బాలక్రిష్ణ స్టేట్మెంట్స్ తో పార్టీకి నష్టం!
బాలయ్య తన బావ జైలులో ఉన్న వేళ బాగా క్రియాశీలం అయ్యారు. ఆయన అటు ఆంధ్రాతో పాటు ఇటు తెలంగాణాలోనూ పార్టీ నేతలతో సమావేశాలు జరుపుతున్నారు.
By: Tupaki Desk | 4 Oct 2023 5:34 PM GMTబాలయ్య తన బావ జైలులో ఉన్న వేళ బాగా క్రియాశీలం అయ్యారు. ఆయన అటు ఆంధ్రాతో పాటు ఇటు తెలంగాణాలోనూ పార్టీ నేతలతో సమావేశాలు జరుపుతున్నారు. చంద్రబాబు లేని వేళ బాలయ్య ఎన్టీయార్ భవన్ లో టీ టీడీపీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చాలా కామెంట్స్ చేశారు.
అందులో కొన్ని పార్టీకి ఇబ్బంది పెట్టేవి అని అంటున్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీయార్ చంద్రబాబు అరెస్ట్ మీద స్పందించకపోవడం పట్ల బాలయ్య మాట్లాడుతూ ఐ డోంట్ కేర్ అని పెద్ద పదమే వాడేశారు. నిజంగా డోంట్ కేర్ అంటే ఎవరైనా ఎలా తీసుకుంటారు, ఇది హర్ట్ అయ్యేలా చేసిన కామెంట్ అని అంటున్నారు.
దీని మీద టీడీపీలో చాలా మంది ఇపుడు చర్చించుకుంటున్నారు. నిజానికి టీడీపీలో చాలా మంది జూనియర్ ఎన్టీయార్ ఎందుకు స్పందించడంలేదు అన్న బాధ ఆవేదన అయితే ఉంది. కానీ ఏ ఒక్కరూ బయటపడడంలేదు. ఎందుకంటే ఇది సున్నితమైన అంశం. పైగా జూనియర్ ఎవరో పరాయివారు కాదు, ఆయన స్వయంగా సీనియర్ ఎన్టీయార్ కి మనవడు. అదే పేరింటివారు, మూడవతరంలో సినీ రంగంలో గ్లోబర్ స్టార్ గా వెలుగుతున్న వారు.
అన్నిటికీ మించి మంచి వాగ్దాటి కలిగిన వారు, సమర్ధుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. అలాంటి జూనియర్ అవసరం ఈ క్లిష్ట పరిష్తిలలో టీడీపీకి ఉంది తప్ప ఆయనకు కాదు, ఈ రోజు జూనియర్ రియాక్ట్ కాకపోయినా మరో సందర్భంలో అయినా ఆయన వస్తాడనే అందరూ ఆశాభావంతో ఉన్నారు.
ముఖ్యంగా 2024 ఎన్నికల వేళ కీలక సమయంలో జూనియర్ ని రప్పించి ప్రచారం చేయించాలన్న ఆలోచన కూడా ఉంది. ఆ టైం కి జూనియర్ కూడా ఎలా రియాక్ట్ అయ్యేవారో. కానీ ఇపుడు బాలయ్య జూనియర్ మీద ఐ డోంట్ కేర్ అంటూ చేసిన హాట్ కామెంట్స్ మాత్రం జూనియర్ ని మరింత దూరం చేసేలా ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే నందమూరి నారా ఫ్యామిలీ ఆయన్ని దూరం పెట్టారని అంతా అనుకుంటున్నారు.
మరో వైపు చూస్తే ఈ రోజు దాకా జూనియర్ అభిమానులుగా ఉనన్ టీడీపీ క్యాడర్ కూడా తమ అభిమాన నటుడు రియాక్ట్ అయితే బాగుండును అని భావనతో ఉన్నారు. ఎపుడైతే బాలయ్య ఈ రకంగా హర్ట్ చేసే కామెంట్స్ చేశారో ఇపుడు వారు కూడా గుస్సా అవుతున్నారు. జూనియర్ ని డోంట్ కేర్ అనడమేంటి అని ఫైర్ అవుతున్నారు.
ఇక టీడీపీ వరకూ చూస్తే 2024 ఎన్నికలు చావో రేవో అన్నట్లుగానే ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కనుక గెలవకపోతే టీడీపీకి ఇబ్బంది తప్పదని అంటున్నారు. దాంతో జూనియర్ అవసరం నిండా ఉన్న వేళ ఆయన్ని లైట్ తీసుకుని బాలయ్య ఈ రకంగా కామెంట్స్ చేయడం కచ్చితంగా తప్పు అని అంటున్నారు. ఇది భారీ రాజకీయ నష్టాన్ని చేకూరుస్తుందని అంటున్నారు.
ఇక దీని వల్ల జూనియర్ ఫ్యాన్స్ పూర్తిగా డిసప్పాయింట్ అయి వచ్చే ఎన్నికల్లో టీడీపీకి రాజకీయ నష్టం చేకూరుస్తారు అని అంటున్నారు. అలాగే సినిమా రంగం మీద కూడా బాలయ్య డోంట్ కేర్ అనడం నా సెక్షన్ నుంచి తీసేసాను అని భారీ డైలాగులు కొట్టడం వల్ల కూడా నష్టం తప్ప లాభం ఏమీ లేదని అంటున్నారు. అసేల బాబు అరెస్ట్ తో పుట్టెడు కష్టాలతో ఉన్న పార్టీని బాలయ్య తన దైన వ్యాఖ్యలతో ఇబ్బందులతో నెడుతున్నారా అన్న చర్చ అయితే పార్టీ లోపలా బయటా సాగుతోంది అని అంటున్నారు.