నా భార్యనే నా క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లిస్తుంది : నారా లోకేష్
తెలుగు దేశం పార్టీ (టీడీపీ) ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఎన్డీటీవీ కాన్‌క్లేవ్‌లో పాల్గొని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
By: Tupaki Desk | 8 March 2025 4:21 PM ISTతెలుగు దేశం పార్టీ (టీడీపీ) ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఎన్డీటీవీ కాన్‌క్లేవ్‌లో పాల్గొని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ నిర్వహించిన ఈ ఇంటర్వ్యూలో, ఇంటి వ్యవహారాలు, మహిళల భాగస్వామ్యం, కుటుంబంలోని స్త్రీల శక్తి గురించి లోకేష్ మాట్లాడారు.
- భార్య బ్రహ్మాణి కీలక పాత్ర
మహిళా దినోత్సవం సందర్భంగా రాజ్‌దీప్ సూటిగా లోకేష్‌ను ఆయన భార్య నారా బ్రహ్మాణి, తల్లి నారా భువనేశ్వరి గురించి ప్రశ్నించారు. వీరిద్దరూ తమ బిజినెస్, కుటుంబ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. దీనికి స్పందించిన లోకేష్ "ఇప్పటికీ నా క్రెడిట్ కార్డ్ బిల్లు నా భార్య బ్రహ్మాణి కడుతుంది" అని సరదాగా వెల్లడించారు.
- బిజినెస్, కుటుంబ బాధ్యతల సమతుల్యం
బ్రహ్మాణి బిజినెస్‌లో డైరెక్టర్‌గా వ్యాపారాలను సమర్థవంతంగా నడుపుతూ, మా కొడుకును చూసుకుంటూ, ఇంటి వ్యవహారాలనూ సమతుల్యం చేస్తోంది. మా అమ్మ, మా భార్య మా ఇంటి మూలస్తంభాలు," అని లోకేష్ చెప్పారు. బ్రహ్మాణి విజయవంతమైన వ్యాపారవేత్తగా మారడంలో ఆమె కృషిని లోకేష్ అభినందించారు.
- వర్క్-లైఫ్ బాలన్స్ నేర్చుకోవాలంటే బ్రహ్మాణినే ఆదర్శం
తాను బ్రహ్మాణి నుండి నేర్చుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటని అడిగిన ప్రశ్నకు లోకేష్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. "నేను బ్రహ్మాణిని నుండి ఏదైనా నేర్చుకోవాలంటే అది 'వర్క్-లైఫ్ బాలాన్స్'. ఆమె ఒకవైపు వ్యాపార బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరోవైపు కుటుంబాన్ని సమర్థంగా నిర్వహిస్తుంది" అని లోకేష్ పేర్కొన్నారు.
- మహిళల శక్తికి గుర్తింపు
ఈ ఇంటర్వ్యూలో మహిళల శక్తి, వారి ప్రాధాన్యత గురించి లోకేష్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. మహిళలు ఎలాంటి రంగంలోనైనా తమదైన ముద్ర వేయగలరని, కుటుంబాన్ని, ఉద్యోగాన్ని సమర్థంగా నిర్వహించగలరని ఆయన అభిప్రాయపడ్డారు.
నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు, నేటి సమాజంలో మహిళల పాత్ర, వారి శక్తిని గుర్తించాల్సిన అవసరాన్ని హైలైట్ చేశాయి. కుటుంబాల్లో మహిళల కీలక పాత్రను మరింత పదిలం చేయాలని ఆయన సూచించారు.