Begin typing your search above and press return to search.

ఇంట్రస్టింగ్... రాజకీయాల్లోకి రాకముందు లోకేష్ చేసిన పని ఇదే!

తాజాగా మంగళగిరి పరిధిలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి సతీసమేతంగా వెళ్లిన లోకేష్.. ఆలయ ఆధ్వర్యంలో కొనసాగుతున్న గోశాలను సందర్శించారు.

By:  Tupaki Desk   |   14 March 2025 10:00 PM IST
ఇంట్రస్టింగ్... రాజకీయాల్లోకి  రాకముందు లోకేష్  చేసిన పని ఇదే!
X

ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హోలీ సందర్భంగా శుక్రవారం.. తన నియోజకవర్గం మంగళగిరి పరిధిలోని శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి సతీసమేతంగా వెళ్లిన లోకేష్.. అక్కడ పూజా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. అనంతరం గోశాలను సందర్శించారు. ఈ నేపథయంలోనే తన పాల వ్యాపారం గురించి స్పందించారు.

అవును... విదేశాల్లో చదువుకున్న నారా లోకేష్ రాష్ట్ర విభజన అనంతరం 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ గా ఎంపికై, మంత్రిగా పనిచేశారు. అయితే... చదువు పూర్తైన తర్వాత రాజకీయాల్లోకి వచ్చే మధ్య గ్యాప్ లో తాను ఏమి చేసింది లోకేష్ వెల్లడించారు. ఇందులో భాగంగా.. రాజకీయాల్లోకి రాకముందు తాను పాల వ్యాపారం చేసేవాడినని అన్నారు.

తాజాగా మంగళగిరి పరిధిలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి సతీసమేతంగా వెళ్లిన లోకేష్.. ఆలయ ఆధ్వర్యంలో కొనసాగుతున్న గోశాలను సందర్శించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ప్రసంగించారు. ఈ సందర్భంగా తాను గతంలో పాల వ్యాపారం చేసేవాడినని అన్నారు. అందుకే తనకు గోశాల ప్రాధాన్యం తెలుసని అన్నారు.

అయితే... తెలంగాణలో బీఆరెస్స్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి చెప్పినట్లుగా పూలమ్మినా, పాలమ్మినా అని లోకేష్ చెప్పలేదు కానీ... హెరిటేజ్ పేరిట స్థాపించిన డెయిరీ వ్యవహారాలను ఆయన పర్యవేక్షించేవారు. అయితే... లోకేష్ పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వచ్చేసిన తర్వాత ఆయన తల్లి భువనేశ్వరి, సతీమణి బ్రాహ్మణి ఈ సంస్థ కార్యకలాపాలు చూస్తుకుంటున్నారు!

ఇదే సమయంలో... ఎర్రబాలెంలో జైనుల ఆధ్వర్యంలో నిర్మించిన భగవాన్ మహవీర్ గోశాలను కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి లోకేష్ ప్రారంభించారు. అనంతరం.. హోలీ సందర్భంగా చిన్నారులకు లోకేష్ రంగులు పూశారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన.. మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... ఎన్నికల్లో భారీ మెజారిటీతో తనను గెలిపించిన మంగళగిరి వాసులకు జీతితాంతం గుర్తుండిపోయేలా అభివృద్ధి కార్యక్రమాలను రానున్న వంద రోజుల్లో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా... భూగర్భ డ్రైనేజీ, నడుమూరు ఫ్లైఓవర్ పనులతో పాటు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామని తెలిపారు.