Begin typing your search above and press return to search.

మూవీస్ - పాలిటిక్స్... బాలయ్య బ్యాలెన్సింగ్ వేరే లెవెల్ అంతే!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత బిజీ అయిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అని చెప్పినా అతిశయోక్తి కాదనే చర్చ తెరపైకి వచ్చింది.

By:  Tupaki Desk   |   22 Jan 2025 4:55 PM GMT
మూవీస్ - పాలిటిక్స్... బాలయ్య బ్యాలెన్సింగ్ వేరే లెవెల్ అంతే!
X

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత బిజీ అయిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అని చెప్పినా అతిశయోక్తి కాదనే చర్చ తెరపైకి వచ్చింది. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు బాలకృష్ణ. ఇందులో భాగంగా.. 2014, 2019 కంటే అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. తనదైన శైలిలో నియోజకవర్గంలో సేవలందిస్తున్నారు.

మరోపక్క వరుస సినిమాలు తీసుకుంటూ.. ఆ రకంగానూ బాలకృష్ణ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే తాజాగా విడుదలైన 'డాకూ మహరాజ్' సూపర్ హిట్ టాక్ తో సంక్రాంతి మాస్ బ్లాక్ బాస్టర్ కాగా.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ-2' షూటింగ్ లో ప్రస్తుతం బాలయ్య బాబు బిజీగా ఉన్నారని అంటున్నారు.

ఆ విధంగా... అటు రాజకీయాల్లో కార్యకర్తలు, ప్రజలు ఇచ్చిన బాధ్యతను.. ఇటు అభిమానులు, ప్రేక్షకుల ఎంటర్ టైన్ మెంట్ విషయంలో తనకున్న బాధ్యతను బ్యాలెన్స్ చేస్తూ ముందుకుపోతున్నారని అంటున్నారు. వాస్తవానికి ఇలా రెండు కీలక బాధ్యతలు బ్యాలెన్స్ చేయడం అంత ఇజీ కాదు. ఈ విషయంలో చాలా మంది చతికిలపడిపోతారని అంటుంటారు.

అవును... అటు సినిమాలను, ఇటు రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తూ నందమురి బాలకృష్ణ దూసుకుపోతున్నారని అంటున్నారు. ఈ సందర్భంగా 'డాకూ మహారాజ్' హిట్ ని ఎంజాయ్ చేస్తూ, మరో పక్క 'అఖండ-2' షూటింగ్ లో పాల్గొంటున్న బాలయ్య... ఇదే సమయంలో హిందూపురం నియోజకవర్గంలోనూ పర్యటించారు.

ఈ సందర్భంగా... రవాణాశాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా హిందూపురం పట్టణంలో ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే బాలయ్య.. హెల్మెట్ ధరించి బుల్లెట్ బైక్ నడిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వాహనాలు నడిపే సమయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.. హెల్మెట్ తప్పనిసరి అని గుర్తు చేశారు.

ఇదే సమయంలో రోడ్ల మరమ్మతుల కోసం ప్రత్యేక అభివృద్ధి నిధిగా రూ.92 కోట్లు.. హెచ్.ఎన్.ఎస్.ఎస్. సంబంధిత పనులకు సంబంధించి మరో రూ.120 కోట్లు నిధుల విడుదలకు ఫైల్స్ కదులుతున్నాయని.. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రజలకు తెలిపారు.

ఇదే సమయంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.850 కోట్ల ప్రణాళికలు రూపిందించినట్లు తెలిపారు. అదేవిధంగా... విశాఖ స్టీల్ ప్లాంట్, అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్ కు కేంద్ర ప్రభుత్వం చేసిన ఆర్థిక సహాయానికి బాలయ్య ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఏది ఏమైనా... అటు సినిమాలు, ఇటు రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తూ బాలయ్య ముందుకెళ్తున్న విషయం అభినందనీయం, ఆదర్శప్రాయం అని అంటున్నారు అభిమానులు, నెటిజన్లు!