Begin typing your search above and press return to search.

బాబు హిస్టరీలో ఫస్ట్ టైం...ఏపీ లో ఆయనే రికార్డు

టీడీపీ అధినేత చంద్రబాబు పొలిటికల్ హిస్టరీలో ఫస్ట్ టైం జైలుకు వెళ్తున్నారు.

By:  Tupaki Desk   |   10 Sep 2023 4:58 PM GMT
బాబు హిస్టరీలో ఫస్ట్ టైం...ఏపీ లో ఆయనే రికార్డు
X

టీడీపీ అధినేత చంద్రబాబు పొలిటికల్ హిస్టరీలో ఫస్ట్ టైం జైలుకు వెళ్తున్నారు. ఇన్నాళ్ళూ కోర్టు మెట్లు కూడా ఎక్కని చంద్రబాబు తొలిసారిగా ఏసీబీ కోర్టు బోనులో నిలబడ్డారు. ఆయన కోసం ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన బడా న్యాయవాదులు కూడా ఎంత వాదించినా బెయిల్ అయితే రాలేదు. దాంతో జైలుకు బాబు వెళ్లనున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు బాబును తరలించమని చెబుతూ ఏసీబీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

దాంతో చంద్రబాబు నాలుగున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రలో మొదటి సారి జైలుకు వెళ్తున్నారు. అంతే కాదు ఏపీ సంబంధించి చూస్తే ఒక మాజీ ముఖ్యమంత్రి అవినీతి ఆరోపణల మీద జైలుకు వెళ్లడం కూడా ఇదే తొలిసారి అని అంటున్నారు. ఆ విధంగా బాబు సరికొత్త రికార్డుని క్రియేట్ చేయనున్నారు అని అంటున్నారు.

ఇక చంద్రబాబుకు బెయిల్ ని తెప్పించలేకపోయిన ఆయన తరఫున లాయర్లు రేపటి ఉదయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో బాబు వీఐపీ కాబట్టి ఆయన వయసు దృష్ట్యా ఆయన హెల్త్ ఇష్యూస్ దృష్ట్యా రాజమండ్రి సెంట్రల్ జైలులో మంచి సదుపాయాలు ఉండే జైలు గది కోసం ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే బాబు రిమాండ్ ని హౌస్ అరెస్ట్ గా పరిగణించాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ రెండు పిటిషన్లను కోర్టు తిరస్కరించింది అని అంటున్నారు.

మరో వైపు చూస్తే చంద్రబాబుకు పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ రిమాండ్ ని ఏసీబీ కోర్టు విధించింది. దాన్ని సవాల్ చేస్తూ సోమవారం హై కోర్టులో లంచ్ మోషన్ ని మూవ్ చేయడానికి టీడీపీ లీగల్ సెల్ రెడీ అవుతోంది. అయితే న్యాయ నిపుణులు కొందరు మాత్రం ఈ కేసులో బలంగా సీఐడీ చార్జిషీట్ వేసిందని, అలాగే రిమాండ్ రిపోర్ట్ లో కూడా కేలకమైన అంశాల ప్రస్తావన ఉందని అందువల్ల బెయిల్ వచ్చే అవకాశాలు ఎంత మేరకు ఉండవచ్చు అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ కేసుకు సంబంధించి బెయిల్ ఇవ్వడానికి ఇది ప్రధానంగా అవినీతి కేసుగా వారు పేర్కొంటున్నారు. ఇలనటి కేసులలో వెంటనే బెయిల్ వస్తుందా రాదా అన్న దాని మీద కూడా న్యాయ నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే బాబుకు రిమాండ్ విధించినా హై కోర్టు లో బెయిల్ దొరుకుతుంది అన్న ఆశతో అయితే టీడీపీ ఉంది.

మొత్తం మీద చంద్రబాబుకు అరెస్ట్ అన్న న్యూస్ తోనే గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాలు హీటెక్కిపోతూంటే ఇపుడు ఆయన ఏకంగా జైలుకు వెళ్ళడం మీద మరింత కాక పెరిపోతోంది. అటు సోషల్ మీడియాలో సైతం బాబు జైలు అన్న వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని సంచలనాలకు ఇది నాంది అవుతుందా అన్న చర్చ కూడా మొదలైంది.