అక్కడ లోకేష్ పాదయాత్ర ముగిసింది.. ఫలితం ఏంటి..?
టీడీపీ యువ నాయకుడు మాజీ మంత్రి నారా లోకేష్ యువగళం
By: Tupaki Desk | 31 July 2023 5:38 AM GMTటీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ యువగళం పేరుతో నిర్వహిస్తున్న పాదయాత్ర ఇప్ప టికి రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు జిల్లాల్లో ముగిసింది. మరి యువగళం పాదయాత్ర ద్వారా.. భారీ మార్పు తీసుకురావడంతోపాటు.. ఓటు బ్యాంకును కూడా పెంచుకోవాలని టీడీపీ భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు పాదయాత్ర ముగిసిన జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉందనే విషయంపై పార్టీ దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే ఐటీడీపీ చీఫ్ రాబిన్ శర్మనే రంగంలోకి దింపినట్టు సమాచారం.
ఇప్పుడు ఐటీడీపీ బృందాలు జిల్లాల్లో సర్వే నిర్వహిస్తోంది. లోకేష్ పాదయాత్రకు ముందు, పాదయాత్ర తరువాత పార్టీ గ్రాఫ్.. నేతల మధ్య సఖ్యత, పార్టీ పుంజుకున్న తీరు.. ఇలా అన్నింటినీ క్రోడీకరిస్తున్నట్టు సమాచారం. ప్రధానంగా లోకేష్ ప్రసంగాల తీరు.. ప్రజలకు చేరుతున్న విధానం.. వారిని ఆలోచింప జేస్తున్నతీరు.. ఇలా అనే విషయాలను ఐటీడీపీ బృందం ప్రత్యేకంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సర్వేలో వచ్చే రిజల్ట్ ఆధారంగా మార్పులు చేర్పులు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు.
ప్రధానంగా నాయకుల పరిస్థితి ఎలా ఉన్నా.. క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని ప్రధానమని పార్టీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలను ముఖ్యంగా గ్రామీణులను పార్టీవైపు మళ్లించే ప్రయ త్నాలు చేస్తున్నారు. మినీ మేనిఫెస్టోను ప్రకటించినా.. ఇతరత్రా అనేక కార్యక్రమాలు చేసినా.. అంతిమంగా ప్రజలను పార్టీవైపు మళ్లించడం.. ఓటు బ్యాంకును అనుకూలంగా మార్చుకోవడమే కీలకంగా ఉంది. ఈ నేపథ్యంలో యువగళం పాదయాత్రకు ప్రాధాన్యం ఏర్పడింది.
దేనికైనా కొలమానాలు ఉండాలన్నట్టుగా.. యువగళం పాదయాత్రకు కూడా లెక్కలు వేస్తున్నారు. సీమలో ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకుని.. ఇతర ప్రాంతాలకు వచ్చే సరికి కొన్ని మార్పులు చేసుకున్నారు. ఇప్పుడుఇక్కడ వస్తున్న డిమాండ్లు.. ప్రజల నాడిని పట్టుకుని.. మరింత వ్యూహాత్మకంగా యువగళానికి పదును పెట్టుకునేందుకు. పార్టీ ప్రయత్నిస్తోందని అంటున్నారుపరిశీలకులు. అందుకే.. ఎంత వ్యయప్రయాసలకు ఓర్చుకుని అయినా.. ఈ సర్వేను సాగిస్తున్నట్టు చెబుతున్నారు. ఇప్పటి వరకు పాజిటివ్ టాక్ ఉందని.. యువగళం ద్వారా పార్టీ పుంజుకుందని తెలుస్తోంది.