టీచర్లపై కేసులు ఎత్తేస్తాం: లోకేష్ సంచలన ప్రకటన
అంతేకాదు.. ఉపాధ్యాయులపై అనేక కేసులు కూడా నమోదయ్యాయి. కొందరిని గృహ నిర్బంధం కూడా చేయడం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది.
By: Tupaki Desk | 15 Nov 2024 9:58 AM GMTఏపీ మానవవనరుల శాఖ మంత్రి నారా లోకేష్.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 లక్షల మందికి పైగా ఉపాధ్యా యులకు తీపి కబురు చెప్పారు. వారి గుండెలపై ఉన్న భారాన్ని తగ్గించేశారు. త్వరలోనే ఉపాధ్యాయుల పై ఉన్న కేసులను అన్నింటినీ ఎత్తి వేస్తామని చెప్పారు. దీనికి సంబంధించి రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరు మలరావుతో మాట్లాడుతున్నామన్నారు. ఆయన దీనిపై త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తారని చెప్పారు. ఈ మేరకు తాజాగా శుక్రవారం ఉదయం సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు.
ఏంటీ కేసులు?
జగన్ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు వేతన బకాయిలు, డీఏ బకాయిలతోపాటు.. 2019 నాటి ఎన్నికల్లో వైసీపీ ఇచ్చిన కీలక హామీల్లో ఒకటైన సీపీఎస్ విధానం రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ.. ఉద్య మించారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు.. ఉపాధ్యాయులు కూడా కలిసి కట్టుగా వైసీపీ సర్కారుపై యుద్ధం ప్రకటించారు. ఈ క్రమంలోనే విజయవాడలో మిలియన్ మార్చ్‌కు పిలుపునిచ్చారు. అయితే.. వీరి ఉద్య మాన్ని వైసీపీ ఎక్కడికక్కడ నిలువరించింది. అరెస్టులు చేసింది.
అంతేకాదు.. ఉపాధ్యాయులపై అనేక కేసులు కూడా నమోదయ్యాయి. కొందరిని గృహ నిర్బంధం కూడా చేయడం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. ఇలా.. ఒక్కొక్కరిపై రెండు నుంచి నాలుగు, కొందరిపై పదుల సంఖ్యలోనే తీవ్ర కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు సర్కారు మారడంతో తమపై అప్పట్లో వైసీపీ ప్రభుత్వ సూచనల మేరకు పెట్టిన కేసులను వెత్తి వేయాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు మంత్రి నారా లోకేష్‌ను కోరారు. దీనికి కొన్నాళ్ల కిందటే ఆయన ఓకే చెప్పారు.
తాజాగా ఇదే విషయం సభలో చర్చకు రావడంతో నారా లోకేష్ సానుకూలంగా స్పందిస్తూ.. ఉపాధ్యాయు లకు తీపికబురు చెప్పారు. మరోవైపు.. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని లోకేష్ పేర్కొన్నారు. ఎటువంటి లీగల్ లిటిగేషన్లు లేకుండా టీచర్ పోస్టుల భర్తీచేయాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. టీచర్ పోస్టుల భర్తీకి చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటున్నామన్నారు. డిఎస్సీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపునకు సంబంధించిన ఫైలు సిఎం వద్ద ఉందని కూడా నారా లోకేష్ చెప్పారు.