Begin typing your search above and press return to search.

పవన్ కంగ్రాట్స్ అన్న లోకేష్!

జనసేన మీద పవన్ మీద లోకేష్ తనకు ఉన్న సాఫ్ట్ కార్నర్ ని అలా చాటుకున్నారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   14 March 2025 6:06 PM IST
పవన్ కంగ్రాట్స్ అన్న లోకేష్!
X

మంత్రి నారా లోకేష్ జనసేన బంధాన్ని అంతకంతకు పెంచుకుపోతున్నారు. జనసేన మీద ఆయన అపారమైన గౌరవాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ని అయితే అన్నా అని ఎంతో ఆత్మీయతతో సంభోదిస్తారు. పవన్ కి ఎక్కద లేని మర్యాద ఇస్తారు.

ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు ఎమ్మెల్సీ నామినేషన్ వేయడానికి వచ్చినపుడు మంత్రి నారా లోకేష్ అటెండ్ అయి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆయన స్వయంగా నాగబాబుకు స్వాగతం పలికి జనసైనికుల మనసును దోచేశారు. ఆద్యంతం నామినేషన్ కార్యక్రమంలో ఉండి మిత్ర పక్షం అంటే ఎంత ప్రేమ ఉందో చాటుకున్నారు.

ఇక వైసీపీ వారు పవన్ మీద ఏమైనా విమర్శలు చేస్తే జనసేన నేతలు కంటే ఎక్కువగా లోకేష్ రియాక్ట్ అవుతున్నారు. పవన్ ని ఏమైనా అంటే చూస్తూ ఊరుకునేది లేదని కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చేశారు. ఇవన్నీ పక్కన పెడితే మార్చి 14న జనసేన ఆవిర్భావ దినోత్సవం. పిఠాపురంలో అంతా పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఎటు చూసినా జనసేన బ్యానర్లు పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలతో సందడి చేస్తోంది. ఇక ఏపీ వ్యాప్తంగా జనసేన మీటింగ్ గురించే చెప్పుకుంటున్నారు.

ఇలా మిత్రపక్షం ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా మంత్రి నారా లోకేష్ జనసేనాని అయిన పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ మేరకు లోకేష్‌ చేసిన ఈ ట్వీట్‌ తెగ వైరల్ అవుతోంది. ఏపీ అభివృద్ధిపై జనసేన నిబద్ధత ప్రశంసనీయమని ఈ సందర్భంగా నారా లోకేష్‌ కొనియాడారు. అంతే కాదు రాష్ట్ర ప్రగతి కోసం ప్రజా సంక్షేమం కోసం జనసేన చేస్తున్న కృషి అందరికీ స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు.

సరైన సమయంలో లోకేష్ వేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జనసేన మీద పవన్ మీద లోకేష్ తనకు ఉన్న సాఫ్ట్ కార్నర్ ని అలా చాటుకున్నారని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ని అన్న అని సంభోదిస్తూ వస్తున్న లోకేష్ ఈ బంధాన్ని శాశ్వతం చేసుకోవాలని చూస్తున్నారు.

జనసేనతో మరింత బలమైన బంధాన్ని ఆయన కోరుకుంటున్నారు. పవన్ సైతం మరో మూడు టెర్ములు ఏపీలో టీడీపీ కూటమి అధికారంలో ఉండాలని కోరుకున్నారు. దానికి తగినట్లుగానే లోకేష్ నుంచి ఈ విధంగా స్పందన వస్తోంది. దీంతో ఏపీలో టీడీపీ కూటమి బంధం మరింత దృఢతరం అవుతోంది. నానాటికీ పటిష్టం అవుతోంది. ఇదే విధంగా ముందుకు సాగితే మాత్రం ఏపీ పాలిటిక్స్ లో కూటమికి ఎదురు ఉండదని అంటున్నారు.