లోకేష్ కి భారీ షాక్...ఆ మీటింగ్ లో సంచలన నిర్ణయం....!?
మరి లోకేష్ ధీమా ఇలా ఉంటే వైసీపీ పై ఎత్తులు వేస్తోంది. ఆళ్ళను వదులుకుని మరీ బీసీ సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవికి టికెట్ ఇచ్చి సోషల్ ఇంజనీరింగ్ చేసింది.
By: Tupaki Desk | 30 Jan 2024 1:26 PM GMTఏపీలో హాట్ ఫేవరేట్ సీట్లుగా ఈసారి ఎన్నికల్లో కొన్ని కనీంచబోతున్నాయి. అందులో గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఒకటి అని చెప్పాలి. మంగళగిరి నుంచి టీడీపీ భావి వారసుడు, చంద్రబాబు ఏకైక కుమారుడు నారా లోకేష్ పోటీ చేయడంతోనే అంతటి ప్రాముఖ్యత ఏర్పడింది అని చెప్పాలి. అంతే కాదు 2019లో మంత్రిగా ఉంటూ ఆ సీట్లో ఓడిన లోకేష్ ఈసారి కచ్చితంగా గెలిచి తీరుతాను అని అంటున్నారు.
పోయిన చోటనే వెతుక్కుంటాను అని పట్టుదలతో లోకేష్ ఉన్నారు. దాంతో ఆయన మంగళగిరి మీద పూర్తిగా ఫోకస్ పెట్టి గత అయిదేళ్ళుగా పనిచేస్తున్నారు. ఈసారి టీడీపీ గెలుపు ఖాయం అని ఆయన లెక్క వేసుకుంటున్నారు. దానికి ఆయన రీజన్స్ కూడా లాజిక్ కి దగ్గరగానే ఉన్నాయి. అమరావతి రాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయకపోవడం మూడు రాజధానులు అంటూ అయిదేళ్ల పాటు నానబెట్టడం తో అమరావతి రైతులతో పాటు ఆ ప్రాంతానికి సమీపంలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో వ్యతిరేకత అయితే ఉంది అని అంటున్నారు.
ఇక ప్రభుత్వ యాంటీ ఇంకెంబెన్సీ ఉందని అంటున్నారు. లోకేష్ అయిదేళ్లలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు అని అంటున్నారు. దాంతో పాటు వైసీపీ నుంచి బలమైన నేత సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ రామక్రిష్ణారెడ్డి పార్టీని వీడి వెళ్ళిపోవడం వల్ల కూడా మంగళగిరి మీద తీవ్ర ప్రభావం పడుతుంది అని అంటున్నారు. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు తాను కచ్చితంగా మంచి మెజారిటీతో గెలిచి తీరుతాను అని ధీమాగా లోకేష్ ఉన్నారు. ఆయన ఇటీవల మంగళగిరికి వచ్చినపుడు కూడా గెలుపు సమస్య కాదు మెజారిటీ మాత్రమే అని అంటున్నారు.
మరి లోకేష్ ధీమా ఇలా ఉంటే వైసీపీ పై ఎత్తులు వేస్తోంది. ఆళ్ళను వదులుకుని మరీ బీసీ సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవికి టికెట్ ఇచ్చి సోషల్ ఇంజనీరింగ్ చేసింది. ఇక గంజి చిరంజీవి విషయానికి వస్తే ఆయనది పదిహేనేళ్ల సుదీర్ఘ పోరాటం. చట్ట సభలలో అడుగు పెట్టాలన్నది ఆయన కోరిక. అది ఆయనకు 2014లో కేవలం 12 ఓట్ల తేడాతో దూరం అయింది. 2019లో ఆయన లోకేష్ కోసం సీటు త్యాగం చేశారు.
అయితే 2024లో టీడీపీ టికెట్ ఇవ్వలేదు. దాంతో ఆయన వైసీపీలో చేరి నామినేటెడ్ పదవిని అందుకుని మరీ ఒక హోదా గౌరవం పొందారు. ఇపుడు టికెట్ కూడా ఆ పార్టీ ఇచ్చింది. దాంతో తాను ఈసారి గెలిచి తీరుతాను అని ఆయన అంటున్నారు. ఎక్కడ నుంచో వచ్చిన లోకేష్ కే గెలవాలని తాపత్రయం ఆరాటం ఉంటే పక్కా లోకల్ అయిన తనకు ఉండదా అని చిరంజీవి అంటున్నారు. ఆరు నూరు అయినా ఈసారి గెలుస్తాను అని ఆయన శపధం చేస్తున్నారు.
ఇపుడు లేటెస్ట్ గా చూస్తే చిరంజీవికి అనుకూలంగా కీలక పరిణామాలు సంభవించాయి. అదేంటి అంటే మంగళగిరిలో పద్మశాలీ సంఘాల పెద్దల కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ తరఫున పోటీ చేస్తున్న గంజి చిరంజీవికి ఈసారికి గెలిపించుకుందామని పద్మశాలి సంఘం పెద్దల నాయకత్వంలో నిర్ణయం తీసుకున్నారు. మంగళగిరిలో యభై నుంచి అరవై వేల దాకా పద్మశాలీ ఓటర్లు ఉంటారు. మొత్తం ఓట్లు రెండు లక్షలు అయితే వీరే మూడవ వంతు అన్న మాట.
వారు ప్రతీ ఎన్నికల్లో గంపగుత్తగా తమ సామాజిక వర్గం వారికే ఓట్లు వేస్తారు. ఈసారి గంజి చిరంజీవికే ఓటు వేయడానికి వారు డిసైడ్ అయ్యారు. దాంతో ఇపుడు ఇది టీడీపీకి నారా లోకేష్ కి కూడా షాకింగ్ పరిణామం అని అంటున్నారు. బీసీ కార్డుతో జగన్ లోకేష్ మీద గట్టిగానే పధక రచన చేశారు అని అంటున్నారు. మరి దీనికి టీడీపీ ఏ రకమైన పై ఎత్తు వేస్తుందో చూడాల్సి ఉంది.