Begin typing your search above and press return to search.

లోకేష్ ఫుల్ సైలెంట్...మ్యాటరేంటి ?

కానీ లోకేష్ ఈ ఇష్యూలో జోక్యం చేసుకోలేదు ఎందుకు అన్నదే అంతటా చర్చ సాగుతోంది. అయితే లోకేస్ధ్ కావాలనే సైలెంట్ అయ్యారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   11 Jan 2025 9:30 PM GMT
లోకేష్ ఫుల్ సైలెంట్...మ్యాటరేంటి ?
X

ఏపీలో అతి పెద్ద ఇష్యూగా తిరుపతిలోని తొక్కిసలాట ఉదంతం జరిగింది. వైకుంఠ ఏదాదశి వేళ ఏడుకొండల వాడి దర్శనం చేసుకోవాలని భావించి భక్తితో తిరుపతి వెళ్ళిన ఆరుగురు అమాయకులు అకాల మృత్యు వాత పడ్డారు. ఇది జాతీయ స్థాయిలోనే అతి పెద్ద ఇష్యూగా మారింది.

ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రతిపక్ష నేత జగన్ అంతా కలసి బాధితులను పరామర్శించారు. మంత్రులు అంతా కూడా సగానికి సగం తిరుపతిలో కనిపించారు. దీని మీద టీడీపీ కూటమి వర్సెస్ వైసీపీగా పొలిటికల్ రచ్చ కూడా సాగుతోంది. ఇంకో వైపు ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ ప్రభుత్వం తరఫున బహిరంగ క్షమాపణలు చెప్పారు. అంతే కాదు టీటీడీ అధికారులు కూడా చెప్పాలంటే ఎట్టకేలకు టీటీడీ చైర్మన్ కూడా చెప్పారు.

ఇలా తొక్కిసలాట ఇష్యూ రాజకీయనా అనేక మలుపులు తిరిగిగింది. కాంగ్రెస్ కమ్యూనిస్టుల నుంచి అన్ని రాజకీయ పార్టీలూ అందరు మంత్రులు కూడా దీని మీద మాట్లాడారు. కానీ కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉంటున్న నారా లోకేష్ మాంత్రం సైలెంట్ గా ఉండిపోయారు. ఆయన ఎందుకు అలా ఉన్నారు అన్నదే ఇపుడు చర్చకు వస్తోంది.

ఇంత పెద్ద ఇష్యూ జరిగి కూటమి ప్రభుత్వం కుదుపునకు గురి అయినపుడు కీలకంగా ఉన్న లోకేష్ రియాక్ట్ కావాల్సిందే కదా అన్న చర్చ ఉంది. ఆయన బాధితులను పరామర్శించకలేకపోవచ్చు కానీ ఈ ఇష్యూ మీద తనదైన శైలిలో రియాక్ట్ అయితే బాగుండేది అని అంటున్నారు.

కానీ లోకేష్ ఈ ఇష్యూలో జోక్యం చేసుకోలేదు ఎందుకు అన్నదే అంతటా చర్చ సాగుతోంది. అయితే లోకేస్ధ్ కావాలనే సైలెంట్ అయ్యారని అంటున్నారు. జరిగిన ఇష్యూ సున్నితమైనది సెంటిమెంట్ తో కూడుకున్నది. ఎంతో మంది మనోభావాలతో సంబంధం కలిగినది. ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. ఇక ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు ఈ ఇష్యూలో లాజికల్ కంక్లూషన్ కి తెచ్చేందుకు తన వరకూ ప్రయత్నం చేశారు.

ఆయన ఒక రోజంతా తిరుపతిలోనే గడిపి చేయాల్సిన పరామర్శలు చేశారు చెప్పాల్సిన వారికి చెప్పి క్లాసులు తీసుకున్నారు. దాంతో లోకేష్ ప్రత్యేకంగా ఎందుకు అని మౌనంగా ఉన్నారని అంటున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లేవనెత్తిన క్షమాపణల డిమాండ్ కూడా కొంతవరకూ ఇష్యూని వేరే విధంగా తీసుకెళ్ళింది.

ఇవన్నీ గమంచించిన మీదటనే లోకేష్ అలా సైలెంట్ అయ్యారని అంటున్నారు. అయితే బీఆర్ నాయుడు లోకేష్ చాయిస్ అని అందుకే ఈ కీలక టైంలో ఏ విధంగా రెస్పాండ్ అయినా ఇబ్బందిగానే ఉంటుందనే ఆయన సైలెంట్ అయ్యారు అన్న చర్చ కూడా ఉంది.

ఏది ఏమైనా మంత్రిగా కీలకంగా ఉన్న లోకేష్ ఇటువంటి ఇష్యూస్ లో మాట్లాడితేనే బాగుంటుంది అని అంటున్నారు. పైపెచ్చు ఆయన గతంలో లడ్డూల కల్తీ విషయంలో గట్టిగా మాట్లాడారని ఇపుడు ఆరుగురు భక్తుల మృతి విషయంలో మౌనంగా ఉండడమేంటన్న చర్చ కూడా ఉంది. మొత్తానికి ఏపీ మొత్తం అందరూ రెస్పాండ్ అయిన ఒక అతి పెద్ద ఇష్యూలో లోకేష్ వాయిస్ అయితే ఎక్కడా పెద్దగా వినిపించకపోవడం మాత్రం ఆశ్చర్యంగనే ఉంది అని అంటున్నారు.