Begin typing your search above and press return to search.

ఈ టెర్మ్ లోకేష్ కి చాలా కీలకమా ?

ఇది రాజకీయం తెలిసిన వారి మాట. అనుభవం తో చెప్పే వారి మాట. దేశ రాజకీయాలను కాల మాన పరిస్థితులను చూసి చెప్పే మాట.

By:  Tupaki Desk   |   29 Jan 2025 7:30 AM GMT
ఈ టెర్మ్ లోకేష్ కి చాలా కీలకమా ?
X

ఇది రాజకీయం తెలిసిన వారి మాట. అనుభవం తో చెప్పే వారి మాట. దేశ రాజకీయాలను కాల మాన పరిస్థితులను చూసి చెప్పే మాట. ఎందుకు అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమ్మని ఒక ముతక సామెత ఉంది. అది కాలాలకు అతీతంగా అందరికీ పనికి వచ్చే సామెతగానే చూడాలి.

ఏపీలో ఈ రోజున టీడీపీ ప్రభ దివ్యంగా వెలిగిపోతోంది. అసెంబ్లీ నిండుగా ఆ పార్టీ పరచుకుంది. మరో నాలుగేళ్లకు పైగా అధికారం చేతిలో ఉంది. ఈ సమయంలోనే టీడీపీ భావి వారసుడిని కూడా సిద్ధం చేసుకోవాల్సి ఉంది అని ఆ పార్టీ హితైషులు సూచిస్తున్నారు.

లోకేష్ కి ఎన్ని పార్టీ పదవులు ఇచ్చినా లేక ఆయనకు ఎంత ప్రయారిటీ ఇచ్చినా సీఎం కుర్చీలో కూర్చోబెట్టకపోతే అవన్నీ వృధావే అని విశ్లేషిస్తున్న వారూ ఉన్నారు. ఇక ఏపీలో రాజకీయం చూస్తే పార్టీలను అయిదేళ్ళకు ఒకమారు మార్చేయడం జనాలకు అలవాటు. ఎంత మేలు చేసినా వారు కొత్త వారి వైపు చూస్తారు.

వైసీపీ కూడా అదే ఆశతో కాచుకుని ఉంది. ఇక కేంద్రంలో బీజేపీ ఉంది. ఆ పార్టీకి ఉత్తరాదిలో పూర్తిగా అవకాశాలు అన్నీ అయిపోయాయి. ఇక అక్కడ రాజకీయ క్షీణత మొదలైన నేపథ్యంలో దక్షిణాది నుంచి దానిని కవర్ చేసుకోవాలని చూస్తోంది. ఈసారి గెలవాలీ అంటే సౌత్ స్టేట్స్ అందునా ఏపీ తెలంగాణా ముఖ్యం అనుకుంటోంది.

టీడీపీ కూటమిలో బీజేపీ ఉన్నా జాతీయ పార్టీగా పెద్దన్న పాత్ర కమలానిదే అవుతోంది. జనసేనను ముందు పెట్టి అనుకూల పరిస్థితులు వస్తే చాణక్య రాజకీయం బీజేపీ చూపించదు అనుకుంటే పొరపాటే అవుతుంది.అంటున్నారు. జనసేన వైపు నుంచి చూసినా పవన్ కళ్యాణ్ కి పదవుల మీద ఆశలు లేవని అనుకున్నా ఆయన వెనక బలమైన సామాజిక వర్గానికి ఆకాంక్షలు ఉన్నాయి. అలాగే విశేష అభిమానులూ అనుచరులూ కూడా పవన్ లో సీఎం ని ఇప్పటికే చూసుకుంటున్న నేపథ్యం ఉంది.

ఇలా ఏపీ రాజకీయం ఉన్న పరిస్థితులలో 2029లో ఏమి జరుగుతుంది అన్నది ఎవరూ జోస్యం చెప్పలేరు అంటున్నారు.. మళ్ళీ కూటమి గెలిచినా అనేక సమీకరణాలు ముందుకు రావచ్చు అన్నది కూడా ఉంది అంటున్నారు. ఇపుడున్నట్లుగా బీజేపీ జనసేన జూనియర్ పార్టనర్స్ గా ఉండే చాన్సే రేపటి రోజున ఉండకపోవచ్చు సీట్లు కూడా పొత్తులో భాగంగా ఎక్కువగా కోరవచ్చు అంటున్నారు..

ఇలా అనేకమైన విషయాలు ఉన్నాయని అంటున్నారు. అందువల్ల లోకేష్ ని ఈ టెర్మ్ లో అంటే 2029 ఎన్నికలకు ఏడాది ముందు అయినా సీఎం గా చేస్తే ఆయన పొలిటికల్ కెరీర్ కి స్ట్రాంగ్ గా ఫౌండేషన్ పడుతుంది అన్న వారే ఎక్కువగా ఉన్నారని అంటున్నారు. అయితే ఈ నాలుగేళ్ళ పాటు ఏపీకి చంద్రబాబు అనుభవం సేవలు అవసరమని వాదించే వారూ ఉన్నారు.

ఆయన అమరావతి పోలవరం వంటి వాటిని ఒక రూపునకు తేవడమే కాకుండా ఆర్థిక పరిస్థితిని కూడా గాడిలో పెట్టిన మీదటనే లోకేష్ కి పగ్గాలు అప్పగిస్తే టీడీపీ రాజకీయం మరి కొన్ని దశాబ్దాలకు సరిపడా ఇంధనం సమకూర్చుకోగలదు అన్నది పార్టీని అభిమానించే వారు భావనగా ఉంది. బహుశా టీడీపీ అధినాయకత్వం ఆలోచనలు అవే కావచ్చు అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.