Begin typing your search above and press return to search.

టీడీపీలో చేరికలకు బ్రేకు వేస్తున్నదెవరో తెలిస్తే షాకే ?

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. కూటమి కట్టి పోటీ చేసినా సొంతంగా 135 సీట్లు దక్కాయి.

By:  Tupaki Desk   |   14 Aug 2024 3:41 AM GMT
టీడీపీలో చేరికలకు బ్రేకు వేస్తున్నదెవరో తెలిస్తే షాకే ?
X

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. కూటమి కట్టి పోటీ చేసినా సొంతంగా 135 సీట్లు దక్కాయి. అయిదేళ్ళ పాటు అద్భుతమైన రాజకీయ భవిష్యత్తు ఆ పార్టీలో ఉంటుంది. అంతే కాదు నారా లోకేష్ వంటి యువ నాయకత్వం అందుబాటులోకి వచ్చింది. దాంతో టీడీపీ మరిన్ని కాలాల పాటు ఏపీ రాజకీయాల్లో కీలక భూమిక పోషించడం ఖాయమన్నది కూడా కనిపిస్తున్న సత్యం.

అటువంటి టీడీపీలో చేరేందుకు ఉరుకులు పరుగులు పెడుతున్న నాయకులు అనేకమంది ఉన్నారు. ఈ మధ్యనే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఒక మాట అన్నారు. తాము గేట్లు తెలిస్తే వైసీపీ గల్లంతు కావడం ఖాయమని. ఆ మాట నిజమే కూడా. ఇప్పటికే చాలా జిల్లాల నుంచి వైసీపీ నేతలు అధికార పార్టీలోకి దూకుతామని చూస్తున్నారు వారు టీడీపీ నేతల ద్వారా రాయబారాలు నడుపుతున్నారు.

అయితే అలాంటి వారికి చుక్కెదురు అవుతోందిట. పసుపు పార్టీలో ప్రవేశించడం ఈసారి అంత ఈజీ కాదు అని అంటున్నారు. 2014 నుంచి 2019 మధ్యలో అనేక మంది వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. ఈసారి కూడా అలాగే అవుతుంది అని అనుకున్నా టీడీపీలో చేరికలు పెద్ద బ్రేకే పడిపోయింది అని అంటున్నారు. ఆ బ్రేకులను వేసిన వారు ఎవరో తెలిస్తే షాక్ తినాల్సిందే.

ఆయన ఎవరో కాదు చంద్రబాబు తరువాత టీడీపీలో పార్టీ పగ్గాలు అందుకునే నారా లోకేష్. నారా లోకేష్ చూస్తే రాజకీయంగా రాటు తేలారు. ఆయన 2014 నుంచి 2019 మధ్యలో కనిపించిన నేత అయితే కాదు. ఆనాడు ఆయన కొంత అనుభవ రాహిత్యంతో మీడియాకు మేత అయ్యేవారు. కానీ అయిదేళ్ల ప్రతిపక్ష పాత్ర ఆయనను సరైన లీడర్ గా చేసింది. ముఖ్యంగా యువగళం పాదయాత్ర లోకేష్ లో చెప్పలేని మార్పుని తెచ్చింది.

అందుకే లోకేష్ మంత్రిగా కీలకంగా ఉన్నా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. పూర్తిగా లో ప్రొఫైల్ ని మెయిన్ టెయిన్ చేస్తున్నారు ఎక్కడా ఆయన బయటకు అనవసర కామెంట్స్ చేయడం లేదు. ఆయన పని తాను చేసుకుంటూ ప్రజా సమస్యల మీద దృష్టి పెడుతున్నారు. ఆయన ఉదయాన్నే తన నివాసం వద్ద ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. అక్కడ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి మార్గాలు వెంటనే వెతుకుతున్నారు.

దాంతో లోకేష్ ప్రజా దర్బార్ కి మంచి స్పందన లభిస్తోంది. అలాగే శాఖాపరంగా పట్టుని పెంచుకుంటున్నారు. అంతే కాకుండా ఆయన టీడీపీ మీద పూర్తిగా దృష్టి పెడుతున్నారు. వైసీపీ హయాంలో పార్టీలో క్యాడర్ ఇబ్బంది పడింది.అటువంటి వారి వివరాలు అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. దాంతో గత వైసీపీ ప్రభుత్వం లో టీడీపీ క్యాడర్ ని వేధించిన వారిని ఆయన అసలు వదలడం లేదు. సైలెంట్ గానే పోలీసులకు ఆ వివరాలు ఇచ్చి పని కానిచ్చేస్తున్నారు అని అంటున్నారు. అలా క్యాడర్ ని ఆయన కాపాడుకుంటూ వారిలో ఆత్మ విశ్వాసం పెంచుతున్నారు.

ఇక ఇదే సమయంలో టీడీపీలోకి వస్తామని చెబుతున్న నాయకులను ఆయన ఎక్కడా తీసుకోవడం లేదు అని అంటున్నారు. ఎంతటి బడా లీడర్ అయినా అధికారంలో ఉంది కాబట్టి వచ్చి చేరుతామంటే వద్దు అని చెప్పేస్తున్నారు. అలా చేరడానికి కలవాలని అపాయింట్మెంట్లు కోరినా ఇవ్వడంలేదు అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే లోకేష్ 2029 నాటికి టీడీపీని పూర్తిగా తనదైన పద్ధతిలో మార్చాలని చూస్తున్నారు. ఎక్కువగా యూత్ కి చాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నారు.

టీడీపీ క్యాడర్ నుంచే అలాంటి నాయకత్వాన్ని ఆయన అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. సో లోకేష్ ఆలోచనలను చూస్తే కనుక టీడీపీకి ఈ ఫిరాయింపు నేతలు ఎవరూ అవసరం లేదు అనే అంటున్నారు. దాంతోనే చాలా మంది అధికార పార్టీలో చేరాలని ఉన్నా అవకాశం లేక అలా సైలెంట్ అయిపోయారు అని అంటున్నారు. మొత్తనికి చూస్తే టీడీపీకి కావాల్సినది ఏమిటో లోకేష్ బాగానే ఆకలింపు చేసుకున్నారు అని అంటున్నారు.