Begin typing your search above and press return to search.

లోకేష్ ఇంకా సబ్జెక్ట్ తెలుసుకోవాలి!

అవును... స్కిల్ సెన్సస్ సర్వేపై స్కిల్ డెవలప్మెంట్ అధికారులతో ఉండవల్లి నివాసంలో సమీక్ష నిర్వహించారు మంత్రి నారా లోకేష్.

By:  Tupaki Desk   |   24 Aug 2024 5:30 AM GMT
లోకేష్  ఇంకా సబ్జెక్ట్  తెలుసుకోవాలి!
X

సాధారణంగా ఓ వ్యక్తి జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు ఏమి తీసుకుని వెళ్తాడు? తాను కష్టపడి చదివి సంపాదించుకున్న సర్టిఫికెట్లు.. తాను సొంతంగానో, స్నేహితుల సాయంతోనో, ఇంటర్నెట్ సహాయంతోనో తయారు చేసుకున్న రెజ్యుమ్ ను తీసుకుని వెళ్తాడు. అయితే తాజాగా.. ఆ రెజ్యూమ్ ను తామే తయారు చేస్తామని.. ఆ ప్రొఫైల్ ని ప్రముఖ కంపెనీలకు నెరుగా యాక్సెస్ ఇస్తామని అంటున్నారు లోకేష్.

అవును... స్కిల్ సెన్సస్ సర్వేపై స్కిల్ డెవలప్మెంట్ అధికారులతో ఉండవల్లి నివాసంలో సమీక్ష నిర్వహించారు మంత్రి నారా లోకేష్. ఈ సందర్భంగా యువతకు చెందిన ఎడ్యుకేషన్, ఎంప్లాయ్ మెంట్, స్కిల్ ప్రొఫైల్స్ ను స్కిల్ సెన్సస్ లో క్రోడీకరించి ప్రభుత్వమే ఓ ప్రత్యేకమైన రెజ్యూమ్ తయారు చేసిన ప్రొఫైల్స్ ని ప్రముఖ కంపెనీలకు నేరుగా యాక్సెస్ ఇస్తామని వెల్లడించారు నారా లోకేష్.

తద్వారా.. ఆయా కంపెనీలు తమకు అవసరమైన నైపుణ్యం ఉన్న యువతను నేరుగా ఎంపిక చేసుకునే విధానం అందుబాటులోకి తీసుకొస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పుకొచ్చారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ, యువతకు ఉద్యోగాల కల్పన.. ఈ రెండు అంశాలే నైపుణ్య గణన అంతిమ లక్ష్యం అని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.

ఈ సందర్భంగా తాజాగా మంగళగిరిలో పైలెట్ ప్రాజెక్టుగా స్కిల్ సెన్సస్ సర్వే చేపట్టాలని అధికారులకు సూచించారు. అయితే... నారా లోకేష్ వెల్లడించిన ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా జాబ్ సీకర్స్ కి రెజ్యూమ్ ను ప్రభుత్వమే తయారు చేసి ఇవ్వడం వల్ల ప్రాక్టికల్ గా ఎదురయ్యే సమస్యలను ఆన్ లైన్ వేదికగా వెల్లడిస్తున్నారు.

వాస్తవానికి జాబ్ సీకర్స్ వాళ్ల వాళ్ల ఎమోషన్స్, మార్కెట్ అనాలసిస్, రిఫరెన్స్ మొదలైన అంచనాలను బేస్ చేసుకుని రెజ్యూమ్ తయారు అవుతుంది. మార్కెట్ లో వాళ్ల ఫ్రెండ్స్ ద్వారానో, ఇంటర్నెట్ ద్వారానో తయారు చేసుకుంటారు. ఇదే సమయంలో... జాబ్ బోర్డ్స్ లో తమ తమ రెజ్యూమ్ ఎలా పోస్ట్ చేయాలో అవన్నీ క్యాండిడేట్ కు తెలుసు. పైగా... అది ఆయా కంపెనీలను బట్టి మారుతుందని కూడా అంటుంటారు.

ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూకి వెళ్లిన క్యాండిడేట్ ను రెజ్యూమ్ గురించి ప్రశ్నిస్తే... ఇది తన తరుపున ప్రభుత్వమే తయారు చేసిందని సదరు క్యాండిడేట్ చెప్పగలడా.. అలా చెబితే ఉద్యోగం ఇచ్చే సంస్థకు క్యాండిడేట్ పై సదాభిప్రాయం వెలువడుతుందా..? ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అని అంటున్నారు నెటిజన్లు. ఈ విషయాలను సలహాలు ఇచ్చేవారు పరిగణలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఈ సందర్భంగా లోకేష్.. తనకు మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చే వాళ్లను పెట్టుకోవాలని, ఇలాంటి మిడి మిడి జ్ఞానంతో సలహాలు, సూచనలు ఇచ్చే వారిని పెట్టుకుంటే ఎలా అని యువత ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి నిర్ణయాల వల్ల మొదటికే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు. మరి ఈ విషయంపై చినబాబు పునరాలోచన చేస్తారా.. లేక, ఆ విధంగా ముందుకుపోతారా అనేది వేచి చూడాలి!