Begin typing your search above and press return to search.

మంత్రిగా లోకేష్ ఆన్ డ్యూటీ... కీలక ఫైల్ పై తొలి సంతకం!

అవును... ఏపీలో మరో యువమంత్రి బాధ్యతలు స్వీకరించారు. ఇందులో భాగంగా నారా లోకేష్... మంత్రిగా తొలి సంతకం చేశారు.

By:  Tupaki Desk   |   24 Jun 2024 6:56 AM GMT
మంత్రిగా లోకేష్  ఆన్  డ్యూటీ...  కీలక ఫైల్  పై తొలి సంతకం!
X

ఏపీలో నూతన ప్రభుత్వం కొలువుదీరిన వేళ మంత్రిగా ప్రమాణం చేసిన నారా లోకేష్... తాజాగా బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు సచివాలయంలోని నాలుగో బ్లాక్ లో గల తన చాంబర్ లో విద్య, ఐటీ, ఆర్టీజీ శాఖల మంత్రిగా లోకేష్ బాధ్యతలు చేపట్టారు. అంతకముందు సచివాలయానికి వచ్చిన ఆయనకు... పండితుల వేదమంత్రోచ్ఛరణలతో స్వాగతం పలికారు.

అవును... ఏపీలో మరో యువమంత్రి బాధ్యతలు స్వీకరించారు. ఇందులో భాగంగా నారా లోకేష్... మంత్రిగా తొలిసంతకం చేశారు. ఈ మేరకు ఆయన 16,347 పోస్టులతో ఉన్న మెగా డీఎస్పీ సంబంధిత ఫైలుపై తొలి సంతకం చేశారు. ఈ సమయంలో లోకేష్ కు సహచర మంత్రులు వంగలపూడి అనిత, టీజీ భరత్, గుమ్మిడి సంధ్యారాణి, సవిత అభినందనలు తెలిపారు.

ఇదే సమయలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు ఎమ్మెల్యే బోండా ఉమా, ఎమ్మెల్సీలు భూమిరెడ్డి గోపాల్ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్, పలువురు నేతలు, అధికారులు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. గతంలో ఐటీశాఖ మంత్రిగా సమర్థవంతంగా పనిచేసిన లోకేష్.. ఈసారి విద్యాశాఖ బాధ్యతలు కూడా చేపట్టారు!

మెగా డీఎస్సీకి కేబినెట్ ఆమోదం!:

విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ తొలి సంతకం చేసిన 16,347 పోస్టులకు సంబంధించిన మెగా డీఎస్సీపై ఈ రోజు కేబినెట్ లో చర్చించారు. అనంతరం ఈ మెగా డీఎస్సీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా డిశెంబర్ 10లోగా 16,347 పోస్టులనూ భర్తీ చేయాలని కేబినేట్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రక్రియ జూలై 1 నుంచి ప్రారంభం కానుంది.

వెలగపూడిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ తో పాటు అని శాఖల మంత్రులూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు సీఎంగా చేసిన తొలి ఐదు సంతకాలకు సంబంధించిన అంశాలపై కేబినెట్ చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇదే సమయంలో సూపర్ 6 అమలుపైనా ఒక క్లారిటీకి రావొచ్చని అంటున్నారు.

కాగా... చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ రూ.4 వేలకు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణనపై తొలి ఐదు సంతకాలు చేసిన సంగతి తెల్లిసిందే.