Begin typing your search above and press return to search.

వైరల్ వీడియో... పవన్ పాదాలకు లోకేష్ నమస్కారం!

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   13 Jun 2024 7:31 AM GMT
వైరల్  వీడియో... పవన్  పాదాలకు లోకేష్  నమస్కారం!
X

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే... ఈ స్థాయి విజయం దక్కడంలో పవన్ పాత్ర కీలకం అని చెబుతుంటారు. పవన్ మొదటి నుంచీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే పాయింట్ ను ఎత్తుకుని రాజకీయాలు చేశారు.. వ్యూహాలు రచించారు. టీడీపీ - జనసేన కూటమిలోకి బీజేపీని తేవడంలోనూ కీలక భూమిక పోషించారని ఆయనే స్వయంగా చెప్పారు!

ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు... పవన్ తీసుకున్న నిర్ణయం, తద్వారా చేసిన ప్రకటన ఏపీలో రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా మలుపు తిప్పిందని చెబుతుంటారు. అనంతరం పవన్ పై చంద్రబాబుకు, లోకేష్ కు గౌరవం, అభిమానం, ఆత్మీయత మరింత పెరిగాయని అంటుంటారు.

ప్రధానంగా సామాజికవర్గాల మధ్య విభేదాలు ఉన్నట్లు చర్చ ఉన్నప్పటికీ... ఎవరి అభిమానుల ఈగోలూ హర్ట్ అవ్వకుండా అన్నట్లుగా చంద్రబాబు – పవన్ లు ఒకరికి ఒకరు గౌరవం ఇచ్చిపుచ్చుకుంటూనే ఇంతకాలం ప్రయాణం సాగించారు. ఒకసారి చంద్రబాబు స్వయంగా పవన్ ఇంటికి వెళ్లి మంతనాలు సాగించగా.. పవన్ మరోసారి చంద్రబాబు నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు.

ఇలా ఎక్కడా ఎలాంటి విమర్శలకూ, అపోహలకూ, అపార్థాలకూ తావు లేకుండా జాగ్రత్తపడ్డారనే చెప్పాలి. ఆ సంగతి అలా ఉంటే... ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ వేదికపై కనిపించిన ఒక దృశ్యం ఇప్పుడు వైరల్ గా మారింది. ఇందులో భాగంగా... పవన్ కల్యాణ్ పాదాలకు నమస్కరిస్తూ లోకేష్ కనిపించారు. ఆ సమయంలో వద్దని పవన్ వారిస్తున్నా.. లోకేష్ మాత్రం తగ్గలేదు!

వయసులో తనకంటే చాలా పెద్దవాడైన పవన్ కల్యాణ్ పాదాలకు నారా లోకేష్ నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం లోకేష్ ని ఆప్యాయంగా హత్తుకున్నారు పవన్ కల్యాణ్. ఇప్పుడు ఈ దృశ్యం వైరల్ గా మారింది. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోకి... "పవన్ కల్యాణ్ అంటే లోకేష్ కి చాలా గౌరవం" అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు!