'అన్న ఎన్టీఆర్ తో అనేక అనుభూతులు'... లోకేష్ ఇంట్రస్టింగ్ కామెంట్స్!
ఇందులో భాగంగా ఆయన లాస్ వెగాస్ నగరంలో నిర్వహించిన "ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్"లో పాల్గొన్నారు. ఈ సమ్మిట్ ప్రాంగణంలో పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు.
By: Tupaki Desk | 30 Oct 2024 6:59 AMఏపీ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన లాస్ వెగాస్ నగరంలో నిర్వహించిన "ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్"లో పాల్గొన్నారు. ఈ సమ్మిట్ ప్రాంగణంలో పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చిట్ చాట్ లో ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
అవును.. ప్రస్తుతం ఏపీ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా పలువురు పారిశ్రామికవేత్తలతో ఆయన భేటీ అవుతున్నారు. పెట్టుబడులకు స్వర్గధామంగా ఏపీలో ఉన్న సానుకూల అంశాలను, ప్రభుత్వం అందించే సహాయ సహకారాలనూ వివరించే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఈ సమ్మిట్ లో పాల్గొన్న లోకేష్.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇందులో భాగంగా... తన తండ్రి చంద్రబాబు నుంచి నేర్చుకున్న విషయాలు, పాదయాత్రలో తెలుసుకున్న విషయాలు, తాను ఎంచుకున్న లక్ష్యాలు మొదలైన విషయాలతో పాటు స్వర్గీయ ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.
ఇందులో భాగంగా... పాదయాత్ర సమయంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నానని.. ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టాలను ప్రత్యక్షంగా చూశానని లోకేష్ తెలిపారు. ఇదే సమయంలో... రాజకీయ నాయకులు, అధికారుల ప్రమేయం లేకుండా.. టెక్నాలజీతోనే ప్రభుత్వ సేవలు ప్రజలకు అందించే వీలుందని అన్నారు.
దీనికి తగ్గట్లుగానే విధివిధానాలు రూపొందిస్తున్నామని.. రాబోయే 9 నెలల్లోనే ప్రభుత్వ పనితీరులో ఈ మార్పును ప్రజలు చూడబోతున్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక అభివృద్ధి వికేంద్రీకరణే తమ విధానం అని చెప్పిన లోకేష్.. ఇందులో భాగంగానే అనంతపురాన్ని ఆటోమొబైల్ హబ్ గా, చిత్తురుని ఎలక్ట్రానిక్స్ హబ్ గా తీర్చిదిద్దబోతున్నామని అన్నారు!
ఇదే క్రమంలో.. గుంటూరు కృష్ణా పరిపాలనా రాజధానిగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు చేసి అమలు చేశామని.. ఇదే సమాంలో విశాఖను ఐటీ రాజధానిగా మార్చాలని తమ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఇదే సమయంలో... విశాఖ ఓ అద్భుతమైన ప్రదేశమని చెప్పిన లోకేష్.. మంచి ఎకో సిస్టమ్ విశాఖలో ఉందని అన్నారు.
ఇక ఓర్పుగా ఉండటం, ఎలాంటి పరిస్థితులనైనా ఒకేలా తీసుకుని ఎదుర్కోవడం వంటివి చంద్రబాబుని చూసి నేర్చుకున్నట్లు చెప్పిన నారా లోకేష్.. అన్న ఎన్టీఆర్ తో అనేక అనుభూతులు ఉన్నాయని.. గ్రాండ్ చిల్డ్రన్స్ అందరికీ ఆయనే పేర్లు పెట్టారని అన్నారు. తమపై ఎంతో ప్రేమను పంచేవారని.. ఆయన ఓ ఉన్నతమైన వ్యక్తి అని లోకేష్ వెల్లడించారు.
అలాంటి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరిపైనా ఉందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో... ఛాలెంజ్ లు తీసుకోవడం అంటే తనకు ఇష్టమని.. ఎక్కడైతే ఓడిపోయానో.. అక్కడే ప్రజల మనసు గెలుచుకుని రికార్డ్ మెజారిటీతో గెలిచినట్లు తెలిపారు.