బాబుకు బిగ్ డే : ఇటు బెయిల్ పిటిషన్ ... అటు క్వాష్ పిటిషన్ !
చంద్రబాబు కి ఈ నెల 25వ తేదీమండే బిగ్ డే గా మారనుందా అంటే అవును అనుకోవాల్సి వస్తోంది.
By: Tupaki Desk | 24 Sep 2023 4:00 PM GMTచంద్రబాబు కి ఈ నెల 25వ తేదీమండే బిగ్ డే గా మారనుందా అంటే అవును అనుకోవాల్సి వస్తోంది. ఆయన తన మీద సీఐడీ దాఖలు చేసిన ఎఫ్ ఐ ఆర్ ని కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ ని సుప్రీం కోర్టులో దాఖలు చేశారు. అదే టైం లో ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు.
ఈ రెండూ చిత్రంగా సోమవారం ఒకే రోజు విచారణకు రానున్నాయి. దాంతో అటు టీడీపీ శ్రేణులతో పాటు ఇటు రాజకీయ వర్గాలలో ఉత్కంఠ నెలకొంది. ఏమి జరగనుంది అన్నదే అందరిలో చర్చగా ఉంది.
చంద్రబాబు ఇప్పటికే పదిహేను రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన జైలు జీవితం ఇంత సుదీర్ఘంగా ఉంటుందని ఎవరూ అనుకోలేదు. అదే టైం లో బాబు ఈ కేసు విషయంలో తానుగా జఠిలం చేసుకున్నారా అన్న చర్చ కూడా ఉంది. కేసు నమోదు అయి రిమాండ్ కి వెళ్ళిన నాడే బెయిల్ కి అప్లై చేసి ఉంటే ఈపాటికి వచ్చేదని అంటున్నారు.
అయితే చంద్రబాబు తరఫున న్యాయవాదులు క్వాష్ పిటిషన్ కి వెళ్లడంతోనే ఇన్ని రోజులు బాబు జైలులో ఉండాల్సి వచ్చింది అని అంటున్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబు విషయంలో రెండు రోజుల పాటు సీఐడీ విచారణ చేసిన మీదట ఏసీబీ న్యాయమూర్తి ఎదుట వర్చువల్ గా ఆదివారం సాయంత్రం హాజరు పరచారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి బాబుని అనేక ప్రశ్నలు వేసినట్లుగా తెలుస్తోంది. విచారణ సమయంలో వైద్య పరీక్షలు నిర్వహించారా లెక ఏమైనా ఇబ్బంది పెట్టారా అని న్యాయమూర్తి చంద్రబాబుని ప్రశ్నించారు. దానికి బదులుగా చంద్రబబు వైద్య పరీక్షలు అన్నీ సక్రమంగా నిర్వహించారని తనను ఏవిధంగా ఇబ్బంది పెట్టలేదని తెలిపారు అంటున్నారు.
ఇక ఈ సందర్భంగా చంద్రబాబు విచారణ సందర్భంగా తాను ఏమి తప్పు చేశాను అన్నది సీఐడీ అధికారులు ఏం గుర్తించారో బయట పెట్టాలని న్యాయమూర్తికి విజ్ఞప్తి చెసుకున్నారు. దానికి న్యాయమూర్తి స్పందిస్తూ ఆయా వివరాలకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ను మీ న్యాయవాది నుంచి తీసుకోవాలని సూచించినట్లుగా తెలిసింది. అదేవిధంగా చంద్రబాబును ఉద్దేశించి న్యాయమూర్తి మాట్లాడుతూ సోమవారం బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుపుతామని తెలిపారు.
మరి చంద్రబాబు బెయిల్ పిటిషన్ మీద విచారణ జరుగుతున్న వేళ బెయిల్ వద్దని సీఐడీ ఎటూ కోరుతోంది. అలాగే అటూ ఇటూ వాదనలు విన్న తరువాత న్యాయస్థానం ఏ రకంగా నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది అంటున్నారు. అలాగే క్వాష్ పిటిషన్ మీద సుప్రీం కోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.