Begin typing your search above and press return to search.

హిందూపురం నుంచి బాలయ్య కాదా...?

హిందూపురం తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట. తెలుగుదేశం ఆవిర్భవించాక ఇప్పటిదాకా ఆ పార్టీ అక్కడ ఓటమి పాలు కాలేదు

By:  Tupaki Desk   |   10 Nov 2023 2:00 AM GMT
హిందూపురం నుంచి బాలయ్య కాదా...?
X

హిందూపురం తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట. తెలుగుదేశం ఆవిర్భవించాక ఇప్పటిదాకా ఆ పార్టీ అక్కడ ఓటమి పాలు కాలేదు. 1983కి ముందు కూడా కాంగ్రెస్ నాలుగు సార్లు గెలిస్తే ఇండిపెండెంట్లు మిగిలిన సార్లు గెలిచారు. దీంతో హిందూపురం అంటే నందమూరిపురం అని పేరు పడింది.

ఎన్టీయార్ రెండు సార్లు హరిక్రిష్ణ ఒక్కసారి. బాలయ్య రెండు సార్లు ఇక్కడ గెలిచారు. అలా కూడా అన్న గారి కుటుంబానికి పట్టం కడుతోంది ఈ సీటు. దాంతో ఈసారి ఇక్కడ నుంచి పోటీ చేయడానికి బాలయ్య అయితే ఉత్సాహం చూపిస్తున్నారు. కానీ ఆయనకు అవకాశం దక్కుతుందా లేదా అన్న చర్చ సాగుతోంది.

బాలయ్యని రాజ్యసభకు పంపుతారని రాయలసీమ ప్రచారం మొత్తం ఆయనకు 2024 ఎన్నికలకు అప్పగిస్తారని వినిపిస్తున్న మాట. అయితే బాలయ్య మాత్రం హిందూపురం నుంచే పోటీకి సై అంటున్నారు. ఇక చంద్రబాబు జైలుకి వెళ్ళిన టైం లో బాలయ్య కొంత హడావుడి చేశారు. మంగళగిరి పార్టీ ఆఫీసులో చంద్రబాబు సీటులో ఆయన కూర్చుని పార్టీ కార్యక్రమాలను ప్రకటించారు.

అలా బాలయ్యలో అతి ఉత్సాహం చంద్రబాబు అండ్ కో జాగ్రత్తపడేందుకు చాన్స్ ఇచ్చిందా అన్న చర్చ సాగుతోంది.బాలయ్య దాదాపుగా నెల రోజులకు పైగా టీడీపీ కార్యక్రమాలలో కనిపించడంలేదు. ఆయన భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్స్ రిలీజ్ అయ్యాక సక్సెస్ మీట్స్ ఇలా గడిపేశారు. ఇపుడు కొత్త సినిమా షూటింగులో బిజీ అయిపోయారు.

దాంతో బాలయ్యకు పాలిటిక్స్ మీద విరక్తి కలిగిందా లేక ఆయన్ని తప్పించాలాని చూస్తున్నారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే టీడీపీలో కీలకం అయిన కో ఆర్డినేషన్ కమిటీలో బాలయ్యను తీసుకోలేదు. దాంతో బాలయ్య ఎన్నికల ఆశలు డౌట్ లో పడుతున్నాయని అంటున్నారు.

మరో వైపు చూస్తే హిందూపురం సీటు వైఎస్సార్ వేవ్ లోనూ జగన్ వేవ్ లోనూ ఓడిపోలేదు. దాంతో లోకేష్ ని ఈ సీటు ఆకర్షిస్తోంది అని అంటున్నారు. ఇంత సేఫెస్ట్ సీటులో నుంచి లోకేష్ పోటీ చేస్తే బాగుంటుంది అని సీమ నేతలు అంటున్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాకు చెందిన పయ్యావుల కేశవ్ లోకేష్ తో సాన్నిహిత్యం నెరపుతున్నారు. ఆయన కూడా కోరుతున్నారని అంటున్నారు.

ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారంలో పాలు పంచుకోలేకపోతే ఆ భారం అంతా లోకేష్ మీద పడుతుంది. దాంతో నామినేషన్ వేసి గెలుపు ఖాయం అనుకున్న సీటుని ఎంచుకుంటే బెస్ట్ అన్న భావన ఉంది అంటున్నారు. దాంతోనే బాలయ్య రాజకీయాల వైపు చూడడం లేదా అన్న సందేహాలు వస్తున్నాయి.

మొత్తంగా చూసుకుంటే ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తే లోకేష్ కి మరింత ప్రాముఖ్యత పెరుగుతుంది. ఆయన మంత్రి మళ్ళీ అవుతారు. అదే హిందూపురం నుంచి బాలయ్య గెలిస్తే ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మంత్రి పదవిని కచ్చితంగా కోరుకుంటారు. అలా ఆయన నందమూరి వైపు నుంచి గట్టి పోటీ అవుతారు అన్న చర్చ ఉంది. దాంతో బాలయ్యను పెద్దల సభకు పంపిస్తారు అని అంటున్నారు. మరి బాలయ్య దీని మీద ఏమీ చెప్పలేకనే సినిమా షూటింగులలో బిజీ అవుతున్నారు అని అంటున్నారు. ఏది ఏమైనా కొద్ది రోజులలోనే హిందూపురం సీటు మీద ఫుల్ క్లారిటీ వస్తుంది అని అంటున్నారు.