నాడు-నేడు.. నారా లోకేష్ మారెను చూడు..!
మార్పు మంచిదే. ఇది ఇప్పుడు టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్‌ను గమనిస్తే స్పష్టంగా కనిపిస్తుంది
By: Tupaki Desk | 9 Aug 2024 7:30 AM GMTమార్పు మంచిదే. ఇది ఇప్పుడు టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్‌ను గమనిస్తే స్పష్టంగా కనిపిస్తుంది. గతానికి భిన్నంగా ఆయన వ్యవహరిస్తున్న తీరు రాజకీయంగా చర్చకు వస్తోంది. ఇదేసమ యంలో పార్టీలోనూ ఆయన గ్రాఫ్ పెరుగుతోంది. ఒకప్పుడు ఆయనను విమర్శించిన, దూరంగా ఉంచిన పార్టీ సీనియర్లు కూడా.. ఇప్పుడు నారా లోకేష్‌లో వచ్చిన మార్పును చూసి అచ్చరువొందుతున్నారు. అంతేకాదు.. ఇంతలోనే ఎంత మార్పు! అని కామెంట్లు కూడా చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో నారా లోకేష్ గతానికి.. ఇప్పటికి తేడా ఏంటనేది ఆసక్తిగా మారింది.
నాడు:
2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు చేసిన వస్తున్న మామీకోసం యాత్రతో రాజకీయాల్లోకి ప్రవేశించారు నారా లోకేష్. అప్పట్లో ఐటీ విభాగాన్ని, సీబీఎన్ ఆర్మీని ఆయనే ముందుండి నడిపించారు. అయితే.. ఇవన్నీ తెరవెనుకే జరిగాయి. ఆ తర్వాత.. 2017 నాటికిఆయనను మంత్రివర్గంలోకి తీసుకున్నారు చంద్ర బాబు. అప్పట్లో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు పోటీగా ఇక్కడ బాబు నారా లోకేష్‌ను తీసుకువచ్చారనే ప్రచారం జరిగింది. వచ్చీరావడంతోనే ఆయనకు ఐటీ శాఖను అప్పగించారు.
అయితే.. అప్పట్లో సరైనవిధంగా ప్రసంగాలు చేయలేకపోవడంతో వైసీపీ నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు. రోజా, కొడాలి నాని, వంశీ వంటి వారితో తీవ్రమైన ట్రోల్స్ కూడా ఎదుర్కొన్నారు. దాదాపు గత ఏడాది జనవరిలో యువగళం పాదయాత్ర ప్రారంభించే వరకు కూడా నారా లోకేష్ ఇలాంటి అవమా నాలు ఎన్నో అనుభవించారు. అయితే.. పాదయాత్ర ప్రారంభించిన తర్వాత.. రాను రాను ఆయనలో నాయకత్వ లక్షణాలు బల పడ్డాయి. ఎక్కడ ఎలా స్పందించాలో.. ఎవరితో ఎలా మాట్లాడాలో ఆయన చాకచక్యంగా తెలుసుకున్నారు.
నేడు:
ఇప్పుడు రెండోసారి మంత్రి అయ్యాక.. నారా లోకేష్‌లో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. ప్రతి విషయా న్నీ కూలంకషంగా ఆలోచించడం.. ప్రతి వ్యక్తినీ ఆదరణగా చూసుకోవడం.. ఎవరు వచ్చినా.. నవ్వుతూ పలకరించడం వంటివి స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో మాదిరిగా ఎక్కడా తర్జన భర్జనలు లేవు. విషయం ఏదైనా సూటిగా, సుత్తి లేకుండా చెబుతున్నారు. ప్రజాదర్బార్‌లోనూ సమస్యలను పరిష్కరిం చేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏ నాయకుడు వచ్చినా.. విసుగులేకుండా వ్యవహరిస్తున్నారు. ఎంత బిజీగా ఉన్నా నియోజకవర్గంలో పర్యటించడం, ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ పరిణామాలను గమనిస్తే.. నాడు-నేడు నారా లోకేష్‌లో వచ్చినమార్పును స్పష్టం చేస్తున్నాయి.