాల మహా సమావేశం లో ఈ మేరకు నిర్ణయించినట్లు సమాచారం. వాస్తవానికి బీజేపీ ని ఎదుర్కొనేందుకు యూపీఏ సరిపోదని భావించారేమో..? తెరపైకి కొత్త పేరును తెచ్చారు. కాగా, యూపీఏ లో ఆప్ వంటి పార్టీలు లేవు. ఇప్పుడు మరికొన్ని పార్టీలు కూడా కొత్తగా చేరాయి. దీంతో పేరు మార్చాల్సి వచ్చింది.
అవినీతి మరకలు కనపడకుండా..
యూపీఏ-2 హయాం లో అనేక అవినీతి ఆరోపణలు చుట్టుముట్టాయి. వీటినే అస్త్రంగా చేసుకుని బీజేపీ నరేంద్ర మోదీ ని తెరపైకి తెచ్చింది. ఇప్పడు మళ్లీ మోదీ ప్రతిపక్షాల కూటమిని అవినీతి పార్టీల కూటమిగా పోల్చారు. ఈ నేపథ్యంలో పేరు మార్పు ద్వారా నాటి అవినీతి మరకల ను చెరిపేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. కాగా, బెంగళూరు భేటీ లో మంగళవారం కీలక అంశాల పై ప్రతిపక్ష నేతలు చర్చలు చేపట్టారు. ఇందులో ఒకటి 'కూటమి పేరు'. ఐదారు పేర్లను అనుకుని.. చివరకు ఆ పేరు లో ఫ్రంట్ అనే పదం ఉండకూడదని కొన్ని నిర్ణయించినట్లు సమాచారం. దీంతోనే I-N-D-I-A (Indian National Democratic Inclusive Alliance) పేరు పై అత్యధిక పార్టీల నేతలు ఏకీభవించినట్లు తెలుస్తోంది. దీని ని అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. తుది నిర్ణయం తీసుకోనట్లుగా తెలుస్తోంది. విపక్ష నేతలు ఈ పేరుతో సోషల్ మీడియా లో పోస్టులు చేస్తున్నారు.
కాంగ్రెస్ ఎంపీ, తెలంగాణ మాజీ ఇన్ చార్జి మణిక్కం ఠాకూర్ అయితే ఏకంగా 'INDIA will win' అని ట్వీట్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఒబ్రియాన్ సైతం 'Chak De! INDIA' అని రాశారు. కాగా, బెంగళూరు భేటీ లో కనీస ఉమ్మడి కార్యక్రమ (సీఎంపీ) రూపకల్పన కు ఉప సంఘాన్ని నియమించడం, కూటమికి సంబంధించిన అంశాల పై సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థను రూపొందించడం పై చర్చలు సాగుతున్నట్లు సమాచారం.