Begin typing your search above and press return to search.

బ్రేకింగ్.. అల్లు అర్జున్ కు ఇది మామూలు రిలీఫ్ కాదు!

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లోని 'పుష్ప-2' సినిమా బెనిఫిట్ షోకి సంబంధించిన జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   11 Jan 2025 8:34 AM GMT
బ్రేకింగ్.. అల్లు అర్జున్ కు ఇది మామూలు రిలీఫ్ కాదు!
X

సంధ్య థియేటర్ లోని 'పుష్ప-2' సినిమా బెనిఫిట్ షోకి సంబంధించిన జరిగిన తొక్కిసలాట ఘటన ఎంత చర్చనీయాంశం అయ్యిందనే సంగతి తెలిసిందే. ఈ ఘటన, తదనంతర పరిణామాలు దేశవ్యాప్తంగానూ చర్చనీయాంశం అయ్యింది. దీనికి సంబంధించిన కేసులో అరెస్టై, తర్వాత కండిషనల్ బెయిల్ పై ఉన్న అల్లు అర్జున్ కు తాజాగా ఊరట లభించింది.

అవును... ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లోని 'పుష్ప-2' సినిమా బెనిఫిట్ షోకి సంబంధించిన జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన కేసులో అల్లు అర్జున్ ప్రస్తుతం షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ పై ఉండగా... తాజాగా నాంపల్లి కోర్టులో ఊరట లభించింది.

ఇందులో భాగంగా... ప్రతీ ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరుకావాలనే నిబంధనను కోర్టు మినహాయించింది. ఇదే సమయంలో... విదేశాలకు వెళ్లేందుకు కూడా అనుమతించింది. ఇది అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అలాకానిపక్షంలో ఆయన వృత్తి జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉండి ఉండేదని చెబుతున్నారు.

కాగా... సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో ఏ11 నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్.. కేసు విచారణ నేపథ్యంలో ప్రతీ ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందు హాజరుకావాలని గతంలో నాంపల్లి కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో.. భద్రతా కారణాల దృష్ట్యా దీనికి మినహాయింపు ఇవ్వాలని అల్లు అర్జున్ కోర్టును కోరారు.