రెడ్ బుక్ – గుడ్ బుక్... యూఎస్ లో లోకేష్ ఇంట్రస్టింగ్ కామెంట్స్!
ఏపీ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 1 Nov 2024 8:28 AM GMTఏపీ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. అట్లాంటాలో ఆయన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయానికి సహకరించిన అందరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలో రెడ్ బుక్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
అవును... 2024 సార్వత్రిక ఎన్నికల్లో భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఓటర్లు, టీడీపీ అభిమానులు, కార్యకర్తలు వచ్చి ఏపీలో ఓట్లు వేశారని.. ఏపీని కాపాడుకోవడం కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరీ దేశ విదేశాల నుంచి ఏపీకి వచ్చి ఓట్లు వేశారని.. వారందరి లక్ష్యం ఏపీని కాపాడటమే అని అన్నారు.
అందుకే... కూటమికి దక్కిన ఈ ఘన విజయం టీడీపీ, జనసేన, బీజేపీలదే కాదని.. ప్రపంచంలో ఉన్న తెలుగువారందరిదీ అని లోకేష్ తెలిపారు. ఇక గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు విదేశాల్లో ఉన్నవారంతా నల్లజెండాలు చేతపట్టి నిరసనలు తెలిపారని.. అది తమకు కోండంత అండ అని లోకేష్ తెలిపారు.
ఇక రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తమని.. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకెళ్లాలని చెప్పిన లోకేష్... సంక్షేమం అంటే ఏమిటో ఎన్టీఆర్ చూపించారని, ప్రపంచంలో తెలుగువారు తలెత్తుకొని తిరిగే పరిస్థితి తీసుకొచ్చారని.. ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో ఎప్పుడూ ముందుటామని తెలిపారు.
ఈ సందర్భంగా... ఇకపై మీరు ఎన్నారైలు కదని.. ఎమ్మారైలు అని లోకేష్ తెలిపారు. ఎమ్మారై అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్ అని అర్ధమని తెలిపారు. ఈ నేపథ్యంలోనే రెడ్ బుక్ ప్రస్థావన చేశారు లోకేష్. ఈ సందర్భంగా.. రెడ్ బుక్ లో రెండు చాప్టర్లు ఓపెన్ అయిపోయాయని.. త్వరలో మూడో చాప్టర్ కూడా తెరుస్తామని అన్నారు.
అయితే.. ఆ మూడో చాప్టర్ గురించి అదే వేదికపై తనతో ఉన్న గన్నవరం ఎమ్మెల్యే వెంకట్రావు, గుడివాడ ఎమ్మెల్యే రాము ని అడగాలని.. వారిని అడగాల్సిన బాధ్యత మీపై ఉందని లోకేష్ స్పష్టం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించినవారికి కచ్చితంగా సినిమా చుపిస్తామని లోకేష్ అన్నారు. దీంతో... ఈ విషయం మరింత చర్చనీయాంశంగా మారింది.