Begin typing your search above and press return to search.

ఉప్పల్ స్టేడియంలో జైబాలయ్య నినాదాలు

ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్టుకు ఉప్పల్ స్టేడియం వేదికగా మారటం తెలిసిందే

By:  Tupaki Desk   |   28 Jan 2024 5:23 AM GMT
ఉప్పల్ స్టేడియంలో జైబాలయ్య నినాదాలు
X

ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్టుకు ఉప్పల్ స్టేడియం వేదికగా మారటం తెలిసిందే. శనివారం ఆట జరుగుతున్న వేళ.. రెండు అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇవి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు తెర తీశాయి. మ్యాచ్ జరుగుతున్న వేళ.. కొందరు జై బాలయ్య అంటూ నినాదాలు మొదలుపెట్టటం.. దానికి ప్రతిగా మరికొందరు జై జై బాలయ్య అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయటంతో స్టేడియంలో కాసేపు జై బాలయ్య నినాదాల హోరు సాగింది.

అయితే.. ఇలా నినాదాలు చేస్తున్న వారిని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదిలా ఉంటే.. చిత్తూరు జిల్లాకు చెందిన ఐదుగురు యువకులు స్టేడియంలో తెలుగుదేశం పార్టీ జెండాల్ని ఊపుతూ నినాదాలు చేశారు. నిబంధనల ప్రకారం స్టేడియంలోకి జాతీయ జెండాలు తప్పించి.. ఇతర జెండాల్ని అనుమతించారు. అందుకు భిన్నంగా టీడీపీ జెండాలతో స్టేడియంలో హల్ చల్ చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఉప్పల్ స్టేడియంలో టీడీపీ జెండాల్ని ప్రదర్శించిన వారంతా చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిపై పెట్టి కేసులు నమోదు చేసి విడుదల చేశారు. స్టేడియంలోకి రాజకీయ పార్టీలకు చెందిన జెండాలను అనుమతి లేదని.. అలా చేసిన వారిపై కేసుల నమోదు ఖాయమని ఉప్పల్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు.