Begin typing your search above and press return to search.

బాలయ్యను మెంటలోడని జనాలు అనుకుంటున్నారంటూ!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   14 Sep 2023 3:00 AM GMT
బాలయ్యను మెంటలోడని జనాలు అనుకుంటున్నారంటూ!
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. మరోపక్క నారా లోకేష్ ఆ జైలు కు సమీపంలో బస్సులో నివాసం ఉంటూ, తండ్రిని టైం ప్రకారం ఫుడ్, మెడిసిన్స్ పంపుతున్నారు. ఈ పరిస్థితుల్లో పొలిటికల్ గా బాలయ్య యాక్ట్వివేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ ఆఫీసులో అన్నీ తానై అన్నట్లుగా ముందుకు వెళ్తున్నారు.

ఈ సమయంలో ప్రెస్ మీట్ పెట్టిన ఆయన... ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. చంద్రబాబు అరెస్ట్ ప్రీ ప్లాన్డ్ అని అన్నారు. ఇదే సమయంలో సంస్కృతంలో ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి ఆర్కే రోజా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో మెంటలోడు అంటూ రోజా తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు.

బాలకృష్ణ ప్రెస్ మీట్ చూసి ప్రతీ ఒక్కరూ అర్ధం చేసుకుంటున్న విషయం ఏమిటంటే... ఇన్ని రోజులూ వెన్నుపోటు దారుడు ఆ సీట్లో కూర్చున్నాడు, ఇప్పుడు మెంటల్ గాడు కూర్చున్నాడు అని అనుకుంటున్నారు. అది నేను చెప్పిన మాట కాదు.. జనం అనుకుంటున్న మాట అంటూ రోజా తీవ్రస్థాయిలో కామెంట్ చేశారు. దీంతో... ఆమె కామెంట్స్ కి సైతం నెగిటివ్ కామెంట్స్ వస్తుండటం గమనార్హం.

అవును... బాలయ్యను మెంటలోడని జనం అనుకుంటున్నారంటూ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు నెటిజన్లు. ఇందులో భాగంగా రోజా ఒకప్పుడు టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా కూడా పనిచేశారని చెబుతున్నారు. ఇదే సమయంలో బాలయ్యతో ఎన్నో సూపర్‌ హిట్ చిత్రాల్లో నటించి ఇప్పుడు ఇలా వ్యాఖ్యానించడం సరైంది కాదని చెబుతున్నారు.

అయితే... రాజకీయాల్లో పార్టీలు మారిన తర్వాత ఎవరికి వారూ వారి వారి పార్టీ స్టాండ్స్ ప్రకారం నడుచుకుంటారు కాబట్టి విమర్శల్లో తప్పులేదనే వారూ లేకపోలేదు. కాకపోతే... తీవ్రత అనేది ప్రాధాన్యం అని చెబుతున్నారు! ఏది ఏమైనా... బాలయ్యను మెంటలోడని జనాలు అనుకుంటున్నారంటూ రోజా చేసిన వ్యాఖ్యలు మాత్రం వైరల్ అవుతున్నాయి!!

కాగా... టీడీపీ ఆఫీసులో బాబు అరెస్టుపై స్పందించిన బాలయ్య.. ఏపీ ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో ఫైరయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... "లక్షల కోట్ల భక్షక, అవినీతి అర్భక, పక్షపథ రూపక, ముఖ్య కంత్రీ మహా మూర్ఖా, మూచీ ముద నష్టకా, జగమెరిగిన జగన్నాటక, ఈ దేశానికి పట్టిన దరిద్ర జాతక, రాష్ట్రానికి రావణ పాలక, జన ధన మన చోరక.. మన ముఖ్యమంత్రి" అంటూ బాలయ్య కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కామెంట్స్ అనంతరం రోజా ఆస్థాయిలో ఫైరయ్యారు!