పొత్తులను ఖరారు చేసిన బాబు అరెస్ట్....?
ఏపీలో పొత్తుల విషయంలో విపక్షాలలో అయోమయం ఉందని అంతా అనుకుంటూ వస్తున్నారు.
By: Tupaki Desk | 10 Sep 2023 2:13 PM GMTఏపీలో పొత్తుల విషయంలో విపక్షాలలో అయోమయం ఉందని అంతా అనుకుంటూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీ ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధమైపోయింది. ఆ విషయం చాలా సార్లు ఆ పార్టీ అధినేతలు చెబుతూ వస్తున్నారు. ఇక టీడీపీ అయితే పొత్తులతోనే వెళ్తుందని అంతా ఊహిస్తున్నారు.
జనసేన టీడీపీ బీజేపీల మధ్య పొత్తులు ఉంటాయని కూడా అంటున్నారు. ఏపీ బీజేపీ చీఫ్ మారాక ఆ పార్టీ స్టేట్ వింగ్ టీడీపీకి అనుకూలంగా మారింది అని ప్రచారంలో ఉంది. కానీ కేంద్ర పెద్దలే పొత్తులు డిసైడ్ చేయాల్సి ఉంది. కాబట్టి ఆ విషయంలో సస్పెన్స్ అలాగే కొనసాగుతోంది. అయితే చంద్రబాబు అరెస్ట్ ఏపీ రాజకీయ పరిణామాలను మార్చేసేలా ఉంది అని అంటున్నారు.
చంద్రబాబు అరెస్ట్ అయితే కెంద్ర బీజేపీ పెద్దల నుంచి మద్దతుగా ఒక్క ప్రకటన రాలేదని అంటున్నారు చంద్రబాబు అరెస్ట్ అక్రమమనో లేక సక్రమమనో ఏదో ఒక ప్రకటన చేసి ఉంటే ఏపీ రాజకీయాల్లో బీజేపీ స్టాండ్ ఏంటి ఆ పార్టీ పొత్తుల కధ ఏంటి అన్నది తెలిసే అవకాశం ఉంది. కానీ బీజేపీ మాత్రం మౌనాన్నే ఆశ్రయిస్తోంది.
దీని మీదనే అందరికీ అనుమానాలు వ్యక్తం అవుతునాయి. వామపక్షాలు అయితే ఇది కేంద్ర పెద్దల అండతో జరిగిన అరెస్ట్ అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే చంద్రబాబు అరెస్ట్ తరువాత వామపక్షాలు ఆయనకు గట్టిగానే సపోర్ట్ చేశాయి. బాబును అన్యాయంగా అరెస్ట్ చేశారని కూడా విమర్శించాయి. బీజేపీని బాబు నమ్మవద్దు అని కూడా సూచిస్తున్నాయి.
ఇక జనసేన అయితే స్ట్రాంగ్ సపోర్ట్ ఇస్తూ స్టేట్మెంట్స్ రిలీజ్ చేసింది. పవన్ కళ్యాణ్ మొదట వీడియో మేసేజ్ ద్వారా చంద్రబాబు అరెస్ట్ ని ఖండిస్తూ బాబుకు సంపూర్ణ మద్దతు తెలియచేశారు. ఆ మీదట ఆయన ఏపీకి కూడా తరలివచ్చారు. ఆయన వచ్చినది జనసేన వారాహి యాత్ర గురించి చర్చించడానికి అని పార్టీ వర్గాలు అంటున్నా ఏపీలో సంచలన పరిణామంగా మారిన బాబు అరెస్ట్ నేపధ్యంలోనే పవన్ వచ్చారని మరో వైపు ప్రచారంలో ఉంది.
ఇక పవన్ కళ్యాణ్ ఇంతలా మద్దతు ఇస్తూ ఏపీకి హుటాహుటిన రావడం అంటే ఆరు నూరు అయినా టీడీపీతో జనసేన పొత్తులు ఖరారు అయ్యాయనే అంటున్నారు. అదే టైం లో పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్ పోవాలని గట్టిగానే పిలుపు ఇస్తున్నారు. చంద్రబాబుని పరిపాలనాదక్షుడిగా కీర్తిస్తున్నారు. ఒక విధంగా ఈ కామెంట్స్ అన్నీ కూడా జనసేన టీడీపీ బంధాన్ని బలపరుస్తున్నాయని అంటున్నారు. ఈ నేపధ్యంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు ఖరారు అయిందని ప్రచారంలో ఉంది.
అదే విధంగా బీజేపీ తేల్చకపోతే వామపక్షాలు కూడా రెడీగా ఉన్నాయని అంటున్నారు. ఇక అరెస్ట్ తరువాత టీడీపీ పొత్తుల ఆలోచనలలో కూడా మార్పు వచ్చే చాన్స్ ఉంటుంది అని అంటున్నారు. బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నాలు చేయాలా లేదా వేరే ఆల్టర్నేషన్ రెడీ చేసుకోవాలా అన్నది ఆలోచిస్తారని అంటున్నారు. బాబు అరెస్ట్ తో ఏపీ రాజకీయాల్లో సరికొత్త మార్పులు కొత్త పొత్తులు కూడా కుదిరే అవకాశాలు అయితే ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి రానున్న రోజులలో ఏమి జరుగుతుందో.