Begin typing your search above and press return to search.

ఆ ఇద్దరూ సూపరబ్బా..బాబు చాయిస్ అదుర్స్

మోడీ మూడోసారి ప్రధాని అవుతున్న వేళ ఆయన మంత్రివర్గంలో చేరేందుకు ఏపీ నుంచి తెలుగుదేశం పార్టీ ఎంపిక చేసిన ఇద్దరు ఎంపీల గురించి ఇపుడు చర్చ సాగుతోంది.

By:  Tupaki Desk   |   9 Jun 2024 3:58 PM GMT
ఆ ఇద్దరూ సూపరబ్బా..బాబు చాయిస్ అదుర్స్
X

మోడీ మూడోసారి ప్రధాని అవుతున్న వేళ ఆయన మంత్రివర్గంలో చేరేందుకు ఏపీ నుంచి తెలుగుదేశం పార్టీ ఎంపిక చేసిన ఇద్దరు ఎంపీల గురించి ఇపుడు చర్చ సాగుతోంది. టీడీపీ అధినేత ఎంతగానో ఆలోచించి ఇద్దరు ఎంపీలను సెలెక్ట్ చేశారు అని అంటున్నారు.

అందులో మొదట తీసుకుంటే కింజరాపు రామ్మోహన్ నాయుడు అతి చిన్న వయసులోనే కేంద్ర మంత్రి అయ్యారు. ఆయన తండ్రి ఎర్రన్నాయుడు కేంద్ర మంత్రిగా 1996లో తొలిసారి అయ్యారు. అప్పటికి ఆయన వయసు 49 ఏళ్ళు. కానీ ఆయన కంటే 13 ఏళ్ళ ముందే రామ్మోహన్ కేంద్ర మంత్రి అవుతున్నారు.

ఇక రామ్మోహన్ బయోడేటా తీసుకుంటే అదిరిపోయేలా ఉంది. ఆయన ఇంజనీరింగ్ పట్టభద్రుడు, అలాగే ఎంబీఏ చేశారు. ఢిల్లీలో చదువుకోవడం వల్ల హిందీ అద్భుతంగా మాట్లాడగలరు. అలాగే ఉన్నత విద్యావంతుడు కావడంతో ఆంగ్లంలో మంచి పట్టు ఉంది. ఇక తెలుగులో అయితే తండ్రి ఎర్రన్నాయుడు మాదిరిగా అనర్గళంగా మాట్లాడుతారు.

ఆయన 2014 నుంచి ఇప్పటికి మూడు సార్లు ఎంపీగా గెలిచారు. ఆయనకు ప్రజా సమస్యల మీద పూర్తి అవగాహన ఉంది. పార్లమెంట్ లో గట్టిగా మాట్లాడే సత్తా ఉంది. దాంతో రామ్మోహన్ తగిన చాయిస్ అని అంటున్నారు. ఏపీకి ఈ క్లిష్ట పరిస్థితులలో న్యాయం చేయాలీ అంటే రామ్మోహన్ నాయుడు వంటి వారు కేంద్ర మంత్రివర్గంలో ఉండాల్సిందే అని అంటున్నారు.

అలా రామ్మోహన్ ని ఎంపిక చేసిన బాబు ఆయనకు మంచి శాఖ దక్కుతుందనే భావిస్తున్నారు. అలాగే పెమ్మసారి చంద్రశేఖర్ గుంటూరు నుంచి పార్లమెంట్ కి తొలిసారి పోటీ చేసి ఏకంగా 3.44 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు

ఆయన ఉన్నత విద్యావంతుడు 1993-94లో 60 వేల మంది ఎంసెట్ రాస్తే పెమ్మసాని 27వ ర్యాంక్ సాధించడం అంటేనే ఆయన టాలెంట్ ఏంటో తెలుస్తుంది. ఇక ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన పెమ్మసాని పెన్సిల్వేనియోలోని జీసింజర్ మెడికల్ కాలేజీ నుంచి పీజీ, ఇంటర్నల్ మెడిసిన్ పట్టాలు అందుకున్నారు. పీజీలో అత్యధిక మార్కులతో కాలేజి టాపర్ గా నిలిచారు.

ఆ మీదట ఆయన అమెరికాలో వైద్య సేవలు అందించేందుకు లైసెన్సింగ్ పరీక్షలోనూ ఉత్తీర్ణుడయ్యారు. అమెరికాలో ఉంటూ గడచిన పాతికేళ్ళుగా ఆయన వైద్య రంగంలో విశేష సేవలు చేస్తున్నారు. అంతే కాదు తాను పుట్టిన గడ్డకు న్యాయం చేయాలని ఆయన పల్నాడు ప్రాంతంలో 100 బోర్లు తవ్వించారు. అనేక సేవా కార్యక్రమాలు కూడా చేపట్టారు.

చంద్రబాబు పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చారు. తొలి ప్రయత్నంలోనే ఆయన ఎంపీ అయ్యారు. ఆయనకు వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రిగా అవకాశం వస్తుందని భావిస్తున్నారు. మొత్తానికి బాబు ప్రతిపాదించిన ఈ ఇద్దరు ఎంపీల పేర్లు చూసిన వారు అంతా ఏకగ్రీవంగా ఆమోదించారు అంటే బాబు దూర దృష్టి ఆయన చాతుర్యం మరోమారు అదుర్స్ అనిపించేలా ఉన్నాయని అంటున్నారు.