పర్యటన ఓకే.. బాబుగారూ.. సమస్యల పరిష్కారమే కీలకం!
ఏపీలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు అనేక కార్యక్రమాలు చేపడుతున్నా రు. ప్రజలకు చేరువ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ వంటి కార్యక్ర మాలను చేపట్టి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లారు.
By: Tupaki Desk | 30 July 2023 6:28 AM GMTఏపీలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు అనేక కార్యక్రమాలు చేపడుతున్నా రు. ప్రజలకు చేరువ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ వంటి కార్యక్ర మాలను చేపట్టి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లారు. అదేసమయంలో ప్రాంతాల వారీగా కూడా కలియ దిరిగి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు.. వాటిపై పోరాడేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక, ఇప్పుడు ఇదే పరంపరలో సీమ పర్యటనకు వెళ్తున్నారు.
ఆగస్టు 1 నుంచి సీమప్రాంతంలోని చిత్తూ రు, కడప, అనంతపురం జిల్లాల్లో చంద్రబాబు పర్యటించను న్నారు. వరుసగా నాలుగు రోజుల పాటు ఆయ న అక్కడే ఉండనున్నారు. ఈ క్రమంలో రైతులతో మమే కం అవుతున్నారు. అదేవిధంగా సాగు నీటి ప్రాజె క్టుల తీరుతెన్నులు, రైతులకు అందుతున్న సాగునీరు.. ఇక, జిల్లాల్లో నీటి సంక్షొభం వంటి అనేక విషయా లపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలన్నది చంద్రబాబు ఉద్దేశం. షెడ్యూల్ కూడా.
అయితే.. పార్టీ పరంగా చూసుకుంటే.. సీమ జిల్లాలకు చంద్రబాబు వచ్చి.. ఆరు మాసాలు అయింది. తన సొంత నియోజకవర్గంలో మాత్రమే గత నెలలో ఆయన పర్యటించారు. అంటే.. మరో ఏడెనిమిది మాసాల్లో జరగనున్న ఎన్నికలను గమనిస్తే.. ఇప్పుడు సీమ జిల్లాల్లో చంద్రబాబు పర్యటన అత్యంత కీలకమనే చెప్పాలి. మరి ఇలాంటి సమయంలో పార్టీపరంగా ఉన్న సమస్యలను కూడా ఆయన పరిష్కరించాలని పార్టీ నేతలు కోరుతున్నారు. చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య సఖ్యత కరువవుతోంది.
అనంతపురంలో చంద్రబాబు పర్యటించనున్న కళ్యాణదుర్గం, రాప్తాడు, కదిరి వంటి నియోజకవర్గాల్లోనూ పార్టీ పరిస్థితి ఆధిపత్య ధోరణితోనే ఉంది. ఇక, పక్కనే ఉన్న పుట్టపర్తిలో అంతర్గత కుమ్ములాటలు.. సొంత నేతల మధ్యే విభేదాలు కొనసాగుతున్నాయి. పార్టీ టికెట్ విషయంలోనూ ఇక్కడ వివాదాలు కొనసాగుతున్నాయి. మొత్తంగా చూస్తే.. అనంతపురమే కాదు.. కడపలోనూ కొన్ని నియోజకవర్గాల్లో పార్టీకి నేతల అవసరం ఉంది. వారిని ఎంపిక చేయాల్సి కూడా ఉంది. ఈ నేపథ్యంలో పర్యటన ఎలా ఉన్నా.. సమస్యలను పరిష్కరించాలని తమ్ముళ్లు కోరుతుండడం గమనార్హం.