Begin typing your search above and press return to search.

ఆళ్ళ నాని తరువాత లిస్ట్ లో ఆ కీలక నేతలు...?

ఇక కొంతమంది అయితే ఉన్న పదవులు వదులుకున్నారు.

By:  Tupaki Desk   |   13 Oct 2024 3:00 AM GMT
ఆళ్ళ నాని తరువాత లిస్ట్ లో ఆ కీలక నేతలు...?
X

వైసీపీకి గోదావరి జిల్లాలు రాజకీయంగా అంత కలసివచ్చేలా కనిపించడంలేదు అని అంటున్నారు. ఎన్నికల్లో ఓడాక వరసబెట్టి గోదావరి జిల్లాలలోనే పెద్ద ఎత్తున వైసీపీ నాయక గణం కూటమి వైపుగా పరుగులు తీసింది. ఇక కొంతమంది అయితే ఉన్న పదవులు వదులుకున్నారు. పార్టీకి దూరం అయ్యారు.

వీరిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఆళ్ల నాని. ఆయన వైఎస్సార్ కాలం నుంచి ఆ కుటుంబానికి అండగా ఉన్నారు. అలాంటి ఆళ్ళ నాని సడెన్ గా వైసీపీ ఏలూరు అధ్యక్ష పదవిని వదులుకున్నారు. ఆ తరువాత కొద్ది రోజులకు ఏకంగా పార్టీయే వద్దు అని జెండాని పక్కన పెట్టారు.

ఈ నేపథ్యం నుంచి చూసుకున్నపుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి కష్టకాలం మొదలైంది అని అంటున్నారు. ఇపుడు ఆళ్ళ నాని తరువాత మరో బిగ్ షాట్ వైసీపీని వీడే అవకాశాలు ఉన్నాయని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. ఆ ప్రచారంలో ఉన్నది ఎవరో కాదు భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్.

ఆయన పేరు 2019 ఎన్నికల తరువాత ఒక్కసారిగా ఏపీవ్యాప్తం అయింది. దానికి కారణం ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఓడించి జెయింట్ కిల్లర్ అయ్యారు. అప్పట్లో పవన్ ని ఓడించిన గ్రంధి శ్రీనివాస్ కి మంత్రి పదవి ఖాయమని అంతా అనుకున్నారు. కానీ తొలి విడతలోనే కాదు విస్తరణలోనూ చాన్స్ దక్కలేదు. దాంతో గ్రంధి శ్రీనివాస్ అప్పట్లోనే తీవ్ర అసంతృప్తికి లోను అయ్యారని అంటారు.

ఇక 2024 ఎన్నికల్లో ఆయన వైసీపీ తరఫున పోటీ చేసి భారీ తేడాతో ఓటమి పాలు అయ్యారు. ఆ తరువాత ఆయన పెద్దగా హడావుడి చేయడం లేదు. పార్టీ కార్యక్రమాల్లోనూ పాలు పంచుకోవడం లేదు. వైసీపీ అధినాయకత్వం నిర్వహించే సమీక్షా సమావేశాలకు కూడా ఆయన హాజరు కావడంలేదు. దానికి ఆరోగ్యం బాగా లేదని చెప్పారని అంటున్నారు.

కానీ గ్రంధి శ్రీనివాస్ వేరే ఆలోచనలలో ఉన్నారని ప్రచారం సాగుతోంది. ఆయన కూటమి వైపుగా అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు. ఇటీవలవ ఏపీలో సంభవించిన భారీ వరదల నేపథ్యంలో వరద బాధితులకు సహాయం అంటూ గ్రంధి సోదరులు ముఖ్యమంత్రి చంద్రబాబుని కోటి రూపాయల చెక్కుని అందించి వచ్చారు.

దీంతో గ్రంధి పార్టీ మార్పునకు దానిని సాకుగా చూపిస్తున్న వారూ ఎక్కువ అయ్యారు. వైసీపీకి పూర్తిగా ఆయన దూరం అవుతున్నారు అన్న చర్చ కూడా సాగుతోంది. ఇక భీమవరంలో చూస్తే ఒకనాడు టీడీపీలో గట్టిగా ఉండే పులపర్తి ఆంజనేయులు జనసేనలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. దాంతో టీడీపీలో స్లాట్ ఖాళీగా ఉంది అని అంటున్నారు

గ్రంధి శ్రీనివాస్ వంటి దూకుడు కలిగిన నేత వస్తే బాగానే ఉంటుందని అంటున్నారు. అలా లోకల్ గా సమీకరణలు సెట్ అవుతున్నా క్రమంలో గ్రంధి శ్రీనివాస్ ఆల్ ఆఫ్ సడెన్ గా పిడుగు లాంటి వార్తను అయితే ప్రకటిస్తారు అని అంటున్నారు. దాంతో భీమవరంలో ఇపుడు ఇదే హాట్ టాపిక్ గా ఉందని అంటున్నారు.

ఇక ఇదే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మరో కీలక నేత మాజీ మంత్రి చెరుకూరి శ్రీ రంగనాధరాజు. ఆయన కూడా వైసీపీ మీద అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. ఆయనకు మంత్రి పదవి ఇచ్చి తీసేశారు అని కోపం అంటున్నారు. అయితే ఆయన గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నపుడు పేదల కోసం సేకరించిన భూములలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతోనే ఆయనకు పదవి లేకుండా పోయిందని అంటున్నారు

ఆ తరువాత కొన్నాళ్ళ పాటు ఆయనకు జిల్లా అధ్యక్ష పదవి అప్పగించినా దానిని కూడా తీసెశారు. ఈ మొత్తం పరిణామంతో రాజు గారు కలత చెందారని ఆయన కూడా కూటమి వైపుగా సాగాలని నిర్ణయించుకున్నారు అని అంటున్నారు. ఇలా చూస్తే కనుక దిగ్గజ నాయకులు అనతదిన వారు అంతా ఇపుడు సైలెంట్ గా ఉన్నారు. వారు వైసీపీలో అయితే క్రియాశీలకంగా లేకపోవడంతో క్యాడర్ అయోమయానికి గురి అవుతోంది. అధినాయకత్వం గోదావరి జిల్లాల మీద ఫుల్ ఫోకస్ పెట్టాలని కోరుతున్నారు