Begin typing your search above and press return to search.

కమలా కాదు.. ఆమె.. బైడైన్ కు బై బై వెనుక ఉక్కు మహిళ!

సర్వేలు చూపించి.. మద్దతు తగ్గుతుండడాన్ని వివరించి.. బైడెన్‌ కు పలుసార్లు నాన్సీ పెలోసీ మంచిగా చెప్పి చూశారు.

By:  Tupaki Desk   |   25 July 2024 12:30 PM GMT
కమలా కాదు.. ఆమె.. బైడైన్ కు బై బై వెనుక ఉక్కు మహిళ!
X

81 ఏళ్ల వయసులోనూ.. వయోభారం.. అనారోగ్యం వెంటాడుతుండగానూ.. తనకు గెలుపు అవకాశాలు సన్నగిల్లుతున్నట్లు తెలిసి కూడా.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి పోటీ నుంచి వైదొలగేది లేదని మొన్నటివరకు భీష్మించారు. ఆఖరికి కొవిడ్ బారినపడి.. క్వారంటైన్ కు వెళ్లిన ఆయన తాను తప్పుకొంటానని ప్రకటించారు. మరి దీనివెనుక ఉన్నదెవరు? అయితే.. అది ఎవరో కాదు.. సొంత పార్టీ అయిన డెమోక్రటిక్ నేతలే అని తెలుస్తోంది.

‘‘బైడెన్.. మర్యాదగా తప్పకోండి.. లేదంటే ఎన్నికల రేసు నుంచి మేమే బయటకు నెట్టేస్తాం..’’ పార్టీ అధ్యక్ష అభ్యర్థికి, అందులోనూ అధ్యక్షుడిగా ఉన్న నాయకుడికి ఇలాంటి హెచ్చరిక జారీచేసే దమ్ము ఎవరికి ఉండాలి? కానీ, ఈ పని చేశారు ఓ మహిళా నేత. ఆ దెబ్బకే బైడెన్ తప్పుకొన్నట్లుగా చెబుతున్నారు. పీఠం పట్టుకుని వదలనంటున్న బైడెన్ ను సాగనంపినది అమెరికా మాజీ హౌస్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసీ. 84 ఏళ్ల ఈమె గురించి చెప్పాలంటే చాలా కథ ఉంది. గత ఏడాది హౌస్ స్పీకర్ పదవీ కాలం పూర్తయిన నాన్సీ.. డెమోక్రాటిక్ పార్టీలో చాలా బలమైన నేత. రెండేళ్ల కిందట చైనా ఎంతగా హెచ్చరిస్తున్నా తైవాన్ పర్యటనకు వెళ్లారు నాన్సీ. ఆ సమయంలో నాన్సీ విమానం ఎక్కడ ఉన్నదీ అంటూ కొన్ని లక్షల మంది ట్రాక చేయడం విశేషం. అలాంటి నాన్సీ తైవాన్ లో అడుగు పెట్టడమే కాదు.. చైనాను హెచ్చరించారు. తాజాగా ఈమెనే బైడెన్ ను ఇంటికి పంపారు.

నచ్చజెప్పినా వినకపోవడంతో..

సర్వేలు చూపించి.. మద్దతు తగ్గుతుండడాన్ని వివరించి.. బైడెన్‌ కు పలుసార్లు నాన్సీ పెలోసీ మంచిగా చెప్పి చూశారు. అయినా ఆయన మాట

అల్టిమేటం జారీ చేశారు. ‘‘మూడు వారాల్లో తప్పుకోండి.. లేదంటే కఠిన మార్గం అనుసరించాల్సి ఉంటుంది’’ అని హెచ్చరించారు. ఇదే సమయంలో డెమోక్రటిక్ సెనేటర్లు, రిప్రజెంటేటివ్‌ లు బైడెన్‌ కు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడేలా చేశారు నాన్సీ. నెల రోజులుగా విరాళాలు ఇచ్చేవారు బైడెన్‌ కు దూరం కావడం.. ట్రంప్‌ తో చర్చలో తేలిపోవడంతో డెమోక్రాట్లను కలవరపరిచాయి. దీంతో మాజీ అధ్యక్షుడు ఒబామా, నాన్సీ పెలోసీ కలగజేసుకున్నారు. ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఆరు స్వింగ్‌ స్టేట్స్‌ లో బైడెన్‌ పరిస్థితి ఘోరంగా మారిన విషయాన్ని వివరించారు.

కలిసొచ్చిన కొవిడ్

బైడెన్ కు కొవిడ్ సోకడం ఒకవిధంగా ఆయనకు మంచే చేసింది. దానిని కారణంగా చూపుతూ కాస్త గౌరవప్రదంగా వైదొలిగే అవకాశం వచ్చింది. పార్టీ బలవంతం మీద కాకుండా.. తన ఇష్ట ప్రకారమే తప్పుకొంటున్నట్లు చెప్పే చాన్స్ లభించింది.