Begin typing your search above and press return to search.

భయపడను అంటూ పదే పదే... ఏంటిది బాబూ..?

నేను భయపడను, ఎవరికీ భయపడేది లేదు ఇదీ మాటకు వస్తే టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పే డైలాగ్.

By:  Tupaki Desk   |   7 Sep 2023 6:19 AM GMT
భయపడను అంటూ పదే పదే... ఏంటిది  బాబూ..?
X

నేను భయపడను, ఎవరికీ భయపడేది లేదు ఇదీ మాటకు వస్తే టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పే డైలాగ్. నన్ను ఎవరూ ఏమీ చేయలేరు అన్నది మరో డైలాగ్. నేను నిప్పుని అన్నది ఇంకో మాట. నేను బాంబులకే

భయపడలేదు, వైసీపీ నేతలకు భయపడతానా అంటూ చంద్రబాబు గారు దీర్ఘాలు తీస్తున్నారు.

అయినా సరే ఎవరు బాబును భయపెడతారు, అసలు ఎందుకు ఆయన భయపడాలి ఇది కదా స్ట్రైట్ గా వచ్చే క్వశ్చన్. ఏడున్నర పదుల వయసు, నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితం, ముమ్మారు సీఎం గా చేసిన నాయకుడిని ఎవరు ఎందుకు భయపెడతారు. ఇది కదా ఎవరికైనా అర్ధం అయ్యే విషయం.

ఆ మధ్యదాకా పవన్ కళ్యాణ్ ఇదే మాట అంటూండేవారు. నాకు భయం తెలియదు. చావుకు సిద్ధపడే వచ్చాను అని. సరే పవన్ అయితే బాబు కంటే జూనియర్ పొలిటీషియన్. పైగా సినీ నటుడు కం పొలిటీషియన్. ఆయన పాలిటిక్స్ తీరుని అర్ధం చేసుకోవచ్చు.

రాజకీయాలను ఆ వైపు నుంచి ఈ వైపు దాకా చూసేసిన చంద్రబాబు నుంచి ఇలాంటి మాటలు వినడానికి ఎవరు ఆసక్తిగా ఉంటారు అన్నదే ఆలోచించాల్సిన విషయం. భయపడను అని ఎవరైనా తరచూ అంటున్నారు అంటే కచ్చితంగా భయపడుతున్నట్లే అని సైకాలజీ ఫిలాసఫీ చెబుతుంది. ఎవరైతే పదే పదే అదే విషయం తలచుకుంటున్నారు అంటే వారి మనసు దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తుంది అని అర్ధం అంటారు.

చంద్రబాబు మీద దాడి చేయడానికి ఎవరికి ఆసక్తి ఉంటుంది. ఎవరు ఆయనను భయపెట్టాలని అనుకుంటారు. లాజిక్ గా ఆలోచిస్తే అసలు ఏమీ కాదు కదా అనిపించడం సహజం. బాబు వంటి సీనియర్ నేతను ప్రజాస్వామ్యయుతంగానే ఎదుర్కొంటారు. బాబు సైతం అలాగే పోరాడాల్సి ఉంటుంది. ఎక్కడైనా అదే జరుగుతుంది కూడా.

అంతకు మించి వీధి పోరాటాలు దాడులు ఒకరిని ఒకరు భయపెట్టుకోవడాలు చేసుకోవడానికి ఇది కుస్తీ యుద్ధం కాదు కదా అన్నది చాలా మంది మాట. ఇక చంద్రబాబు గురించి ఆలోచిస్తే ఆయన 1978 నుంచి రాజకీయాలలో ఉన్నారు. ఆయన 2024 ఎన్నికలలో పదవసారి పోటీ చేస్తున్నారు. టీడీపీ సీనియర్ నేతగా 1995 నుంచి టీడీపీ ప్రెసిడెంట్ గా ఆయన ఎన్నో ఎన్నికలను చూసారు. పార్టీని నడిపించారు.

జయాలు అపజయాలు అన్నీ ఆయన కళ్ళ ముందే తిరిగాయి. అలాంటి బాబు దేనికీ భయపడను అంటున్నారు. అవును భయపడకూడదు, రాజకీయాల్లో ఉన్న వారికి భయమేంటి, ఓటమి అన్నది కూడా వారు డేరింగ్ గా తీసుకోవాలి. బాబుకు ఈ పాటికే అలాంటి అనుభవం వచ్చి ఉంటుంది. కానీ ఆయన మాత్రం బేలగా ఒక్కోసారి మాట్లాడుతుంటారు.

తాను భయపడను అని చెప్పడం ద్వారా భయాన్ని ఆయనే గుర్తు చేసుకుంటున్నారు అని వైసీపీ నేతలు అంటున్నారు. ఈ భయం అన్న మాట తమ నేత జగన్ ఎపుడైనా ఎక్కడైనా చెప్పారా అని నిలదీస్తున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు భయపడను అంటే దానికి మరో అర్ధం జనాలకు వెంటనే చేరిపోతుంది. అందువల్ల భయం మాటను వీలైనంతవరకూ పక్కన పెట్టేసి బాబు రాజకీయాలు చేయాలని అంతా కోరుతున్నారు.