Begin typing your search above and press return to search.

లోకేష్ కి ఈసారి కూడా కష్టమేనా ?

అయితే నారా లోకేష్ వైపు నుంచి చూస్తే ఇది లైఫ్ అండ్ డెత్ ఇష్యూగా ఉంది. ఈసారి గెలిచి అసెంబ్లీ మెట్లు ఎక్కకపోతే మాత్రం లోకేష్ రాజకీయ జీవితానికి అతి పెద్ద ఫుల్ స్టాప్ పడిపోతుంది.

By:  Tupaki Desk   |   19 April 2024 11:51 AM GMT
లోకేష్ కి ఈసారి కూడా కష్టమేనా ?
X

టీడీపీ యువ నాయకుడు, చంద్రబాబు తరువాత టీడీపీ పగ్గాలు చేపట్టాల్సిన వారు అయిన నారా లోకేష్ రాజకీయ భవితవ్యం ఈసారి ఎన్నికల్లో తేలనుంది. ఆయన మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అయితే ఆయన 2019లో మంత్రిగా ఉంటూ పోటీ చేస్తే అయిదు వేల ఓట్ల తేడాతో ఓటమి పాలు అయ్యారు. ఈసారి మాత్రం ఆయన గెలవాలని పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు అయితే లోకేష్ కి మంగళగిరి ఈసారి అయినా విజయం అందిస్తుందా అంటే డౌటానుమానాలు చాలానే ఉన్నాయని అంటున్నారు.

మంగళగిరిలో ప్రస్తుతం చూస్తే లోకేష్ కి ఫుల్ టైట్ గా ఉందని తాజా వార్తల సారాంశంగా ఉంది. ఈ విషయం లోకల్ సర్కిల్స్ లో గట్టిగానే వినిపిస్తోంది. లోకేష్ చెబుతున్న మాట అయితే గెలుపు ఖాయం అయింది అని. మెజారిటీ యాభై వేలకు తక్కువ రాకుండా చూస్తామని. కానీ అక్కడ రాజకీయం చూస్తే అలాంటి పరిస్థితి అయితే లేదు అని అంటున్నారు. నారా లోకేష్ హోరా హోరీ పోరులోనే ఉన్నారని అంటున్నారు.

దానికి కారణం ఆళ్ళ రామక్రిష్ణారెడ్డి అలియాస్ ఆర్కే అని అంటున్నారు. ఆళ్ల వైసీపీలో తిరిగి చేరిన తరువాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది అని అంటున్నారు. ఆయన మొత్తం ఎన్నికను తన భుజాల మీద వేసుకుని పనిచేస్తున్నారు అని అంటున్నారు. దాంతో అప్పటిదాకా టీడీపీకి మొగ్గుగా కనిపించిన సీన్ కాస్తా రివర్స్ అవుతోంది అని అంటున్నారు.

ఇక మంగళగిరి నియోజకవర్గం సామాజికవర్గాల పరంగా చూస్తే పూర్తిగా బీసీ సీటుగా వస్తుంది. అక్కడ బీసీలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. దాంతో పాటు జగన్ నిలబెట్టిన అభ్యర్ధి మురుగుడు లావణ్య దాదాపుగా డెబ్బై వేల ఓట్ల సంఖ్య కలిగిన చేనేత సామాజిక వర్గానికి చెందిన వారు. దాంతో పాటు జగన్ ప్రతీ సభలో నా ఎస్టీ నా బీసీ నా ఎస్సీ అని చెబుతూ ఉంటారు. దాంతో మంగళగిరిలోని బీసీలు అంతా వైసీపీకి అతి పెద్ద ఓటు బ్యాంక్ గా మారారు అని లోకల్ టాక్ గా ఉంది అంటున్నారు.

అంతే కాదు గత రెండు టెర్ముల నుంచి బీసీలకు ఈ సీటు అందని దాక్షగా ఉంది. 2009లో చివరి సారిగా బీసీ అభ్యర్ధి ఇక్కడ గెలిచారు. 2014, 2019లలో ఆళ్ళ గెలిచారు. అంటే ఓసీ అభ్యర్ధి అన్న మాట. ఈసారి కూడా ఓసీనే గెలిస్తే పూర్తిగా బీసీ నియోజకవర్గం తమ చేతుల నుంచి జారిపోతుంది అన్న బెంగ అయితే ఆయా సామాజిక వర్గాలలో ఉన్నాయని అంటున్నారు. దాంతో బీసీలు అంతా కోటను కట్టి మరీ మంగళగిరిని ఈసారి కాపడుకోవాలని చూస్తున్నారు.

అయితే నారా లోకేష్ వైపు నుంచి చూస్తే ఇది లైఫ్ అండ్ డెత్ ఇష్యూగా ఉంది. ఈసారి గెలిచి అసెంబ్లీ మెట్లు ఎక్కకపోతే మాత్రం లోకేష్ రాజకీయ జీవితానికి అతి పెద్ద ఫుల్ స్టాప్ పడిపోతుంది. దాంతో నారా లోకేష్ మొత్తం రాష్ట్ర పర్యటనలు అన్నీ పక్కన పెట్టి గట్టిగానే ఫీల్డ్ లో తిరుగుతున్నారు అని అంటున్నారు. ఈసారి గెలుపు మాత్రమే కాదు మంచి మెజారిటీని తెచ్చుకోవాలని కూడా చూస్తున్నారు అని అంటున్నారు.

ఆయనకు టీడీపీ వ్యూహకర్త రాబిన్ శర్మ సెపరేట్ వింగ్ పెట్టి మరీ ఎప్పటికపుడు వ్యూహ రచన చేస్తూ పరిస్థితిని అనుకూలం చేస్తున్నారు అని అంటున్నారు. ఇక మొత్తం ఓటర్లు రెండు లక్షలకు పైగా ఉంటే ఓటర్ల మ్యాపింగ్ చేసి మరీ లోకేష్ మంగళగిరిని మొత్త్తం తన గుప్పిట పట్టేలాగానే చేస్తున్నారు అని అంటున్నారు. ఇవన్నీ చూసినపుడు మంగళగిరిలో పోటా పోటీగానే ఉంది అని అంటున్నారు.

ఇవనీ పక్కన పెడితే గుంటూరు జిల్లాలో టీడీపీకి అనుకూలంగా రాజకీయ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ ప్రభావం కచ్చితంగా మంగళగిరి మీద పడుతుంది అని అంటున్నారు. దీంతో లోకేష్ ఎలాగైనా మంచి మెజారిటీతో గెలుస్తారు అని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఏది ఏమైనా మంగళగిరి మాత్రం అంత సులువు కాదు అనే అంటున్నారు.

దానికి ఉదాహరణ లోకేష్ మంగళగిరి గడప దాటి బయటకు రాలేకపోవడమే అని చెబుతున్నారు. ఆ విధంగా లోకేష్ పద్మవ్యూహంలో చిక్కుకుని పోయారనే అంటున్నారు. ఏది ఏమైనా మంగళగిరిలో గత కొన్ని దశాబ్దాలుగా చూస్తే పెద్ద మెజారిటీలు ఎవరికీ రాలేదు. ఇక టీడీపీ అక్కడ గెలిచి నాలుగు దశాబ్దాలు అయింది. ఇవన్నీ చూసినపుడు వైసీపీ వర్సెస్ టీడీపీగా మంగళగిరిలో టఫ్ ఫైట్ సాగుతోందనే అంటున్నారు.