Begin typing your search above and press return to search.

జగన్ మీద యాక్షన్ కోసం కేంద్రానికి చంద్రబాబు

ఏపీలో వైసీపీ నాలుగేళ్ల ఏలుబడిలో తీవ్రమైన పరిస్థితులు నెలకొన్నాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అంటున్నారు.

By:  Tupaki Desk   |   13 Aug 2023 2:31 PM GMT
జగన్ మీద యాక్షన్ కోసం కేంద్రానికి చంద్రబాబు
X

ఏపీలో వైసీపీ నాలుగేళ్ల ఏలుబడిలో తీవ్రమైన పరిస్థితులు నెలకొన్నాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అంటున్నారు. కేంద్రం జోక్యాన్ని ఆయన కోరుతున్నారు. ఈ మేరకు ఆయన దేశ రాష్ట్రపతికి, ప్రధానికి బహిరంగ లేఖ రాసారు. ఆ లేఖ సుదీర్ఘంగా తొమ్మిది పేజీల దాకా ఉంది.

ఏపీలో 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని పేర్కొన్నారు. ఏపీలో విపక్షాల మీద అక్రమ కేసులు పెడుతున్నారని కూడా బాబు ఆరోపించారు. తాజాగా చిత్తూరు పర్యటనలో తనపైన హత్యాయత్నమే చేశారని తీవ్రమైన ఆరోపణ బాబు చేశారు.

రాష్ట్రంలో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని చంద్రబాబు అంటున్నారు. ఈ లేఖ రాయడం వెనక బాబు ఉద్దేశ్యం కేంద్రం జోక్యం కోరడమే అని అంటున్నారు. అయితే దీని కంటే ముందు ఎన్నో సార్లు టీడీపీ ఎంపీలు నాయకులు కేంద్రానికి విన్నపాలు చేసుకున్నారు. లేఖలు స్వయంగా కలసి అందించారు. ఈ మద్యనే దేశానికి హోం మంత్రి అయిన అమిత్ షాతో బాబు భేటీ అయి వచ్చారు.

ప్రధాని నరేంద్ర మోడీ భేటీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే లేఖ రాయడం ద్వారా కేంద్రం ఏపీ మీద యాక్షన్ తీసుకుంటుందని బాబు భావిస్తున్నారా లేక వైసీపీ పాలన తీరుని జాతీయ స్థాయిలో ఎండగట్టడానికి దీన్ని ఉపయోగించుకుంటున్నారా అన్నది కూడా చర్చకు వస్తోంది. ఏది ఏమైనా కూడా చంద్రబాబు ఈ లేఖతోనే కాదు ఇప్పటికి చాలా సార్లు ఏపీ ప్రభుత్వం మీద చర్యలకు డిమాండ్ చేస్తూ వస్తున్నారు.

అయితే కేంద్రం ఎందుకు యాక్షన్ తీసుకుంటుంది అన్నది ఇక్కడ పాయింట్. ఇంతకంటే ఘోరంగా పశ్చిమ బెంగాల్ లో బీజేపీ విపక్ష పాత్రలో ఉంటూ మమతా బెనర్జీతో పోరాడుతోంది. ఇటీవలే బెంగాల్ బీజేపీ నేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా మాట్లాడారు. హింసా రాజకీయాల మీద ఆయన మండిపడ్డారు.

అంటే బీజేపీ విపక్షంలో ఉన్న చోట మమతా బెనర్జీ ప్రతిపక్షాలను ఉక్కు పాదంతో అణచివేసే చోటనే అక్కడి ప్రభుత్వాల మీద కఠిన చర్యలకు దిగేందుకు అవకాశం అయితే లేదు. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం పరిస్థితులు దిగజరడం అంటే రాజకీయ పార్టీలు ఇబ్బంది పడడం కాదు, సాధారణ ప్రజలు ఇబ్బంది పడడం, వారు తిరిగేందుకు కూడా ఆస్కారం లేకపోవడం, అంతటి దుర్బర పరిస్థితులు ఉంటేనే తప్ప రాష్ట్రపతి పాలన అన్నది ప్రయోగించారు.

ఒకవేళ బలవంతంగా ప్రయోగించినా కోర్టు తీర్పులు ఉన్నాయి. వాటికి న్యాయపరంగా సవాళ్ళు ఎదురు కావచ్చు. అయితే ఏపీలో మాత్రం టీడీపీ బీజేపీ మద్దతు కోసం తాపత్రయం పడడం వెనక కారణం కేంద్రం దన్ను కోసమే అని అంటున్నారు. ఏపీలో ఎన్నికలు 2024లో మామూలుగా జరగవన్న భయాలు అయితే విపక్షాలలో ఉన్నాయి. జగన్ అధికారంలో ఉంటూ జరిగే ఎన్నికలు ఇవి.

ఇక టీడీపీకి ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా ఉండబోతున్నాయి. అదే టైం లో డూ ఆర్ డై అంటూ వైసీపీ కూడా తుదికంటా పోరాడుతుంది. అది కచ్చితం. 2014లో చంద్రబాబు గెలిచారు అంటే అపుడు ఉమ్మడి ఏపీ చివరి సీఎం గా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి లాస్ట్ మినిట్ లో రాజీనామా చేయడంతో రాష్ట్రపతి పాలనతో ఎన్నికలు జరిగాయి. పైగా బీజేపీ మద్దతు, పవన్ ఇమేజ్ కూడా తోడు అయ్యాయి.

ఇపుడు అలా కాదు జగన్ వంటి బలమైన నేత అధికారంలో ఉన్నారు. జగన్ డేరింగ్ గా ఎంత దూరం అయినా వెళ్తారని పేరు. చేతిలో అధికారం ఉంది. ఇక కేంద్రం సాయం కూడా తోడు అయితే కచ్చితంగా ఆయనను తట్టుకోవడం కష్టం. అందుకే ఇప్పటి నుంచే ఏపీలో పరిస్థితులు దారుణంగా మారాయని కేంద్ర పెద్దలకు వివరించడం ద్వారా ఏపీలో వైసీపీ ఉంటే సజావుగా ఎన్నికలు జరగవు అని టీడీపీ తన అభిప్రాయాన్ని డిమాండ్ ని తరువాత దశలో వినిపిస్తుంది అని అంటున్నారు.

అయితే టీడీపీ ఎన్ని డిమాండ్లు పెట్టినా లేక ఎన్ని విన్నపాలు చేసుకున్నా కేంద్రంలో బీజేపీ పెద్దలకు వైసీపీతో అవసరాలు ఉంటే మాత్రం లైట్ గా తీసుకుంటారు ఒక వేళ వారి వ్యూహాలు మారితే మాత్రం టీడీపీ కోరుకున్నట్లుగా జరుగుతుంది. కానీ ఏది కూడా అడ్డగోలుగా జరిగే సీన్ అయితే లేదు. బట్ బాబు లేఖలు రాయడం ద్వారా వైసీపీ గురించి ఏపీకి బయట ప్రపంచానికి తెలియచేయడానికి మాత్రం ఇదంతా ఉపయోగపడుతుంది అని అంటున్నారు.