లోకేష్ కూడా రెడీ !
కట్ చేస్తే ఇపుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా జనంలోకి రానున్నారు అని అంటున్నారు.
By: Tupaki Desk | 16 Jan 2025 7:30 AM GMTఏపీలో అధికారంలోకి టీడీపీ కూటమి వచ్చి ఏడు నెలలే అయింది. ఇంకా ఎన్నికలకు చాలా దూరం ఉంది. అంతే కాదు కూటమి చేతిలో అధికారం అక్షరాల నాలుగున్నర నెలల దాకా ఉంది. దీంతో పాలన హాయిగా చేసుకోవచ్చు.
కానీ ఏపీలో చూస్తే ఆ పరిస్థితి అయితే అసలు కనిపించడం లేదు. ఎందువల్ల అంటే అధికారం నుంచి రాజకీయం అలాగే రాజకీయం నుంచి అధికారం ఇలా ఈ రెండూ విడదీయలేని బంధంగా మారిపోయాయి. కేంద్రంలో చూసినా మోడీ అధికారంలో ఉంటూనే ఎపుడూ ఎన్నికల కోసం వివిధ రాష్ట్రాలలో పర్యటనలు రాజకీయ సభలతో బిజీగా ఉంటారు.
దాని వల్లనే బీజేపీ క్యాడర్ కూడా నిరంతరం అలెర్ట్ అవుతూ ఉంటుంది. వారిలో ఆ వేడి కసి అలాగే ఉంటాయి. అందుకే వరస విజయాలకు బీజేపీకి దక్కుతున్నాయి. ఇపుడు ఈ సూత్రాన్ని ఏపీ రాజకీయ పార్టీలు కూడా గట్టిగా పట్టించుకున్నాయని అంటున్నారు.
కొత్త ఏడాది 2025 వచ్చేసింది. ఆ తరువాత పెద్ద పండుగ సంక్రాంతి కూడా ముగిసింది. దాంతో రాజకీయాలు మల్లీ వేడెక్కుతున్నాయి. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ జనంలోకి రావడానికి ముహూర్తం గతంలోనే పెట్టేశారు. ఆయన ప్రస్తుతం లండన్ టూర్ లో ఉన్నారు.
ఆయన అక్కడ నుంచి ఏపీకి రాగానే ఫిబ్రవరి మొదటి వారం నుంచి జిల్లా పర్యటనలు స్టార్ట్ అవుతాయి. ప్రతీ జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించేలా జగన్ తన టూర్ ని రెడీ చేస్తున్నారు. ఆ మేరకు వైసీపీ యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేసింది
జగన్ జనం లోకి వస్తున్న టైం లోనే ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కూడా జనం లోకి వెళ్లాలని అనుకుంటున్నారు. ఆయన కూడా రానున్న రోజులల్లో క్షేత్ర స్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టబోతున్నారు. పవన్ తన రాజకీయ జీవితంలో విపక్ష పాత్రనే ఇంతకాలం పోషిస్తూ వచ్చారు.
మొదటి సారి అధికారంలో ఉంటూ జనం లోకి రావడం అన్నది పవన్ కి కొత్త అనుభవం. దాంతో పాటుగా ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని చేతిలో ఉన్న అధికారంతో పరిష్కరించడం ద్వారా పార్టీ విస్తరణకు అలాగే రాజకీయంగా బలపడేందుకు మార్గం సుగమం చేసుకోవాలన్నది జనసేన నాయకత్వం ఆలోచనగా కనిపిస్తోంది అంటున్నారు.
కట్ చేస్తే ఇపుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా జనంలోకి రానున్నారు అని అంటున్నారు. ఆయన కూడా ఫిబ్రవరి నుంచి పార్టీ పటిష్టత మీద దృష్టి పెడతాను అని అంటున్నారు. ఆయన సైతం పార్టీని మరింతగా గట్టి పరచేందుకు క్యాడర్ కి దగ్గర అయ్యేందుకు తద్వరా ప్రభుత్వానికి పార్టీని మధ్య కనెక్టివిటీని మరింతగా పెంచేందుకు ఈ టూర్లను ఉపయోగించాలని చూస్తున్నారు.
మొత్తం మీద చూస్తూంటే మరి కొద్ది రోజులలో జగన్ పవన్ లోకేష్ ఈ ముగ్గురు నేతలూ జనంలోకి రానున్నారు అని అంటున్నారు. దీంతో కొత్త ఏడాదిలో రాజకీయం వేసవి రాక ముందే హీటెక్కించే సూచనలు అయితే బలంగా కనిపిస్తున్నాయి.