Begin typing your search above and press return to search.

టీడీపీలో 'ఉమ్మ‌డి' సెగ‌.. బాబు ఏమ‌న్నారంటే!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం తెలుగుదేశం పార్టీలోనూ ఉమ్మ‌డి పౌర‌స్మృతిపై సెగ ర‌గులుతోంది.

By:  Tupaki Desk   |   19 July 2023 5:12 PM GMT
టీడీపీలో ఉమ్మ‌డి సెగ‌.. బాబు ఏమ‌న్నారంటే!
X

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం తెలుగుదేశం పార్టీలోనూ ఉమ్మ‌డి పౌర‌స్మృతిపై సెగ ర‌గులుతోంది. అయితే.. అధికార‌పార్టీ వైసీపీలో ఉన్నంత కాక‌పోయినా.. ఇక్క‌డ కూడా నాయ‌కులు పార్టీ అధినేత చంద్ర‌బాబుపై ఒత్తిడి అయితే తెచ్చారు. తాజాగా ఎన్టీఆర్ భ‌వ‌న్‌లో ముస్లిం మ‌త పెద్ద‌లు, టీడీపీ ముస్లిం మైనారిటీ నాయ‌కులు చంద్ర‌బాబును క‌లిశారు. ఆయ‌న‌ను ఘ‌నంగా ప‌ట్టు శాలువాలు క‌ప్పి స‌త్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఉమ్మ‌డి పౌర్మ‌సృతిపై వారు చంద్ర‌బాబుతో చ‌ర్చించారు.

చంద్ర‌బాబును క‌లిసిన వారిలో పార్టీ ముఖ్య నాయకులు, శాస‌న మండ‌లి మాజీ చైర్మ‌న్‌ షరీఫ్, మాజీ డిప్యూటీ చైర్మ‌న్‌ ఫరుక్ , మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషా, షుబ్లీ తో పాటు విజయవాడ పార్లమెంటు మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ కరీముల్లా, రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి సయ్యద్ కరిముల్లా తదితరులు పాల్గొన్నారు. వీరంతా కూడా చంద్ర‌బాబుకు యూసీసీతో జ‌రిగేన‌ష్టం.. వ‌చ్చే క‌ష్టాల‌ను వివ‌రించారు. సుమారు రెండు గంట‌ల పాటు చంద్ర‌బాబు వారితో చ‌ర్చించారు.

అయితే.. చంద్ర‌బాబు ఈ సంద‌ర్భంగా వారితో మాట్లాడుతూ.. ``మ‌నం ఏ మ‌తానికీ వ్య‌తిరేకం కాదు. అన్ని మ‌తాలు బాగుండాలి. అన్ని వ‌ర్గాలు సంతోషంగా ఉండాలి అనేది టీడీపీ సిద్ధాంతం. అందుకే టీడీపీ హ‌యాంలో మైనారిటీల‌కు కూడా రంజాన్ తోఫా ఇచ్చాం. షాదీముబాక‌ర్ ఇచ్చాం. షాదీ ఖానా నిర్మాణాల‌కు స్థ‌లాలు కేటాయించాం. విదేశీ విద్య‌ను ప్రోత్స‌హించాం. మ‌క్కా యాత్ర‌కు నిధులు ఇచ్చాం. కాబ‌ట్టి మైనారి టీవ‌ర్గాల‌కు టీడీపీ ఎప్పుడూ అనుకూల‌మే`` అని వ్యాఖ్యానించారు.

యూసీపీపై చంద్ర‌బాబు మాట్లాడుతూ.. ``యూసీసీ అనేది పార్ల‌మెంటులో చ‌ర్చ‌కు వ‌స్తే.. మ‌న ఎంపీలు కూడా దానిని వ్య‌తిరేకిస్తారు. అస‌లు ఆ బిల్లులో ఏముందో తెలియాలి. మంచి చెడు తెలుసుకుందాం. మైనారిటీ వ‌ర్గాల‌కు ఏ చిన్న హాని ఉన్నా.. దానిని పూర్తిగా వ్య‌తిరేకించే బాధ్య‌త ఎంపీలు త‌ప్ప‌కుండా తీసుకుంటారు. అయితే.. ముసాయిదా బిల్లుపై మ‌రోసారి మ‌నంద‌రం కూడా చ‌ర్చించుకుందాం. ముందు బిల్లు రానివ్వండి`` అని వ్యాఖ్యానించారు.